
విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో మరోసారి దుమారం రేపాయి. తన సోదరుడు చిన్నాతో పాటు బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను ఆయన పరోక్షంగా టార్గెట్ చేశారు. ఓ వైపు తనతో పాటు తన వర్గాన్ని ప్రమోట్ చేసుకుంటూ సొంత పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ నియోజవర్గంలో తన కుమార్తె శ్వేత పోటీ చేయడం లేదని చెప్పారు.
కొన్ని కబంధ హస్తాల నుంచి పశ్చిమ నియోజకవర్గానికి విముక్తి చేయడానికే తాను ఇంఛార్జ్‌గా వచ్చానని తెలిపారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారిని తాను సహించనని కేశినేని నాని హెచ్చరించారు. మేం ఏలుకుంటాం.. దోచుకుంటాం అంటే ఊరుకునేది లేదన్నారు. తాను ఎవరి చీకటి వ్యాపారాల్లో వాటాదారుడిని కాదని అన్నారు. అందుకే వాళ్లతో తనకు పడదని చెప్పారు.
తాను వెళ్లిపోతే విజయవాడ నుంచి జగ్గయ్యపేట వరకు దోచుకోవచ్చనేదే వారి అజెండా అని తీవ్రంగా విమర్శించారు. తాను తినను.. ఎవ్వరీని తిననివ్వను.. అనేదే వాళ్ల బాధని పరోక్షంగా విమర్శలు చేశారు. కేశినేని నాని అనే వ్యక్తి ఎంపీగా లేకపోతేనే వాళ్లకు సంతోషమని అన్నారు.
చదవండి: Tuni TDP Clashes: తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
Comments
Please login to add a commentAdd a comment