రాజ్యాంగ నిర్మాతగా, దళిత హక్కుల ప్రతినిధిగా అంబేడ్కర్ గురించి అనేకసార్లు విని ఉంటాం. అంబేడ్కర్ అంటే ఇంతేనా? అంబేడ్కర్ ను మనమెలా గుర్తుంచుకోవాలి?.మన కాలపు మేధావి.. అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత, దళిత ఉద్యమకారుడు మాత్రమే కాదు. విదేశాల్లో ఎకనామిక్స్ డాక్టరేట్ సాధించిన తొలి భారతీయడు, విద్యావేత్త, సామాజిక విప్లవకారుడు, జీనియస్. 64 భాషల్లో నిష్ణాతుడు, వెనుకబడిన వర్గాల నుంచి తొలి న్యాయవాది.
అంబేడ్కర్ రాసిన "Waiting for a visa" కొలంబియా యూనివర్సిటీలో పాఠ్యపుస్తకంగా ఉంది. అదే యూనివర్సిటీ ఎంపిక చేసిన 100 మంది మేధావుల లిస్ట్‌లో మొదటిపేరు అంబేడ్కర్‌ది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన గత పదివేల సంవత్సరాల్లో ప్రపంచాన్ని తీర్చిదిద్దిన మేధావుల లిస్ట్‌లో అంబేడ్కద్‌ది నాలుగో పేరు.
అసలు సమస్యను గుర్తించిన జీనియస్..
కులమే భారతదేశ మౌలిక సమస్య అని కనుగొన్న జీనియస్. అందుకే దాని పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేశాడు. దేశానికి స్వాతంత్య్రం కన్నా ముందుగా దళితులకు స్వాతంత్ర్యం కావాలని బలంగా నమ్మాడు. సామాజిక మార్పు రాకుండా రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా ప్రయోజనం లేదని నమ్మాడు. అందుకే మహద్ ఉద్యమంతో దళితుల హక్కుల ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు. అందుకోసం మహాత్మా గాంధీతో సైతం పోరాడాడు. మహాత్ముడు స్వాతంత్య్రం కోసం పోరాడితే, అంబేద్కర్ ఆ స్వాతంత్య్రం వల్ల దళితుల జీవితాలేమీ మారవని, ముందుగా దళితులకు స్వాతంత్య్రం కావాలని పోరాడాడు. గాంధీలోని హిందూ భావజాలాన్ని అంబేద్కర్ బట్టబయలు చేశాడు. నవయాన బౌద్ధం అనే కొత్త దారిని చూపాడు.
హక్కుల పోరాటానికి చుక్కాని..
అంబేద్కర్ కేవలం దళితుల కోసమే పోరాడాడు. వాళ్ళకే రిజర్వేషన్లు కల్పించాడు అనేది ఒక క్రమపద్ధతిలో వ్యాపింపచేసిన అబద్దం. పనిగంటలను 14 గంటల నుంచి ఎనిమిది గంటలకు తగ్గించాలని 1942లోనే వాదించాడు.. సాధించాడు. మహిళా కార్మికుల కోసం, కార్మికుల కోసం ఎన్నో చట్టాలు రూపొందించాడు. ఆయన హక్కుల పోరాటానికి చుక్కాని, అణగారిన వర్గాలకు ఒక దిక్సూచి.
అంబేడ్కర్ స్పృశించని అంశంలేదు. ఆయన మేధావితనం లేదా ఆయన తర్కాన్ని అందుకునే నాయకులు దరిదాపుల్లో లేరు. ఆయనకి ఉన్న దార్శనికత “thoughts on pakisthan”, “state and minorities” లాంటి పుస్తకాల్లో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా మతచాందసం మీద ఆయన ఎక్కు పెట్టిన బాణాలు, కుల వివక్ష మీద ఆయన జరిపిన పోరాటం ఒక చరిత్ర.
ప్రజాస్వామ్యం జీవన విధానం..
అంబేడ్కర్ దృష్టిలో డెమోక్రసీ అంటే ఏదో ఒక రాజకీయ నినాదం కాదు. ఆయన దృష్టిలో అది ఒక జీవనవిధానం. సమాజంలో వ్యక్తులు ఒకరిని ఒకరు సమానంగా చూస్తూ, పూర్తి స్వేచ్ఛతో సౌబ్రాత్రుత్వంతో కలిసి బతకడం. ఆయన దృష్టిలో ఇప్పుడున్న ప్రజాస్వామ్యం “Democracy in India is only a top-dressing on an Indian soil which is essentially undemocratic.” social, economic పరంగా inequality విషయంలో ఇప్పటికీ అలానే ఉంది. రాజకీయంగా కూడా సమానత్వం మనం సాధించలేదు.
ఆయన దృష్టిలో ఈ హక్కుల పరిరక్షణ కేవలం కోర్టులు మాత్రమే కాదు, సమాజం కూడా తీసుకోవాలి. ప్రతీ వ్యక్తి రాజ్యాంగ నైతికతని కలిగి ఒకరి హక్కుల పట్ల ఒకరు గౌరవం ఇవ్వాలి. రాజ్యాంగానికి లోబడి వ్యక్తుల అధికారం నడవాలి. ఆయన భారతీయుడు కాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఒక మార్క్స్, ఒక voltaire లాగ చరిత్ర గుర్తుపెట్టుకొని ఉండేది.
ఆయన రచనలే మార్గదర్శకాలు..
బాల్యంలో ఆయనకు ఎదురైన అనుభవాలు, విదేశాల్లో ఆయన నేర్చుకున్న స్వేచ్ఛా సంస్కతి ఆయన వ్యక్తిత్వంపై ప్రభావం చూపాయి. చదువు ప్రాధాన్యతను తెలుసుకోవడం, పరిమితులను అధిగమిస్తూ ఎదగడం, సామాజిక మార్పునకు కృషి చేయడం.. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చేంతవరకూ అంబేద్కర్ కేవలం దళిత వాడలకే పరిమితమయ్యాడు.. కాదు పరిమితం చేశారు. స్వాతంత్య్ర పోరాట సమయం నించి, ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్‌తో జరిగిన అలుపెరగని పోరాటం వల్ల ఆయనను తక్కువ చేసి చూపించే విధంగా రాశారు. ఆయనను కేవలం దళితుల ప్రతినిధిని చేసేశారు.
చదవడం, సమీకరించడం, పోరాడటం.. అంబేడ్కర్ నుంచి ఈ తరం యువత నేర్చుకోవాల్సిన అంశాలు. అది ఏ కాలానికైనా సరిపోయే నినాదం. ఆయన విగ్రహానికి దండేసి దండం పెట్టడానికే పరిమితం కాకుండా, ఆయన పుస్తకాలు చదవాలి. అందులో ఏం రాశాడో అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. అదే అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి.
ఇక, అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలకు తగిన విధంగానే ఏపీలో కూడా సంక్షేమ ఫలాలు అందరికీ చేరుతున్నాయి. అంబేద్కర్ స్పూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడుగులకు అవకాశాలను కల్పించారు. పేదలకు ఎనలేని సాయం, దళితులకు రాజ్యాధికారం ఇచ్చారు.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment