Dr BR Ambedkar Samajika Nyaya Maha Shilpam
-
ఆ ఏడుపులకు సీఎం జగన్ దిమ్మదిరిగే సమాధానం
విజయవాడ అంతా మురిసింది. లక్షలాది మంది ప్రజలు మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జై కొట్టారు. ఆయన చేసిన ప్రసంగం సైతం ఆకర్షణీయంగా ఉంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ భారీ విగ్రహావిష్కరణ సందర్భంలో జరిగిన ఈ సభలో జగన్ విపక్షాలపైన, తెలుగుదేశం అధికారిక ఈనాడు మీడియాపై విసిరిన విసుర్లు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. ✍️ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు వంటివారు నయా పెత్తందార్లని, అంబేడ్కర్ భావజాలానికి వ్యతిరేకులని, కొత్త రూపంలో అంటరానితనాన్ని అమలు చేసే యత్నం చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ఆయన తన స్పీచ్‌లో ఏపీలో అంటరానితనాన్ని కొత్తరూపంలో పెత్తందార్లు ఎలా ప్రదర్శిస్తున్నారో సోదాహరణంగా వివరిస్తున్నప్పుడు ప్రజలలో హర్షాతిరేకాలు కనిపించాయి. ✍️జగన్ సభలో ఉన్నంతసేపు వచ్చిన స్పందన చూస్తే బలహీనవర్గాలలో ఆయన పట్టు తిరుగులేనిదని మరోసారి రుజువైంది. తన స్పీచ్‌ను ఆయన రెండు భాగాలుగా చేసుకుని మాట్లాడారు. తాను అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నది వివరించడానికి వివిధ స్కీములను వివరించారు. మరో భాగంలో పెత్తందార్లు, పేదలకు మధ్య సాగుతున్న పోరాటాన్ని తెలియచేశారు. పలుమార్లు ఆయన నా..నా..నా..నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంటూ ప్రస్తావించడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే వచ్చే ఎన్నికలకు ఆయన టోన్ సెట్ చేసినట్లనిపిస్తుంది. ✍️ఇప్పటికే సామాజిక సాధికారికత పేరుతో బలహీనవర్గాల యాత్రలను నిర్వహిస్తున్న జగన్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ద్వారా ఆ వర్గాలలో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపారు. అంబేడ్కర్ ప్రతిపాదించిన సామాజిక న్యాయాన్ని ఎలా అమలు చేస్తున్నది తెలియచెబుతూ తన ప్రభుత్వంలో వివిధ పదవులలో బలహీనవర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచేశారు. నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం, స్థానిక సంస్థలలో ఏభై శాతంపైగా పదవులు ఈ వర్గాలకే కేటాయించడం, క్యాబినెట్లో పదిహేడు మందికి బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం తదితర అంశాలను వివరించారు. బలహీనవర్గాలకు ప్రభుత్వాన్ని అందుబాటులోకి తెచ్చామని, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ అందులో భాగమేనని ఆయన గుర్తు చేశారు. ✍️కొత్త రూపం దాల్చిన అంటరానితనాన్ని ఆయన విశ్లేషిస్తూ, ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయడం ఈ పెత్తందార్లకు నచ్చడం లేదని, తద్వారా వారు అంటరానితనాన్ని కొత్త రూపంలో చూపుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు టైమ్‌లో అసలు ప్రభుత్వ బడులను పట్టించుకోలేదని ఆయన చెప్పడంతో పాటు ఆంగ్ల మీడియం గురించి కూడా ప్రస్తావించారు. ఈనాడు పత్రికలో అంబేడ్కర్ తెలుగు మీడియంలోనే చదవాలన్నారని రాసిన కథనంపై ఆయన మాట్లాడుతూ పచ్చి అబద్దాలను ఈ మీడియా చెబుతోందని, అంబేడ్కర్ నాలుగో తరగతిలోనే ఆంగ్ల మీడియంలో మంచి మార్కులు తెచ్చుకుంటే ఆయన బంధువులు అభినందించారని పేర్కొన్నారు. ✍️తమ పిల్లలు, తమ మనుమళ్లు మాత్రం ఆంగ్లంలో చదవాలని, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేద పిల్లలు ఆంగ్ల మీడియాలో విద్య నభ్యసించరాదని రామోజీరావు వంటివారు ప్రచారం చేస్తున్నారు.. ఇది కొత్త తరహా అంటరానితనమేనని జగన్ అన్నారు. చివరికి పేద పిల్లలకు టాబ్లు అందచేసినా రామోజీరావు సహించలేకపోతున్నారని, దానిపై కూడా విషపు రాతలు రాసే నీచపు స్థాయికి ఈనాడు దిగజారిందని ఆయన ధ్వజమెత్తారు. వృద్దులకు ఇళ్లవద్దే పెన్షన్ ఇస్తుంటే వారు ఓర్చుకోలేకపోతున్నారని, ఇది అంటరానితనం కొత్తరూపమేనని ఆయన అన్నారు. ✍️తన ప్రభుత్వం రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చినా దానిని కప్పిపుచ్చాలని ప్రతిపక్షం, వారి మీడియా యత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఇలా తన ప్రభుత్వ కార్యక్రమాలను, అంబేడ్కర్ ఆశయాలతో పోల్చుతూ సామాజిక న్యాయం తన ప్రభుత్వంలోనే జరుగుతోందని చెప్పే యత్నం చేశారు. గతంలో చంద్రబాబు దళితులను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అన్నారని, బీసీల తోకలు కట్ చేస్తానని అన్నారని, ఆయనకు బలహీనవర్గాలంటే చులకన అని జగన్ విమర్శించారు. రియల్ ఎస్టేట్ రాజధానిలో దళితుల అస్సైన్డ్ భూములను పెత్తందార్లు కాజేశారని ఆయన అన్నారు. ఈ రకంగా మొత్తం తన స్పీచ్ అంతటిని బలహీనవర్గాల గుండెల్లో నిలబడిపోయేలా జగన్ ప్రసంగం సాగిందంటే అతిశయోక్తి కాదు. ✍️ఈనాడు పత్రిక శుక్రవారం నాడు ఎంత నీచంగా కధనాలు ఇచ్చిందంటే మాటలలో వర్ణించడం కష్టం. జగన్‌కు అంబేడ్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత లేదంటూ పిచ్చి ప్రేలాపనలకు దిగింది. వార్తాపత్రికగా కన్నా, తెలుగుదేశం కరపత్రిక కన్నా హీనంగా స్టోరీలను వండి, ప్రజల దృష్టిలో మరింత పలచన అయింది. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలను ఇష్టారాజ్యంగా చేస్తూనే, మరోవైపు ఏపీలో ప్రజాస్వామ్యం లేదని, పత్రికా స్వేచ్చ లేదని అబద్దాలు చెబుతోంది. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజున ఆ ఘట్టాన్ని ఎంత గొప్పగా రాసింది. అదే ఏపీలో ప్రపంచంలోనే అతి భారీ విగ్రహావిష్కరణ చేస్తే ఏ స్థాయిలో విషం కక్కారో గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పలు విశ్లేషణలు వచ్చాయి. ✍️నిజానికి ఇలాంటి ఘట్టాలు జరిగినప్పుడు ముందుగా దానికి సంబంధించిన విశేషాలు ప్రజలకు తెలియచెప్పాలి. అంబేడ్కర్ విగ్రహం స్థాపనకు ఏ రకంగా కృషి జరిగింది. ఇందుకోసం ఏఏ వస్తువులను ఎలా వినియోగించారు. ఎంత స్టీల్, ఎంత సిమెంట్ వాడారు?. పార్క్ తయారీకి, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, కన్వెన్షన్ సెంటర్లు మొదలైన విశేషాల గురించి తెలియచేస్తూ కధనాలు ఇవ్వాలి. ఆ తర్వాత ఏవైనా లోటుపాట్లు ఉంటే వార్తలు ఇవ్వవచ్చు. అలా చేయకుండా ఈనాడు మాత్రం పచ్చి పాపంగా పిచ్చి,పిచ్చిగా ప్రభుత్వ వ్యతిరేక కధనాలతో జగన్ ప్రభుత్వంపై పడి తెగ ఏడ్చింది. ✍️మంత్రి అంబటి రాంబాబు అన్నట్లు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించడాన్ని తట్టుకోలేక ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగ ఏడ్చేశాయి. దానిని అక్షర సత్యం చేసేలానే ఈ మీడియా పనిచేస్తోంది.అంబేడ్కర్ విగ్రహావిష్కర నేపథ్యంలో స్టేడియంలో సభలో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ అంబేడ్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరించడానికి వెళ్లారు. ఆ సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షో అందరిని ఆకట్టుకుందని చెప్పాలి. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో బలహీనవర్గాలపై విపరీత ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఆందోళన చెందుతున్న తెలుగుదేశం నేతలు విగ్రహానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు, కొందరైతే మరీ తీవ్రవాదంతో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ✍️అది నిజమే అయితే టీడీపీ తన గొయ్యి తనే తవ్వుకున్నట్లవుతుంది. అసలు బలహీనవర్గాలలో టీడీపీ పట్టు కోల్పోయిందని అంచనాలు ఉన్న సమయంలో టీడీపీ నేతలు అసహనంతో ఏమైనా వ్యాఖ్యలు చేస్తే, కాస్తో, కూస్తో ఇంకా ఎవరైనా టీడీపీలో ఉన్న బలహీనవర్గాలు కూడా వారికి ఒక నమస్కారం చేసి వైఎస్సార్సీపీకి మద్దతు పలుకుతారని గమనించాలి. గతంలో ఇలాంటి ఘట్టాలు జరిగితే సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని లేదా నిర్వాహకులకు అభినందిస్తుండేవి. కాని చంద్రబాబు రాజకీయాలలో తెలుగుదేశాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. ఇదీ చదవండి: పెత్తందారీ పోకడలూ అంటరానితనమే ✍️ఏమి చేసినా తిట్టడానికే టీడీపీ పరిమితం అవుతోంది. ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు మీద కూడా టీడీపీ అలాగే రోధిస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా కన్నీరు, మున్నీరుగా విలపిస్తూ కధనాలు ఇచ్చి ప్రజల మనసులలో విషం నింపాలని యత్నించాయి. కాని ప్రజలు ఇప్పటికే అర్ధం చేసుకున్నారు. వీరు ఎంతగా విషం చిమ్మినా అది వారికే నష్టం. ఎందుకంటే ఎల్లో మీడియాను ప్రజలు నమ్మడం మానేశారు. ఏది ఏమైనా అంబేడ్కర్ విగ్రహావిష్కరణను ఒక చారిత్రక సన్నివేశంగా మలచి, విజయవాడ ప్రతిష్టను, ఆంధ్రప్రదేశ్ కీర్తిని దశదిశలా చాటినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు అభినందనలు -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Vijayawada Ambedkar Statue Pics: చరిత్రలోనే అరుదైన ఘట్టం.. సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ (ఫొటోలు)
-
Dr. BR Ambedkar Statue Drone Show: అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. అబ్బురపరిచిన డ్రోన్ షో (ఫొటోలు)
-
చంద్రబాబుకు దళితులంటే నచ్చదు: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని.. ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో మాట్లాడుతూ, పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. విజయవాడ– సామాజిక చైతన్యాలవాడ ఈ రోజు మన విజయవాడను చూస్తుంటే.. సామాజిక చైతన్యాలవాడగా ఇవాళ కనిపిస్తుంది. భారతరత్న, బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మహావిగ్రహం, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ, మొత్తం దళిత జాతికి, బహుజనులకు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈ రోజు మీ జగన్ ఈ వేదికపైనుంచి అభినందనలు తెలియజేస్తున్నాడు. సామాజిక న్యాయ మహాశిల్పం– దేశంలో మారుమోగనున్న విజయవాడ. ఈ మహా విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మనకు కనిపిస్తుంది. దాని గురించి మనం మాట్లాడుతాం. కానీ ఇక మీదట నుంచి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ పేరు మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. ఇది ఈ విజయవాడలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే.. అంబేద్కర్ జన్మించి 133 సంవత్సరాల తర్వాత, అంబేద్కర్ మరణించిన 68 సంవత్సరాల తర్వాత కూడా ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్– సామాజిక న్యాయ మహా శిల్పం కింద ఈ రోజుకి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకు చేస్తున్నామంటే కారణం... ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్ధిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘసంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడు విగ్రహం విజయవాడలో ఆవిష్కారం అవుతోంది. అంబేద్కర్ నిరంతర స్ఫూర్తి... బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటాడు. ఎప్పటికీ మన అడుగుల్లోనూ, బ్రతుకుల్లోనూ కనిపిస్తాడు. ఈ దేశంలో పెత్తందారీతనం మీద, అంటరానితనం మీద, కుల అహంకారవ్యవస్ధల దుర్మార్గులు మీద, ఆ దుర్మార్గాల మీద, అక్కచెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు ఆ మహామనిషి నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు. 75వ రిపబ్లిక్‌డేకు వారం రోజుల ముందే... విజయవాడలో.. అది కూడా స్వాతంత్య్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో, 75వ రిపబ్లిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందు మనం అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరిస్తున్నాం. ఈ విగ్రహం చూసినప్పుడల్లా పేదలు, మహిళలు హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్పూర్తి ఇస్తూనే ఉంటుంది. అంటరానితనంపై తిరుగుబాటు. అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకున్నా మనకు కనిపిస్తుంటాడు. ఈరోజు ఆయన సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా ఎప్పుడూ మనందరికీ ఆయన గురించి ఆలోచన చేసినప్పుడు కనిపిస్తుంటాడు. రాజ్యాంగ హక్కుల ద్వారా, రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ స్పూర్తి నిస్తూనే ఉంటాడు. తమ గొంతు విప్పలేని దళిత వర్గాలకు, అల్పసంఖ్యాకులకు, వాయిస్ లెస్ పీపుల్‌కు.. గొంతు వినిపించలేని అట్టడుగునున్న ఉన్న వర్గాలకు, ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్ కల్పించాలని చరిత్ర గతిని మార్చిన పూనాపాక్ట్ జరగడానికి కారకులు అంబేద్కర్. ఈ రోజు దళిత జాతి నిలబడిందన్నా, అల్ప సంఖ్యాకులు నిలబడగలుగుతున్నారన్నా కూడా రిజర్వేషన్లు కల్పించి ఒక్క తాటిపై నిలబెట్టే కార్యక్రమం జరిగిందంటే అది అంబేద్కర్ గారి స్పూర్తి. ఇవాళ ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారినవర్గాలకు నిరంతరం ధైర్యాన్ని, శక్తిని, అండను ఇస్తుంది. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది. పోరాటానికి ప్రతిరూపం– బాబాసాహెబ్ చదువుకునేందుకు వీల్లేదని తరతరాలుగా అణచివేసిన వర్గాల్లో తాను జన్మించి, చదువుకొనేందుకు మాకు మాత్రమే హక్కుందని అని చెప్పి అనుకొనే వర్గాలకన్నా... కూడా గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేద్కర్ గారు. ఆయన బడిలో చదువుకుంటున్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి ఆ తరగతి గదిలో మంచి నీరు తాగాలంటే కుండలో నుంచి గ్లాసు ముంచుకొని నీరు తాగడానికి వీల్లేదట. బడిలో ప్యూను దళిత విద్యార్థులకు నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో పై నుంచి పోసేవాడట. ఒక్కసారి ఆంబేద్కర్ గారి మాటల్లో వింటే... బడికి ఏరోజైనా ప్యూన్ రాకపోతే ఆరోజు తాగడానికి మంచినీళ్లు లేనట్టే అనే మాటలు బాధ కలిగిస్తాయి. అలాంటి నిజాలను చూసినప్పుడు ఇంకా మనం ఎక్కడ ఉన్నామని అనిపించే మాటలివి. అంటరాని తరాన్ని స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును, ఓ విప్లవాన్ని, ఓ స్వాతంత్య్ర పోరాటాన్ని వీటన్నింటినీ ఉమ్మడిగా చూస్తే, ఉమ్మడి చేస్తే...ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్. అటువంటి పరిస్థితులు స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా వేర్వేరు రూపాల్లో ఇవాళ్టికీ ఉన్నాయి. రూపం మార్చుకున్న అంటరానితనం.. అంటరానితనం రూపం మార్చుకుంది అంతే.. అంటరానితనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడమే మాత్రమే అంటరానితనం కాదు. అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో, ఆ గవర్నమెంట్ బడిని పాడుపెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని తెలియజేస్తున్నాను. డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి, పేద పిల్లలు తెలుగుమీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీషు మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈ రోజు కూడా ఈ అహంకారులు, ఈ పెత్తందార్లు తమ పత్రికలో రాశారు. పొద్దున్నే పత్రిక చదివాను. అంబేద్కర్ తెలుగు మీడియం మాత్రమే ఉండాలి అని అన్నారట. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతారట. వీళ్ల మాటలు చూస్తే ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెబుతున్నారో చూస్తే బాధనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే.. అంబేద్కర్ చదువుకున్నది ఇంగ్లీషు మీడియంలో, ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లిషు మీడియంలో పాసైనప్పుడు బంధుమిత్రులంతా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందార్ల పత్రిక, ఆ ఈనాడు పత్రిక ముసుగులో.. తాము పాటించే ఈ అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, నీచులు మన దళితులకు, బహుజనులకు వ్యతిరేకులు. చరిత్రను వక్రీకరిస్తూ రాతలు.. చివరికి చరిత్రను కూడా ఇలాంటి వాళ్లు వక్రీకరిస్తూ రాతలు రాస్తున్నారంటే ఏ స్థాయికి పాత్రికేయం పడిపోయిందని ఆలోచన చేయమని కోరుతున్నాను. పేద కులాల వారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారుగా ఉండిపోవాలట. తమ ఇళ్లల్లో పనివారుగా, తమకు సేవకులుగా ఉండిపోవాలట. చిన్న, చిన్న వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్లు చేసుకోవాలట. తమ అవసరాలు తీర్చేవారుగానే మాత్రమే వాళ్లు మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు ఏ ఆస్పత్రిలోకి వైద్యం చేయించుకుంటున్నారో. ఆ గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతోందో, అటువంటి ఆస్పత్రులు నీరుగార్చడం, పేదలు ఏ బస్సుల్లో ఎక్కుతున్నారో.. ఆ ఆర్టీసీని కూడా ప్రయివేటుకు అమ్మేయాలనుకోవడం ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌర సేవ కావాలన్నా, ఏ పథకం పేదవాడికి కావాలన్నా, వారు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగేలా... వారి సహనాన్ని పరీక్షించడం కూడా.. రూపం మార్చుకున్న అంటరాని తనమే. అవ్వాతాతలకు పెన్షన్, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో నిలబడి, చివరకి ఆ క్యూలైన్లలోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈ అంటరానితనంలో పేదల మీద పెత్తందారీ భావజాలంలో ఇవన్నీ కూడా భాగాలే. ఎస్సీల అసైన్డ్ భూముల్ని కూడా కాజేసి తాము గజాల లెక్కన అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజికవర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములిస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులకు వెళ్లి, కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు సైతం వెళ్లి పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేద వర్గాల పిల్లలకు ట్యాబులిస్తే అందులో వారు చూడకూడనివి చూస్తున్నారంటూ.. వాళ్ల పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని, ట్యాబులున్నాయన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ, డిజిటల్ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదని కుట్రపూరితంగా రాతలు రాయడం, వాదించడం కూడా రూపంమార్చుకున్న అంటరానితనమే. 56 నెలల మన సామాజిక, ఆర్దిక, రాజకీయ యుద్దానికి నిదర్శనం. స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అలాగే మిగిలిపోయిన ఈ రూపం మార్చుకున్న అంటరానితనంపై.. 56 నెలలుగా మనం చేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కనిపిస్తుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఈ విగ్రహం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 81 అడుగుల వేదిక ఏర్పాటు చేసి, దాని మీద 125 అడుగుల మహా విగ్రహం. అంటే 206 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం.. దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడుతున్నామని తెలియజేస్తున్నాను. తరతరాలు ఈ ఆకాశమంత మహానుభావుడిని గుర్తుచేసుకోవాలి తరతరాలు కూడా ఈ ఆకాశమంతటి మహానుభావుడి, ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి పిల్లాడూ, ప్రతి పాపా ఆయన జీవిత చరిత్ర నుంచి స్పూర్తిని తెచ్చుకోవాలి. ఎందుకంటే అభివృద్ధికి, అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం. ఇలాంటి భావజాలం మన పెత్తందార్లకు మాత్రం నచ్చదు. పెత్తందార్లంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమయ్యుంటుంది. చంద్రబాబు దళితులకు చేసింది శూన్యం దళితులకు చంద్రబాబు నాయుడు సెంటు భూమిని ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చింది లేదు, అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకంటే లేదు. ఎందుకంటే చంద్రబాబు రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఏ కోశానా, ఏనాడూ కూడా ఈ మనిషికి ప్రేమే లేదు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాల్లో ఆ ఎస్సీలు ఎలా బతకగలుగుతారనే కనీస ఆలోచన చేయకుండా అంత చులకనగా మాట్లాడే స్వభావం. బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దార్ అన్న వ్యక్తి, పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా పేద అక్కచెల్లెమ్మలు, కుటుంబాలు బాగుండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలో ఎప్పుడూ చూడని విధంగా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది ?. పెత్తందారీ పార్టీలకు, నాయకులకు చదువుకొనే మన పేద పిల్లలకు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యాకానుక, ట్యాబులు ఇవ్వాలని, ఇంగ్లీషు మీడియంలో చదువులు చెప్పించాలని, బైలింగువల్ బుక్స్ ఇవ్వాలని, మన గవర్నమెంట్ బడుల్లో మన తరగతి గదుల్లో డిజిటలైజేషన్ జరగాలని, ఐఎఫ్ పీలు ఏర్పాటు చేయాలని, నాడునేడుతో మన చదువులు మార్చాలని ఇటువంటి పెత్తందారీ నాయకులకు, పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది? పెత్తందారీ పార్టీలకు, నాయకులకు మన అక్కచెల్లెమ్మలకు ఒక దిశా యాప్ తేవాలని, అమ్మ ఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత ఇవ్వాలని, అక్కచెల్లెమ్మలపేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, 22 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చి.. వారి ముఖాలలో చిరునవ్వులు చూడాలని పెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? ఆలోచన చేయండి. మన రైతన్నలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసాతో రైతన్నలకు ఆదుకోవాలని, వారికి చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది?. పెత్తందారీ పార్టీలకు, నాయకులకు.. పేదలకు వైద్యం, ఆరోగ్యం కోసం వారికి మెరుగైన ఆరోగ్యశ్రీ ఇవ్వాలని, ఆరోగ్య ఆసరాతో ఆదుకోవాలని, 104, 108 ఫోన్ కొడితే చాలు కుయ్.. కుయ్.. కుయ్ అంటూ పేద వాడి ముంగిటకు వచ్చి, పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని, గ్రామ స్ధాయిలో విలేజ్ క్లినిక్ రావాలని, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావాలని, ఆస్పత్రులు రూపు రేఖలు మారాలని, వైద్యం కోసం పేదవాడు వెళితే 53 వేల మంది డాక్టర్లు, నర్సులను ఆసుపత్రులలో రిక్రూట్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఆ పెత్తందారీ పార్టీలకు, పెత్తందారీ నాయకులకు గ్రామ స్థాయిలోనే ఒక లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను తీసుకురావాలని, ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని, సచివాలయం తేవాలని ప్రతి పేదవాడికీ అందుబాటులతో ఉండాలని ఎందుకు అనిపిస్తుంది?. పెత్తందారీ పార్టీలకు, నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లోనూ, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ 50 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ 50 శాతం పదవులు ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేయాలని వాళ్లకు ఎందుకు అనిపిస్తుంది? మంత్రిమండలిలో ఏకంగా 4 డిప్యూటీ సీఎం పదవులు, నా అంటూ.. నా ఎస్సీలకు,ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు మనం ఇస్తే, మంత్రి మండలిలో 68 శాతం మంత్రి పదవులు ఇస్తూ... సామాజికపరంగా రాజకీయ పదవుల్లో దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 56 నెలల్లో అడుగులు పడ్డాయి. శాసనసభ స్పీకర్ గా బీసీ, శాసన మండలి చైర్మన్ గా ఒక ఎస్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా ఒక మైనార్టీ అక్కకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. మనందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు నా వాళ్లు అనుకుంటున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల వారే. మండలిలో మన పార్టీ వారు 43 మంది సభ్యులుంటే అందులో 29 మంది నా అని నేను పిల్చుకుంటున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్మన్ పదవులుంటే అందులో 9 నా అంటూ నేను పిల్చుకుంటున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే. 17 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అందులో 12 నా అంటూ నేను పిల్చుకుంటున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములే కనిపిస్తున్నారు. రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలుంటే అందులో 84 మీ బిడ్డ గెలుచుకుంటే.. అందులో ఏకంగా 58 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలే కనిపిస్తున్నారు. 196 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటే అందులో ఏకంగా 117 ఏకంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 137 కార్పొరేషన్ చైర్మన్ పదవులుంటే 79 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే. మొత్తంగా రాజకీయ నియామకాలు, పదవుల్లో సగానికిపైగా నా అక్కచెల్లెమ్మలున్నారని గర్వంగా చెప్పగలుగుతున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 56 నెలల కాలంలోఏకంగా 2.10 లక్షలకు పైగా.. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే అందులో... 80 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉగ్యోగాల్లో ఉన్నారు. ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరెక్కడైనా చూశారా? ఈరోజు ఈ పెత్తందారీ పార్టీలకు, పెత్తందారీ నాయకులకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు.. వారి కోసం నవరత్నాల పాలన అందించాలని, కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి అవ్వాతాత వరకు అందరి పట్ల ప్రేమ, మమకారం చూపాలని వీళ్లకు ఏరోజైనా అనిపించిందా? మీ బిడ్డ పాలనలో ఈ 56 నెలల కాలంలో రూ.2.47 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కుతున్నాను. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. మరి రాష్ట్రాన్ని దోచుకొనేందుకుమాత్రమే పదవులు కావాలని ఆకాంక్షిస్తున్న పెత్తందారీ పార్టీలు, నాయకులకు ఏరోజైనా ఇలా బటన్ నొక్కడం, తద్వారా రూ.2.47 లక్షల కోట్లు పేద అక్కచెల్లెమ్మలకు పోతుందని ఏరోజైనా అనిపించిందా? ఆలోచన చేయండి. సామాజిక న్యాయంలో పుట్టిన వ్యవస్ధలు. ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు. ఇవాళ గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు. 2 వేల జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్.. లంచాలు, వివక్షలేకుండా ప్రతి పేదవాడు, రైతన్నను, అక్కచెల్లెమ్మను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామ స్వరాజ్యం అంటే ఇదీ, అంబేద్కర్ గారి కలలుగన్న రాజ్యం ఇది అని ఆ చెల్లెమ్మలు, తమ్ముళ్లు దేశానికే చూపిస్తున్నారు. ఇవన్నీ సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్ధలు. కాబట్టి మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనేదాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ రోజు ఆవిష్కరణ కూడా చేస్తున్నాం. మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మీ కష్టం తెలిసిన మీ అన్న ప్రభుత్వం ఇంటింటా ప్రతి గ్రామం నుంచి, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ప్రతి గ్రామంలో మార్పులు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో ఇంటింటా చదువుల విప్లవం, మహిళా సాధికార విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రాంలో పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి. ఒక వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల విప్లవం కనిపించేటట్టుగా జిల్లాలో ఎప్పుడూ చూడని అభివృద్ధి కనిపిస్తుంది. వైద్య, ఆరోగ్య రంగంలో ఎప్పుడూ ఊహించని విధంగా గ్రామ స్థాయిలో మార్పు చెందిన మరో విప్లవం మన పిల్లలకు కనిపిస్తుంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. ప్రతి అంశంలోనూ పేదల అభ్యున్నతికి తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలని కోరుకుంటూ... ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి ఇక్కడి నుంచి అందరం బయలుదేరి అక్కడికి పోదాం అని పిలుపునిస్తూ... సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. ఇదీ చదవండి: స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్: విజయవాడ ప్రతిష్ట ఆకాశమంత ఎత్తుకు.. . -
Ambedkar: అది కేవలం విగ్రహం కాదు.. ఆత్మగౌరవ ప్రతీక
రాజ్యాంగ నిర్మాతగా, దళిత హక్కుల ప్రతినిధిగా అంబేడ్కర్ గురించి అనేకసార్లు విని ఉంటాం. అంబేడ్కర్ అంటే ఇంతేనా? అంబేడ్కర్ ను మనమెలా గుర్తుంచుకోవాలి?.మన కాలపు మేధావి.. అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత, దళిత ఉద్యమకారుడు మాత్రమే కాదు. విదేశాల్లో ఎకనామిక్స్ డాక్టరేట్ సాధించిన తొలి భారతీయడు, విద్యావేత్త, సామాజిక విప్లవకారుడు, జీనియస్. 64 భాషల్లో నిష్ణాతుడు, వెనుకబడిన వర్గాల నుంచి తొలి న్యాయవాది. అంబేడ్కర్ రాసిన "Waiting for a visa" కొలంబియా యూనివర్సిటీలో పాఠ్యపుస్తకంగా ఉంది. అదే యూనివర్సిటీ ఎంపిక చేసిన 100 మంది మేధావుల లిస్ట్‌లో మొదటిపేరు అంబేడ్కర్‌ది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన గత పదివేల సంవత్సరాల్లో ప్రపంచాన్ని తీర్చిదిద్దిన మేధావుల లిస్ట్‌లో అంబేడ్కద్ది నాలుగో పేరు. అసలు సమస్యను గుర్తించిన జీనియస్.. కులమే భారతదేశ మౌలిక సమస్య అని కనుగొన్న జీనియస్. అందుకే దాని పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేశాడు. దేశానికి స్వాతంత్య్రం కన్నా ముందుగా దళితులకు స్వాతంత్ర్యం కావాలని బలంగా నమ్మాడు. సామాజిక మార్పు రాకుండా రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా ప్రయోజనం లేదని నమ్మాడు. అందుకే మహద్ ఉద్యమంతో దళితుల హక్కుల ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు. అందుకోసం మహాత్మా గాంధీతో సైతం పోరాడాడు. మహాత్ముడు స్వాతంత్య్రం కోసం పోరాడితే, అంబేద్కర్ ఆ స్వాతంత్య్రం వల్ల దళితుల జీవితాలేమీ మారవని, ముందుగా దళితులకు స్వాతంత్య్రం కావాలని పోరాడాడు. గాంధీలోని హిందూ భావజాలాన్ని అంబేద్కర్ బట్టబయలు చేశాడు. నవయాన బౌద్ధం అనే కొత్త దారిని చూపాడు. హక్కుల పోరాటానికి చుక్కాని.. అంబేద్కర్ కేవలం దళితుల కోసమే పోరాడాడు. వాళ్ళకే రిజర్వేషన్లు కల్పించాడు అనేది ఒక క్రమపద్ధతిలో వ్యాపింపచేసిన అబద్దం. పనిగంటలను 14 గంటల నుంచి ఎనిమిది గంటలకు తగ్గించాలని 1942లోనే వాదించాడు.. సాధించాడు. మహిళా కార్మికుల కోసం, కార్మికుల కోసం ఎన్నో చట్టాలు రూపొందించాడు. ఆయన హక్కుల పోరాటానికి చుక్కాని, అణగారిన వర్గాలకు ఒక దిక్సూచి. అంబేడ్కర్ స్పృశించని అంశంలేదు. ఆయన మేధావితనం లేదా ఆయన తర్కాన్ని అందుకునే నాయకులు దరిదాపుల్లో లేరు. ఆయనకి ఉన్న దార్శనికత “thoughts on pakisthan”, “state and minorities” లాంటి పుస్తకాల్లో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా మతచాందసం మీద ఆయన ఎక్కు పెట్టిన బాణాలు, కుల వివక్ష మీద ఆయన జరిపిన పోరాటం ఒక చరిత్ర. ప్రజాస్వామ్యం జీవన విధానం.. అంబేడ్కర్ దృష్టిలో డెమోక్రసీ అంటే ఏదో ఒక రాజకీయ నినాదం కాదు. ఆయన దృష్టిలో అది ఒక జీవనవిధానం. సమాజంలో వ్యక్తులు ఒకరిని ఒకరు సమానంగా చూస్తూ, పూర్తి స్వేచ్ఛతో సౌబ్రాత్రుత్వంతో కలిసి బతకడం. ఆయన దృష్టిలో ఇప్పుడున్న ప్రజాస్వామ్యం “Democracy in India is only a top-dressing on an Indian soil which is essentially undemocratic.” social, economic పరంగా inequality విషయంలో ఇప్పటికీ అలానే ఉంది. రాజకీయంగా కూడా సమానత్వం మనం సాధించలేదు. ఆయన దృష్టిలో ఈ హక్కుల పరిరక్షణ కేవలం కోర్టులు మాత్రమే కాదు, సమాజం కూడా తీసుకోవాలి. ప్రతీ వ్యక్తి రాజ్యాంగ నైతికతని కలిగి ఒకరి హక్కుల పట్ల ఒకరు గౌరవం ఇవ్వాలి. రాజ్యాంగానికి లోబడి వ్యక్తుల అధికారం నడవాలి. ఆయన భారతీయుడు కాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఒక మార్క్స్, ఒక voltaire లాగ చరిత్ర గుర్తుపెట్టుకొని ఉండేది. ఆయన రచనలే మార్గదర్శకాలు.. బాల్యంలో ఆయనకు ఎదురైన అనుభవాలు, విదేశాల్లో ఆయన నేర్చుకున్న స్వేచ్ఛా సంస్కతి ఆయన వ్యక్తిత్వంపై ప్రభావం చూపాయి. చదువు ప్రాధాన్యతను తెలుసుకోవడం, పరిమితులను అధిగమిస్తూ ఎదగడం, సామాజిక మార్పునకు కృషి చేయడం.. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చేంతవరకూ అంబేద్కర్ కేవలం దళిత వాడలకే పరిమితమయ్యాడు.. కాదు పరిమితం చేశారు. స్వాతంత్య్ర పోరాట సమయం నించి, ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్‌తో జరిగిన అలుపెరగని పోరాటం వల్ల ఆయనను తక్కువ చేసి చూపించే విధంగా రాశారు. ఆయనను కేవలం దళితుల ప్రతినిధిని చేసేశారు. చదవడం, సమీకరించడం, పోరాడటం.. అంబేడ్కర్ నుంచి ఈ తరం యువత నేర్చుకోవాల్సిన అంశాలు. అది ఏ కాలానికైనా సరిపోయే నినాదం. ఆయన విగ్రహానికి దండేసి దండం పెట్టడానికే పరిమితం కాకుండా, ఆయన పుస్తకాలు చదవాలి. అందులో ఏం రాశాడో అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. అదే అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి. ఇక, అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలకు తగిన విధంగానే ఏపీలో కూడా సంక్షేమ ఫలాలు అందరికీ చేరుతున్నాయి. అంబేద్కర్ స్పూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగులకు అవకాశాలను కల్పించారు. పేదలకు ఎనలేని సాయం, దళితులకు రాజ్యాధికారం ఇచ్చారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066 psy.vishesh@gmail.com -
Vijayawada BR Ambedkar Statue: సామాజిక న్యాయ మహాశిల్పం అంబేద్కర్ స్పెషల్ (ఫొటోలు)
-
అంబేద్కర్ మహాశిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
Updates.. విజయవాడ: డా. బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ మహాశిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ విగ్రహం ప్రత్యేకతలు 18.18 ఎకరాల్లో.. రూ.404.35 కోట్లతో ► రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్‌ను రూపొందించారు. ఎంఎస్ అసోసియేట్ సంస్థ డిజైన్లు రూపొందించింది. అంబేడ్కర్ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్‌నే ఉపయోగించారు. ►ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో.. 539 పిల్లర్లతో నిర్మించారు. ముందుభాగం కారిడార్‌ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌వర్క్ ఏర్పాటుచేశారు. విగ్రహం బేస్ కింది భాగంలో.. ► గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఉంటాయి. ► ఫస్ట్ ఫ్లోర్లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదే«శంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్లో లైబ్రరీ ఉంటాయి. ► ఇక సెకండ్ ఫ్లోర్లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. ► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ► అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్) మ్యూజియంను 75 మంది సీటింగ్ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. ► ఇది ప్రపంచంలోనే అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం కావడం విశేషం. ► మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2,000 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ► బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్, ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టం ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడి ఉంటాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేడ్కర పీఠం (పెడస్టల్)ను రూపొందించారు. ► విగ్రహ పీఠం లోపల జి ప్లస్ 2 అంతస్తులను ఐసోసెల్స్ ట్రాపేజియం ఆకారంలో ఆర్సీసీ ఫ్రేమ్డ్ నిర్మాణం చేశారు. రాజస్థాన్‌కు చెందిన పింక్ రాక్‌ను ఉపయోగించారు. ► అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటుచేస్తున్నారు. అంబేడ్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది. ► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. èవిగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. ► స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన 500–600ల మంది కూలీలు రెండేళ్లపాటు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు. మరణం లేని మహానేత డా. బీఆర్ అంబేద్కర్: సీఎం జగన్ ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో అనిపిస్తుంది. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టించుకోకపోవడం అంటరాని తనమే. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే. పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమే. పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పథకాలు అమలులో వివక్ష చూపించడం కూడ రూపం మార్చుకున్న అంటరానితనమే పోరాటానికి రూపమే అంబేద్కర్. అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదు. శాసన మండలిలో 29 మంది సభ్యులు బలహీన వర్గాలకు చెందిన వారే. ఎనిమిది మందిని రాజ్యసభకు పంపింతే అందులో సగం ఎస్సీ, బీసీలే. 13 జడ్పీ ఛైర్మన్లలో 9 మంది బలహీన వర్గాల వారే. పేదలు ప్రయాణించే ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేయాలనుకున్నారు. ఇలాంటి సామాజిక న్యాయం మన ప్రభుత్వంలో తప్పితే ఎక్కడైనా చూశారా? ఎక్కడా లంచాలు లేవు.. ఎక్కడా వివక్షల లేవు. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదు. పెత్తందారి పార్టీలకు, పెత్తందారి నేతలకు పేదలు పట్టరు. పేద కులాల వారు ఎప్పటికీ తమ సేవకులుగానేఉ ండాలంటారు వారి సేవకులగానే ఉండాలంటారు. పేదలకు అండగా ఉండాలని ఈ పెత్తందారీ పార్టీలకు ఎందుకు ఆలోచన రాదు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదు. పెత్తందారులకు దళితులంటే చులకన. చంద్రబాబుకు దళితులంటే నచ్చదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమ లేదు. పేద అక్కచెల్లెమ్మలకు మేలు చేసేందుకు 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. మన ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదు. దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు. సామాజిక న్యాయ మహా శిల్పం కింద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరినీ ఒక్కతాటిపై నిలబెట్టామంటే అంబేద్కర్ స్పూర్తితోనే ఈ మహా విగ్రహం అందరికీ స్పూర్తినిస్తుంది. పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయి. ►సామాజిక చైతన్యవాడలా విజయవాడ కనిపిస్తోంది: సీఎం జగన్ ►దళితజాతికి, బహుళజనులకు అభినందనలు తెలియజేస్తున్నా. ►స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుంది. ►ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ► కాసేపట్లో విజయవాడలో డా. బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ ►మహాశిల్పాన్ని ఆవిష్కరించనున్న సీఎం వైఎస్ జగన్. ►అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్ ►దేశంలోనే 206 అడుగులతో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ►18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో ప్రాజెక్టు నిర్మాణం. ► రూ. 404.35 కోట్లతో మేడిన్ ఇండియా సామగ్రితో పనులపూర్తి. ►పీఠం 81 అడుగులు. 125 అడుగులతో అంబేద్కర్ కాంస్య విగ్రహం. ►అంబేద్కర్ విగ్రహానికి వాడిన కాంస్యం 120 మెట్రిక్ టన్నులు. ►విగ్రహం లోపల నిర్మాణినికి వాడిన స్టీలు 400 మెట్రిక్ టన్నులు. ►శాండ్ స్టోన్ 2200 టన్నులు, పీఠంపై జీ+2 గదులు నిర్మాణం. ►ఊబౌద్ద వాస్తు శిల్ప కళలోని కాలచక్ర మహా మండపం డిజైన్‌తో పీఠం. ►అంబేద్కర్ జీవిత విశేషాలతో ఎక్స్ పీరియడ్స్ సెంటర్. ►2 వేల మందికి సరిపడా కన్వెన్షన్ సెంటర్. ►ప్రపంచ మేధావి, దేశం గర్వించతగిన నాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 206 అడుగుల విగ్రహావిష్కరణనేపథ్యంలో విజయవాడకు వేలాదిగా జనం తరలివస్తున్నారు. మహానాయకుడు విగ్రహ ఆవిష్కరణ ఒక మహోత్సవంలా జరుగుతుండటంతో వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది జనం చేరుకుంటున్నారు. ►నేటిసాయంత్రం 3 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. కృష్ణాజిల్లా : విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గన్నవరం,ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల నుంచి భారీగా బయల్దేరిన అంబేద్కర్ అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పెడన నుంచి బస్సుల్లో బయల్దేరిన అభిమానులు. బస్సులను జెండా ఊపి ప్రారంభించిన పెడన నియోజకవర్గ ఇంఛార్జి ఉప్పాల రాము, కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారిక ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మూడు మండలాల నుంచి 64 బస్సుల్లో విజయవాడ బయలుదేరిన ప్రజలు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు బయలుదేరిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు. మైలవరం నియోజకవర్గం లోని రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల నుంచి విజయవాడ అంబేద్కర్ విగ్రావిష్కరణకు 45 ప్రత్యేక బస్సుల్లో తరలివెళ్లిన ప్రజలు. చంద్రబాబు గ్రాఫిక్.. సీఎం జగన్ రియాలిటీ నాడు గ్రాఫిక్స్‌తో అంబేద్కర్ విగ్రహం నేడు రియాలిటీలో సీఎం జగన్ హయాంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తరలిన అభిమానులు ముమ్మిడివరం నుండి విజయవాడ బయలుదేరిన దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు. అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ కార్యక్రమానికి 63 గ్రామాల నుండి తరలి వెళ్లిన అభిమానులు. ఇన్ఛార్జ్ విపర్తి వేణుగోపాల్ ఆధ్వర్యంలో 14 బస్సుల్లో బయలుదేరి వెళ్లిన 700 మంది దళిత నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు. విజయవాడ నడిబొడ్డున సామాజిక న్యాయ మహాశిల్పం నేడు సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కరణ విజయవాడ నడిబొడ్డున 206 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పం నేడు సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కరణ.#StatueOfSocialJustice#DrBRAmbedkar#CMYSJagan #AndhraPradesh pic.twitter.com/H3vlNIKvuB — YSR Congress Party (@YSRCParty) January 19, 2024 నెల్లూరు నుంచి వేలాది మంది రాక.. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నెల్లూరు నుంచి భారీగా తరలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అంబేద్కర్‌వాదులు ఆత్మకూరు, గూడూరు, సుళ్లూరుపేట, నెల్లూరు, వెంకటగిరి, కావలి తదితర ప్రాంతాల నుంచి బస్సుల్లో తరలి వెళ్లిన వేలాది మంది. సామాజిక న్యాయానికి, అంబేద్కర్ ఆశయాలకు సీఎం జగన్ నిలువెత్తు రూపం అంటూ దళిత నేతల హర్షం. కాకినాడ నుంచి బయలుదేరిన కార్యకర్తలు, ప్రజలు పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జ్ దవులురి దొరబాబు సారథ్యంలో విజయవాడకు బయలుదేరిన ప్రజలు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు 18 బస్సుల్లో బయలు దేరిన 1000 మంది వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. విజయవాడకు బయలుదేరిన ప్రజలు.. సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణకు బయలుదేరిన రాజమండ్రి రూరల్ ప్రజలు, నాయకులు రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా 14 బస్సులతో సుమారు 800 మంది విజయవాడకు పయనం ►చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే తరుణం వచ్చేసింది. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ►అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ స్మృతివనం పనులను మహాయజ్ఞంలా పూర్తిచేశారు. అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా మారనుంది. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. 206 (81 అడుగుల బేస్, 125 అడుగుల విగ్రహం) అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందరూ స్వచ్చందంగా తరలి రండి: సీఎం జగన్ విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. ఇది “స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’’. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తినిస్తుంది. ఈనెల 19న జరిగే విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరుతున్నాను. విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. ఇది “స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’’. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తినిస్తుంది. ఈనెల 19న జరిగే విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా… pic.twitter.com/209LhkdHte — YS Jagan Mohan Reddy (@ysjagan) January 17, 2024 రాత్రి సమయంలో ప్రత్యేక కాంతులు.. ►రాత్రివేళ ప్రత్యేక కాంతులతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి, అత్యంత అద్భుతంగా రూపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం అధికారులతో మాట్లాడుతూ పనులు పరుగులు పెట్టించారు. ఇలా స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఈ అరుదైన అంబేడ్కర్ సామాజిక న్యాయ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనవరి 19న ఆవిష్కరిస్తున్నారు. ఇక స్మృతివనాన్ని వీక్షించేందుకు ఈ నెల 20 నుంచి సామాన్య ప్రజలకు ప్రవేశం కల్పించనున్నారు. 18.18 ఎకరాల్లో.. రూ.404 కోట్లతో.. ►రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్‌ను రూపొందించారు. ఎంఎస్ అసోసియేట్ సంస్థ డిజైన్లు రూపొందించింది. అంబేడ్కర్ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్‌నే ఉపయోగించారు. ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో.. 539 పిల్లర్లతో నిర్మించారు. ముందుభాగం కారిడార్‌ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌వర్క్ ఏర్పాటుచేశారు. విగ్రహం బేస్ కింది భాగంలో.. ► గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఉంటాయి. ► ఫస్ట్ ఫ్లోర్లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదే«శంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్లో లైబ్రరీ ఉంటాయి. ► ఇక సెకండ్ ఫ్లోర్లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. ► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ► అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్) మ్యూజియంను 75 మంది సీటింగ్ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. ► ఇది ప్రపంచంలోనే అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం కావడం విశేషం. ► మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2,000 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ► బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్, ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టం ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడి ఉంటాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేడ్కర పీఠం (పెడస్టల్)ను రూపొందించారు. ► విగ్రహ పీఠం లోపల జి ప్లస్ 2 అంతస్తులను ఐసోసెల్స్ ట్రాపేజియం ఆకారంలో ఆర్సీసీ ఫ్రేమ్డ్ నిర్మాణం చేశారు. రాజస్థాన్‌కు చెందిన పింక్ రాక్‌ను ఉపయోగించారు. ► అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటుచేస్తున్నారు. అంబేడ్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది. ► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. èవిగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. ► స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన 500–600ల మంది కూలీలు రెండేళ్లపాటు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..
సాక్షి, విజయవాడ: రేపు(శుక్రవారం) విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులను వాహనదారులు గమనించాలని సీపీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని తెలిపారు. కాగా, సీపీ కాంతి రాణా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 1.5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. రేపటి కార్యక్రమం కోసం ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నాం. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాహనాల రాకపోకలకు మళ్లింపులు కొనసాగుతాయి. విజయవాడ సిటీలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. హైదరాబాద్-విశాఖ, విశాఖ-హైదరాబాద్ వైపు వాహనాలన్నీ ఇబ్రహీంపట్నం దగ్గర మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదగా దారి మళ్లింపు చెన్నై నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలను ఒంగోలు దగ్గర డైవర్షన్.. చీరాల, బాపట్ల మీదగా మళ్లింపు వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ దగ్గర దారి మళ్లింపు చెన్నై నుంచి హైదరాబాద్, హైదరాబాద్- చెన్నై వెళ్లే వాహనాలను మేదరమెట్ట, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదగా మళ్లింపు ఎంజీ రోడ్లో ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకి పార్కింగ్ ప్రాంతాలు కేటాయించాము రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది సందర్శకులకు శనివారం నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు అనుమతి. కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. రేపు సాయంత్రం 4.30 గంటల నుంచి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముందుగా సీఎం జగన్ ముఖ్య అతిథిగా బహిరంగ సభ జరుగుతుంది బహిరంగ సభ ముగిసిన తర్వాత సీఎం జగన్ చేతుల మీదగా ఆరు గంటలకి అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుంది దాదాపు మూడు వేల వాహనాలలో లక్షన్నర మంది ప్రజలు వస్తారని భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు విజయవాడ నగరంలోని పలు జంక్షన్లలో 36 చోట్ల స్క్రీన్లు ఏర్పాటు చేశాం విజయవాడ సెంటర్లో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రూ.405కోట్ల వ్యయంతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు జరిగింది. రేపు సందర్శకులకు అనుమతి ఉండదు నగర ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం -
చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరు: కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలలకు రూపం ఈ అంబేద్కర్ విగ్రహమని అన్నారు ఎంపీ కేశినేని నాని. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయం చేయడం టీడీపీకి సమంజసం కాదు. నేను చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరంటూ నాని వార్నింగ్ ఇచ్చారు. కాగా, కేశినేని నాని గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీఎం జగన్ ఆలోచనలకు స్ఫూర్తి అంబేద్కర్. వివక్ష లేని సమాజం కావాలని అంబేద్కర్ ఆశించారు. సీఎం జగన్ ఇప్పుడు వివక్ష లేని పాలన అందిస్తున్నారు. అంటరానితనం, కుల వివక్షపైన అంబేద్కర్ పోరాటం చేశారు. పేదలను ఉన్నత స్థాయితో ఉంచాలని ఆశించే నాయకుడు సీఎం జగన్. ఆరోజు అంబేద్కర్ పోరాడిన వర్గాల కోసం నేడు సీఎం జగన్ పోరాడుతున్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని గతంలో అందరూ ఊరు చివర పెట్టేవారు. సీఎం జగన్ మాత్రం రాష్ట్రం నడి బొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారు. ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయాలు చేయడం టీడీపీకి సమంజసం కాదు. నేను చంద్రబాబు చిట్టా విప్పితే మీరు తట్టుకోలేరు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో కేశినేని చిన్ని వ్యాఖ్యలపై నాని స్పందించారు. ఈ సందర్బంగా ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని సెటైరికల్ పంచ్ విసిరారు. అలాగే, రేపు ఎన్నికల బాక్స్‌లు తెరిచాక 80 శాతం ఏ పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
‘అంబేద్కర్ విగ్రహంపై అవమానకరంగా మాట్లాడుతున్నారు’
సాక్షి, విజయవాడ: ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ మహా శిల్పం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని పెట్టలేదన్నారు. అంబేద్కర్ స్మారక చిహ్నన్ని సీఎం జగన్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎల్లో మీడియాలో పనులు పూర్తవ్వలేదంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఎల్లో మీడియా, చంద్రబాబు ఇక్కడికి వస్తే పనులు చూపిస్తానన్నారు. రూ. 400 కోట్లు పెడితే ఎందుకంత ఖర్చు అని టీడీపీ నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహంపై చంద్రబాబు చేసిన రాజకీయాన్ని ప్రజల్లో ఎండగడతామని మంత్రి పేర్కొన్నారు. రేపు విజయవాడలో డా.బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. తొలుత ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభకు హాజరు కానున్న సీఎం.. అనంతరం స్వరాజ్ మైదానంలో సామాజిక న్యాయ మహా శిల్పాన్ని ఆవిష్కరించనున్నారు. వెలుగుల నడుమ బడుగు బాంధవుడు (ఫొటోలు).. క్లిక్ చేయండి -
అక్కచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: 12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పావలావడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియింబర్స్ కింద రూ.46.9 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈకార్యక్రమం జరుగుతుంది. గతంలో సుమారు ఐదు లక్షలకు పైబడి అక్క చెల్లెమ్మలకు రూ.50 కోట్ల పైబడి ఇచ్చాం. రూ.35వేల రుణాలను పావలా వడ్డీకే ఇస్తున్నాం. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అందులో ఇప్పటికే 22లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చు అవుతుంది. మౌలిక సదుపాయాలకు మరో రూ.1 లక్ష ఖర్చు అవుతోంది. ఇళ్ల నిర్మాణంకోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘సిమెంటు, స్టీల్, మెటల్ ఫ్రేంలు తదితర ఇంటి సామగ్రి మీద కనీసంగా రూ.40వేలు మంచి జరిగేలా చూస్తున్నాం. ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి రూ.2.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. అన్ని కలుపుకుంటే దాదాపు ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.5 -20 లక్షల వరకూ ఒక ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు ఇప్పిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం’’ అని సీఎం జగన్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రాయితీపై సామగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని రీయింబర్స్మెంట్ చేశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందించనుంది. ఇదీ చదవండి: నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు -
Vijayawada Ambedkar Statue Photos: వెలుగుల నడుమ బడుగు బాంధవుడు (ఫొటోలు)