అంబేద్కర్‌ మహాశిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌ | Worlds Tallest Dr BR Ambedkar Statue To Be Unveiled In AP Vijayawada Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

Ambedkar Statue Unveil Updates: సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ అప్‌ డేట్స్‌

Published Fri, Jan 19 2024 7:22 AM | Last Updated on Fri, Jan 19 2024 9:27 PM

BR Ambedkar Statue Unveiled In Vijayawada Live Updates - Sakshi

Updates..

  • విజయవాడ: డా. బీఆర్‌ అంబేద్కర్‌ భారీ విగ్రహావిష్కరణ
  • మహాశిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

విగ్రహం ప్రత్యేకతలు

18.18 ఎకరాల్లో.. రూ.404.35 కోట్లతో
► రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్‌ను రూపొందించారు. ఎంఎస్‌ అసోసియేట్‌ సంస్థ డిజైన్లు రూపొందించింది. అంబేడ్కర్‌ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్‌నే ఉపయోగించారు.
►ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్‌ బాడీస్, మ్యూజికల్‌ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్‌ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో.. 539 పిల్లర్లతో నిర్మించారు. ముందుభాగం కారిడార్‌ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌వర్క్‌ ఏర్పాటుచేశారు. 

విగ్రహం బేస్‌ కింది భాగంలో.. 
► గ్రౌండ్, ఫస్ట్, సెకండ్‌ ఫ్లోర్‌లు ఉంటాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాల్స్‌ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్‌ మ్యూజియంలు  ఉంటాయి. 
► ఫస్ట్‌ ఫ్లోర్‌లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదే«శంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్‌లో లైబ్రరీ ఉంటాయి. 
► ఇక సెకండ్‌ ఫ్లోర్‌లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్‌లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో..
► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.  
► అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్‌) మ్యూజియంను 75 మంది సీటింగ్‌ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించా­రు.  
► ఇది ప్రపంచంలోనే అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం కావడం విశేషం.  
► మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్‌ సెంటర్, వెహికల్‌ పార్కింగ్‌ ఉన్నాయి. కన్వెన్షన్‌ సెంటర్‌ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2,000 మంది సీటింగ్‌ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.  

► బిల్డింగ్‌ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్‌ ఫౌంటేన్, ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్‌ సిస్టం ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో కూడి ఉంటాయి.   కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేడ్కర పీఠం (పెడస్టల్‌)ను రూపొందించారు.  
► విగ్రహ పీఠం లోపల జి ప్లస్‌ 2 అంతస్తులను ఐసోసెల్స్‌ ట్రాపేజియం ఆకారంలో ఆర్సీసీ ఫ్రేమ్డ్‌ నిర్మాణం చేశారు. రాజస్థాన్‌కు చెందిన పింక్‌ రాక్‌ను ఉపయోగించారు.  

► అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌ వర్క్‌ ఏర్పాటుచేస్తున్నారు. అంబేడ్కర్‌ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది.  
► ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. èవిగ్రహాన్ని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద శిల్పి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కాస్టింగ్‌ చేశారు.  
► స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్‌ నుంచి వచ్చిన 500–600ల మంది కూలీలు రెండేళ్లపాటు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు.

మరణం లేని మహానేత డా. బీఆర్‌ అంబేద్కర్‌: సీఎం జగన్‌

  • ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో అనిపిస్తుంది.
  • పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టించుకోకపోవడం అంటరాని తనమే.
  • పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే.
  • పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమే.
  • పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా?
  • ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
  • పథకాలు అమలులో వివక్ష చూపించడం కూడ రూపం మార్చుకున్న అంటరానితనమే
  • పోరాటానికి రూపమే అంబేద్కర్‌.
  • అంబేద్కర్‌ భావజాలం పెత్తందారులకు నచ్చదు.
  • శాసన మండలిలో 29 మంది సభ్యులు బలహీన వర్గాలకు చెందిన వారే.
  • ఎనిమిది మందిని రాజ్యసభకు పంపింతే అందులో సగం ఎస్సీ, బీసీలే.
  • 13 జడ్పీ ఛైర్మన్లలో 9 మంది బలహీన వర్గాల వారే.
  • పేదలు ప్రయాణించే ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేయాలనుకున్నారు.
  • ఇలాంటి సామాజిక న్యాయం మన ప్రభుత్వంలో తప్పితే ఎక్కడైనా చూశారా?
  • ఎక్కడా లంచాలు లేవు.. ఎక్కడా వివక్షల లేవు.
  • దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదు.
  • పెత్తందారి పార్టీలకు, పెత్తందారి నేతలకు పేదలు పట్టరు.
  • పేద కులాల వారు ఎప్పటికీ తమ సేవకులుగానేఉ ండాలంటారు వారి సేవకులగానే ఉండాలంటారు.
  • పేదలకు అండగా ఉండాలని ఈ పెత్తందారీ పార్టీలకు ఎందుకు ఆలోచన రాదు.
  • ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహం.
  • అంబేద్కర్‌ భావజాలం పెత్తందారులకు నచ్చదు.
  • పెత్తందారులకు దళితులంటే చులకన.
  • చంద్రబాబుకు దళితులంటే నచ్చదు.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమ లేదు.
  • పేద అక్కచెల్లెమ్మలకు మేలు చేసేందుకు 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం.
  • మన ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదు.
  • దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు.

  • సామాజిక న్యాయ మహా శిల్పం కింద విగ్రహాన్ని ఏర్పాటు  చేసుకున్నాం.
  • అందరినీ ఒక్కతాటిపై నిలబెట్టామంటే అంబేద్కర్‌ స్పూర్తితోనే
  • ఈ మహా విగ్రహం అందరికీ స్పూర్తినిస్తుంది.
  • పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయి.

►సామాజిక చైతన్యవాడలా విజయవాడ కనిపిస్తోంది: సీఎం జగన్‌
►దళితజాతికి, బహుళజనులకు అభినందనలు తెలియజేస్తున్నా.
►స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుంది. 

►ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.
► కాసేపట్లో విజయవాడలో డా. బీఆర్‌ అంబేద్కర్‌ భారీ విగ్రహావిష్కరణ
►మహాశిల్పాన్ని ఆవిష్కరించనున్న సీఎం  వైఎస్‌ జగన్‌.
►అంబేద్కర్‌ విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్‌

►దేశంలోనే 206 అడుగులతో అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు
►18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో ప్రాజెక్టు నిర్మాణం.
► రూ. 404.35 కోట్లతో మేడిన్‌ ఇండియా సామగ్రితో పనులపూర్తి.
►పీఠం 81 అడుగులు. 125 అడుగులతో అంబేద్కర్‌ కాంస్య విగ్రహం.
►అంబేద్కర్‌ విగ్రహానికి వాడిన కాంస్యం 120 మెట్రిక్‌ టన్నులు.
►విగ్రహం లోపల నిర్మాణినికి వాడిన స్టీలు 400 మెట్రిక్‌ టన్నులు.
►శాండ్‌ స్టోన్‌ 2200 టన్నులు, పీఠంపై జీ+2 గదులు నిర్మాణం.
►ఊబౌద్ద వాస్తు శిల్ప కళలోని కాలచక్ర మహా మండపం డిజైన్‌తో పీఠం.
►అంబేద్కర్‌ జీవిత విశేషాలతో ఎక్స్‌ పీరియడ్స్‌  సెంటర్‌.
►2 వేల మందికి సరిపడా కన్వెన్షన్‌ సెంటర్‌.

►ప్రపంచ మేధావి, దేశం గర్వించతగిన నాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 206 అడుగుల విగ్రహావిష్కరణనేపథ్యంలో విజయవాడకు వేలాదిగా జనం తరలివస్తున్నారు. మహానాయకుడు విగ్రహ ఆవిష్కరణ ఒక మహోత్సవంలా జరుగుతుండటంతో వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది జనం చేరుకుంటున్నారు.

►నేటిసాయంత్రం 3 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.

కృష్ణాజిల్లా : 

  • విజయవాడలో డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గన్నవరం,ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల నుంచి భారీగా బయల్దేరిన అంబేద్కర్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేతలు.
  • డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, స్మృతి వనం  ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పెడన నుంచి బస్సుల్లో బయల్దేరిన అభిమానులు.
  • బస్సులను జెండా ఊపి ప్రారంభించిన పెడన నియోజకవర్గ ఇంఛార్జి ఉప్పాల రాము, కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారిక

ఎన్టీఆర్ జిల్లా

  • జగ్గయ్యపేట నియోజకవర్గంలో మూడు మండలాల నుంచి 64 బస్సుల్లో విజయవాడ బయలుదేరిన ప్రజలు.
  • డాక్టర్  బీఆర్‌ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు బయలుదేరిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు.
  • మైలవరం నియోజకవర్గం లోని రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల నుంచి విజయవాడ  అంబేద్కర్ విగ్రావిష్కరణకు 45 ప్రత్యేక బస్సుల్లో తరలివెళ్లిన ప్రజలు.

చంద్రబాబు గ్రాఫిక్‌.. సీఎం జగన్‌ రియాలిటీ

  • నాడు గ్రాఫిక్స్‌తో అంబేద్కర్‌ విగ్రహం
  • నేడు రియాలిటీలో సీఎం జగన్‌ హయాంలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ

అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తరలిన అభిమానులు

  • ముమ్మిడివరం నుండి విజయవాడ బయలుదేరిన దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు.
  • అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ  కార్యక్రమానికి 63 గ్రామాల నుండి తరలి వెళ్లిన అభిమానులు.
  • ఇన్‌ఛార్జ్‌ విపర్తి వేణుగోపాల్ ఆధ్వర్యంలో 14 బస్సుల్లో బయలుదేరి వెళ్లిన 700 మంది దళిత నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు.

విజయవాడ నడిబొడ్డున సామాజిక న్యాయ మహాశిల్పం
నేడు సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆవిష్కరణ

నెల్లూరు నుంచి వేలాది మంది రాక..

  • అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నెల్లూరు నుంచి భారీగా తరలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అంబేద్కర్‌వాదులు
  • ఆత్మకూరు, గూడూరు, సుళ్లూరుపేట, నెల్లూరు, వెంకటగిరి, కావలి తదితర ప్రాంతాల నుంచి బస్సుల్లో తరలి వెళ్లిన వేలాది మంది.
  • సామాజిక న్యాయానికి, అంబేద్కర్ ఆశయాలకు సీఎం జగన్ నిలువెత్తు రూపం అంటూ దళిత నేతల హర్షం.

కాకినాడ నుంచి బయలుదేరిన కార్యకర్తలు, ప్రజలు

  • పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జ్ దవులురి దొరబాబు సారథ్యంలో విజయవాడకు బయలుదేరిన ‍ప్రజలు
  • అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు 18 బస్సుల్లో బయలు దేరిన 1000 మంది వైస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.

విజయవాడకు బయలుదేరిన ప్రజలు..

  • సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణకు బయలుదేరిన రాజమండ్రి రూరల్ ప్రజలు, నాయకులు 
  • రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా 14 బస్సులతో సుమారు 800 మంది విజయవాడకు పయనం

చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే తరుణం వచ్చేసింది. నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ చేయనున్నారు. 

అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ స్మృతివనం పనులను మహాయజ్ఞంలా పూర్తిచేశారు. అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా మారనుంది. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. 206 (81 అడుగుల బేస్, 125 అడుగుల విగ్రహం) అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

అందరూ స్వచ్చందంగా తరలి రండి: సీఎం జగన్‌
విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ ‌గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. ఇది “స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’’. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తినిస్తుంది. ఈనెల 19న జరిగే విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరుతున్నాను.

రాత్రి సమయంలో ప్రత్యేక కాంతులు..
రాత్రివేళ ప్రత్యేక కాంతులతో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి, అత్యంత అద్భుతంగా రూపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం అధికారులతో మాట్లాడుతూ పనులు పరుగులు పెట్టించారు. ఇలా స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ (సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఈ అరుదైన అంబేడ్కర్‌ సామాజిక న్యాయ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 19న ఆవిష్కరిస్తున్నారు. ఇక స్మృతివనాన్ని వీక్షించేందుకు ఈ నెల 20 నుంచి సామాన్య ప్రజలకు ప్రవేశం కల్పించనున్నారు.  

18.18 ఎకరాల్లో.. రూ.404 కోట్లతో..
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్‌ను రూపొందించారు. ఎంఎస్‌ అసోసియేట్‌ సంస్థ డిజైన్లు రూపొందించింది. అంబేడ్కర్‌ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్‌నే ఉపయోగించారు. ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్‌ బాడీస్, మ్యూజికల్‌ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్‌ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో.. 539 పిల్లర్లతో నిర్మించారు. ముందుభాగం కారిడార్‌ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌వర్క్‌ ఏర్పాటుచేశారు. 

విగ్రహం బేస్‌ కింది భాగంలో.. 
► గ్రౌండ్, ఫస్ట్, సెకండ్‌ ఫ్లోర్‌లు ఉంటాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాల్స్‌ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్‌ మ్యూజియంలు          ఉంటాయి. 
► ఫస్ట్‌ ఫ్లోర్‌లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదే«శంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్‌లో లైబ్రరీ ఉంటాయి. 
► ఇక సెకండ్‌ ఫ్లోర్‌లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్‌లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో..
► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.  
► అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్‌) మ్యూజియంను 75 మంది సీటింగ్‌ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించా­రు.  
► ఇది ప్రపంచంలోనే అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం కావడం విశేషం.  
► మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్‌ సెంటర్, వెహికల్‌ పార్కింగ్‌ ఉన్నాయి. కన్వెన్షన్‌ సెంటర్‌ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2,000 మంది సీటింగ్‌ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.  

► బిల్డింగ్‌ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్‌ ఫౌంటేన్, ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్‌ సిస్టం ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో కూడి ఉంటాయి.   కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేడ్కర పీఠం (పెడస్టల్‌)ను రూపొందించారు.  
► విగ్రహ పీఠం లోపల జి ప్లస్‌ 2 అంతస్తులను ఐసోసెల్స్‌ ట్రాపేజియం ఆకారంలో ఆర్సీసీ ఫ్రేమ్డ్‌ నిర్మాణం చేశారు. రాజస్థాన్‌కు చెందిన పింక్‌ రాక్‌ను ఉపయోగించారు.  

► అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌ వర్క్‌ ఏర్పాటుచేస్తున్నారు. అంబేడ్కర్‌ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది.  
► ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. èవిగ్రహాన్ని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద శిల్పి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కాస్టింగ్‌ చేశారు.  
► స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్‌ నుంచి వచ్చిన 500–600ల మంది కూలీలు రెండేళ్లపాటు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement