Budda Venkanna
-
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
‘‘మేము ఏకగ్రీవంగా చెబుతున్నాము. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో.. దానికి సరిగ్గా ఆపోజిట్‌గా మరొక వేదిక ఏర్పాటు చేసి, అదే రోజు నారా లోకేశ్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్.’’ఈ డిమాండ్ చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త కాదు! ఇటీవల చంద్రబాబు కటౌట్‌ను రక్తంతో కడిగిన ఆ పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న!! నాయకుడు అధినాయకుడిని డిమాండ్ చేయటం ఏంటి? పైగా లోకేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయమని డిమాండ్ చేయటం ఏంటి? అందునా.. ఏక కాలంలో ఎదురెదురుగా రెండు వేదికలను ఏర్పాటు చేసి – ఈ వేదికపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఎదురు వేదికపై చినబాబు పార్టీ అధ్యక్ష ప్రమాణ స్వీకారం జరగాలని కోరటం ఏమిటి? ఎందుకు ‘బుద్ధన్న’ అలా అన్నారు. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?లోకేశ్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన్నిప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్ధా వెంకన్న డిమాండ్. అంటే.. ఇండైరెక్టుగా లోకేశ్‌ను సీఎంను చేయాలని సూచించటమా? లేక చినబాబుకు దగ్గర కావాలన్న వ్యూహమా? లేదంటే, చంద్రబాబు సూచన మేరకే అలా డిమాండ్ చేసి ఉంటారా? ఇవేవీ కాదంటే.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఆయన అలా ఏమైనా అన్నారా? ఏదేమైనా టీడీపీలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఆసక్తికరమైన పరిణామం... బుద్ధా వెంకన్న డిమాండ్.టీడీపీ అధికారంలోకి వస్తుందా, రాదా అన్నది అటుంచి.. అసలు బుద్ధన్న ఇలాంటి ప్రకటన ఎందుకు చేసినట్లు అని ఆ పార్టీలోని నాయకులే అయోమయంగా ముఖాలు చూసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఏదైనా గందరగోళం మొదలైందా అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.నిజానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఆలోచిస్తున్నది లోకేశ్ బాబు అధ్యక్షుడు అవుతాడా కాడా అని కాదు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అని. ఓటమి అంటే చంద్రబాబుకు భయం. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేయరు. పొత్తు కోసం చూస్తారు. పొత్తు కుదరకపోతే కొత్త ఎత్తులు ఏవైనా వేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కూటమిని కట్టారు కనుక... ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలా అని ఆయన ఇప్పుడు ఆలోచిస్తుండవచ్చు. కొత్తగా ఏర్పడే జగన్ ప్రభుత్వంలో తొలి 100 రోజుల్లో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించటానికి రామోజీ తో కలసి ఏదైనా వ్యూహాన్ని ఆలోచిస్తూ కూడా ఉండొచ్చు. చెప్పలేం. గెలుపు కోసం చంద్రబాబు ఏమైనా చేయగలరు. ఓడిపోయినా కూడా... ఏమైనా చేయించగలరు!ఈ నేపథ్యంలో గత 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆయన్ని ఓడించిన స్వయంకృతాపరాధాలు, ఆయన్ని గెలిపించిన ఎత్తులు, పొత్తులు; గెలుపు వంటి ఓటములు, ఓటమి వంటి గెలుపుల గురించి చూడటం అవసరం.చంద్రబాబుకు మొదటి అతి పెద్ద ఓటమి 2004లో ఎదురైంది. అంతకు ముందు 1999లో జరిగిన ఎన్నికలు ఆయన్ని పార్టీలో తిరుగులేని నేతగా నిలబెట్టాయి. అక్కడి ఉంచి నేరుగా, మళ్లీ లేవలేనంతగా 2004లో కిందికి పడేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనంలో సైకిల్ కొట్టుకుపోయింది. స్కూల్ టీచర్లు, ప్రభుత్వోద్యోగులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయటం మాత్రమే కాదు, చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా పనిచేశారు. జన్మభూమి కార్యక్రమాలకు తమను ఉపయోగించుకోవటం వారికి ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వోద్యోగుల పని విధి విధానాలలో కొత్తగా తెచ్చిన మార్పులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభావం చూపెట్టాయి.ఇంతకన్నా ముఖ్యం.. విద్యుత్ చార్జీలు, నీటి చార్జీల పెంపు. దీనిపై రైతులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తే... హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో జరిగిన ధర్నాలో నిరసనకారులైన రైతులపై చంద్రబాబు పోలీసుల చేత కాల్పులు జరిపించారు. పోలీస్ కాల్పులలో రామకృష్ణ, విష్ణువర్థన్ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. బాబు పాలనలో మాయని మచ్చగా మిగిలిన ఉదంతం అది. ఇక 1995–2004 మధ్య రాష్ట్రంలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. అప్పుడే తెలంగాణ ఉద్యమం, అప్పుడే వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర! 2004 ఎన్నికల్లో ఆ రెండూ తమదైన ప్రభావం చూపి, బాబు ఓటమికి కారణం అయ్యాయి.ఇవికాక, మరికొన్ని కారణాలు కూడా ఆనాటి చంద్రబాబు ఘోర పరాజయానికి ఆజ్యం పోశాయి. తూర్పు ఆసియా దేశాల పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు కనిన స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్ –2020 కలలు బెడిసికొట్టాయి. కేవలం సమాచార సాంకేతిక విజ్ఞానం మీద, బయో టెక్నాలజీ మీదా ఆధారపడి ఆయన ఆ కలలు కన్నారు. అవి సమాచార సాధనాలను, విదేశీ అధినేతలను, విదేశీ వాణిజ్యవేత్తలను ఆకట్టుకుని ఉంటే ఉండొచ్చు. కానీ కేవలం వాటి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు భ్రమ పడ్డారు. గెలుపై ధీమాగా ఉన్నారు. చివరికి బోర్లా పడ్డారు. వ్యవసాయ రంగం అభివృద్ధి మీద, పేదరికం నిర్మూలనపైనా ఆయన దృష్టి సారించకపోవటం కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.అంతకు ముందు 1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన మాట నిజమే అయినా అది ఏమాత్రం చంద్రబాబు ఘనత కాదు. కార్గిల్ యుద్ధ ప్రభావం గెలుపునకు దోహదపడింది. పాకిస్థాన్‌తో కార్గిల్ యుద్ధంలో గెలిచిన అనంతరం.. సాధారణ సమయానికి భిన్నంగా, కొన్ని నెలల ఆలస్యంగా సార్వత్రిక ఎన్నికలు ఆ ఏడాది సెప్టెంబరులో జరిగాయి. వాటితో పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా. ఆ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో టై–అప్ అయ్యారు. తాము గెలిస్తే, కేంద్రంలో బీజేపీకి బయటి నుండి మద్ధతు ఇస్తామన్న హామీతో ఆయన ఆ ఎన్నికలకు వెళ్లారు.కార్గిల్ యుద్ధంలో గెలుపు వాజ్‌పేయిని గొప్ప నాయకుడిగా నిలబడితే ఆ నాయకుడితో చేయి కలపడం చంద్రబాబుకు గొప్పగా కలిసొచ్చింది. మొత్తం 294 సీట్లలో తెలుగుదేశం 269 సీట్లకు, బీజేపీ 24 సీట్లకు పోటీ చేస్తే తెలుగు దేశం 180 సీట్లలో గెలిచింది. అయినప్పటికి మునుపటి కన్నా 36 సీట్లు తగ్గాయి. బీజేపీకి మాత్రం అంతకుముందు కన్నా 9 సీట్లు పెరిగాయి. అంటే.. వాజ్‌పేయి ఆధ్వర్యంలోని జాతీయ పార్టీ బీజేపీ ప్రభావంతోనే చంద్రబాబు నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఎక్కువ సీట్లు సాధించింది తప్ప అది చంద్రబాబు చరిష్మా కాదు. ఇంకా చెప్పాలంటే కేవలం కార్గిల్ ప్రభావం.2004 ఎన్నికల తర్వాత వరుసగా 2009లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అందుకు కారణంగా చంద్రబాబు ఎలాంటి సాకులు చెప్పినా.. అసలు కారణం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమ నాయుడు విశ్లేషణలో కనిపిస్తుంది.‘‘2009లో మా పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం పీఆర్పీ పార్టీ, లోక్‌సత్తా పార్టీలు కొత్తగా రావటం. దాంతో యాంటీ కాంగ్రెస్ ఓటు చీలటం జరిగింది. రెండవది – టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నందు వల్ల ఈ హైదరాబాద్‌లో గానీ, రంగారెడ్డి జిల్లాలో గానీ మాకు ఏం సీట్లు కూడా రాలేదు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డిలో వాళ్లు, రాష్ట్రం సపరేట్ కాకూడదని ఎక్కువమంది జనం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒకే ఒక్క సీటు రావటం జరిగింది. అందువల్ల మేము ఘోరంగా ఓడిపోవటం జరిగింది. యాంటీ కాంగ్రెస్ ఓటు చిరంజీవి, జయప్రకాష్ నారాయణ్ చీల్చుకోవటం కూడా మా ఓటమి కారణం. అప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంకు దాదాపు 13 శాతం తగ్గింది. 2004లో 51 శాతం ఉన్న ఓట్ బ్యాంకు వాళ్లకు 38 శాతం అయింది. మేము 37 శాతంతో ఓడిపోయాం. ఒక్క పర్సెంట్ ఓట్ల తేడాతోనే మేము 2009 ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. గెలుపు అంచుకు వచ్చి ఓడిపోయాం. 92 సీట్లు గెలిచాం మేము. కాంగ్రెస్ 155 మాత్రమే గెలిచింది. వాళ్లకు 35 సీట్లు తగ్గినయ్. మాకు దాదాపు 45 సీట్లు పెరిగాయి. రాజశేఖర రెడ్డి విజృంభించి ప్రచారం చేయటం కూడా జనంలో కొంత భయం కల్పించింది’’ అన్నారు ముద్దు కృష్ణమ నాయుడు.2014లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లోనూ చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. వారి పొత్తు ఫలించి తెలుగుదేశానికి 25 సీట్లు, బీజేపీకి 7 సీట్లు పెరిగినప్పటికీ, వైఎస్సార్సీపీ ప్రభావంతో తెలుగు దేశం పార్టీ 117 సీట్లుకు మించి సాధించలేకపోయింది. ఆ మాత్రమైనా మోదీ హవాతో కొట్టకొచ్చిన సీట్లు, ఓట్లు మాత్రమే అవి.2019 గురించి ఇక చెప్పేదేముంది? వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 175కి 151 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లు మాత్రమే సాధించగలిగింది. అందుకు అనేక కారణాలున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు, స్పెషల్ స్టేటస్‌పై యు–టర్న్, అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా మెల్లిగా నడిపించటం, కాపు ఓట్లు చీలుస్తాడని అనుకున్న పవన్ కల్యాణ్ హీరో ఫ్యాక్టర్ పని చేయకపోవటం, అవినీతి.. వీటన్నిటితో పాటు రాష్ట్రానికి అందవలసిన నిధుల విషయంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించి ఎన్.డి.ఎ. నుంచి బయటికి రావటం కూడా టీడీపీని దెబ్బకొట్టేసింది. దానికి మించి పార్టీలో చంద్రబాబు ‘వన్ మ్యాన్ షో’ పార్టీని ఒంటరిని చేసింది.ఈ అనుభవం రీత్యా మళ్లీ ఈ తాజా ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఆ పొత్తు ఫలిస్తుందా, మొదటికే మోసం తెస్తుందా అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతలో, ఆయన్ని బలపరుస్తుండే మీడియాలో కలవరం రేకెత్తిస్తోంది. అందుకే ఎన్నికలు ముగిసి, ఫలితాలు ఇంకా రాకముందే తెలుగు దేశం నాయకులు, రామోజీ రావు.. ‘గెలుపు కూటమిదే’ అని నినదిస్తున్నాయి. ఒకటి గమనించారా? ‘గెలుపు తెలుగుదేశానిదే’ వారు అనటం లేదు. – మాధవ్ శింగరాజు -
జాకీలు పెట్టి లేపినా.. లోకేష్‌కు అంత సీను లేదబ్బా!
తెలుగుదేశం పార్టీలో ఏదో అంతర్మథనం ఆరంభమైనట్లుగా ఉంది. శాసనసభ ఎన్నికలలో వచ్చే ఫలితాలపై టీడీపీలో టెన్షన్ ఏర్పడిన నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత పార్టీలో ఏమి జరిగే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుస్తామని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్య చేయడంతో పార్టీ క్యాడర్లో కన్ప్యూజన్ ఏర్పడింది. టీడీపీ గెలిచే అవకాశం ఉంటే లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయవలసిన వెంకన్న ఇలా అనడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. వెంకన్న ప్రకటనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నా, ఇది అంత చిన్న విషయం కాదన్న భావన ఉంది.చంద్రబాబు జాతీయ అద్యక్షుడు అని చెప్పుకుంటున్నా, అది నామమాత్రమే అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజారపు అచ్చన్నాయుడు ఉన్నారు. ఆయన పట్ల లోకేష్‌కు అంత సదభిప్రాయం లేదు. అచ్చెన్నను తప్పించాలని గతంలో కూడా ఆలోచన చేశారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఏమైనా మాట్లాడారా? అనే సంశయం వస్తుంది. చంద్రబాబు వయసు రీత్యా ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడికి అప్పగించాలని ఏమైనా అనుకుంటున్నారా? ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే చంద్రబాబుపై పార్టీలో నమ్మకం బాగా తగ్గుతుంది. అలాగని లోకేష్ నాయకత్వ పటిమపై కూడా క్యాడర్లో ఇంకా విశ్వాసం ఏర్పడలేదు.ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఎదుర్కోగల సత్తా లోకేష్ కు ఉందా అనే సంశయం ఉంది. లోకేష్ స్వయం ప్రకాశిత నేత కాదు. తండ్రిచాటు బిడ్డగానే రాజకీయంలోకి వచ్చారు. అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నారు., అప్పడప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా, వాటికి గ్యారంటీ లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొన్నిచోట్ల చంద్రబాబు నాయుడు కొందరికి టిక్కెట్ హామీ ఇస్తే, లోకేష్ మరికొందరికి టిక్కెట్ హామీ ఇచ్చారట. వారి నుంచి డిపాజిట్ కూడా తీసుకున్నారని చెబుతారు. కానీ టిక్కెట్ పొందలేకపోయిన వారికి కొందరికి లోకేష్ డబ్బు తిరిగి ఇవ్వలేదని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇవి గొడవలుగా మారే అవకాశం ఉంటుంది.లోకేష్ ప్రసంగాలలోకానీ, పార్టీ నిర్వహణలో కానీ అంత సమర్థత చూపలేకపోతున్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు ఇప్పటికీ పార్టీ పగ్గాలు వదలి పెట్టలేకపోతున్నారన్నది వారి అభిప్రాయం. మరో సంగతి ఏమిటంటే పోలవరం కాంట్రాక్టర్‌గా గతంలో వ్యవహరించిన రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఒక ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్ లు తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని అనేవారు. దీనిపై ఇంతవరకు వీరు నోరు విప్పలేదు. డబ్బు లావాదేవీల సంగతి పక్కనబెడితే లోకేష్ గట్టివాడైతే 2014 ఎన్నికలలో పోటీచేసి ఉండేవారు. అప్పట్లో అధికారం రావడంతో పెత్తనం చేయడం ఆరంభించారు. తదుపరి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిల ద్వారా తండ్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసి ఎమ్మెల్సీ పొంది, ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. అయినా తన శాఖలను నిర్వహణలో అంత పేరు తెచ్చుకోలేకపోయారు.కానీ అన్నీ శాఖలపై ఆధిపత్యాన్ని చెలాయించడం వివాదాస్పదం అయింది. చంద్రబాబు కూడా ఆయా సందర్భాలలో లోకేష్ ను కలిసి వచ్చారా అని అడిగేవారట. అంటే దాని అర్ధం ఏమిటో తెలుసు కదా! అంత అధికారం ఎంజాయ్ చేసినా, 2019 శాసనసభ ఎన్నికలలో ఆయన ఓటమి చెందడం బాగా అప్రతిష్ట అయింది. అయినా ఎమ్మెల్సీగా ఉండడంతో కౌన్సిల్ లో కొన్నిసార్లు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించాలని ప్రయత్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియావారు ఆయనకు భారీ ఎలివేషన్ ఇచ్చి ప్రచారం చేశారు. అయినా ఆశించిన రీతిలో పార్టీలో నమ్మకం కలిగించలేకపోయారు.ఉపన్యాసాలలో తడబడడం, భాష సరిగా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇవేమీ పెద్ద సమస్యలు కావు. కానీ ఒక విధానం లేకపోవడం, తండ్రి మాదిరి అబద్ధాలు చెప్పడం, అధికారులను బెదిరించడం, రెడ్ బుక్ అంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం, కార్యకర్తలు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పోస్టు ఇస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి చేయడంతో ఈయనలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయన్న భావన ఏర్పడింది. తన తండ్రి చంద్రబాబు బాటలోనే నడిచి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, తానేదో చాలా గొప్పనాడిని అయిపోయినట్లు మాట్లాడడం చేస్తుడడంతో విశ్వసనీయత తెచ్చుకోలేకపోయారు. యువగళం పేరుతో పాదయాత్ర చేసినా, అందులో ఒక చిత్తశుద్ది కనిపించలేదు. పేద ప్రజలతో పూర్తిగా కలవలేకపోయారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోల్చి చూస్తే ఈయన దరిదాపులో కనిపించలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం ప్రకాశిత నేతగా ఎదిగితే, లోకేష్ ఏమో ఇంకా చంద్రబాబు కుట్ర రాజకీయాలపైనే ఆధారపడవలసి వస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండతోనే రాజకీయాలలోకి వచ్చినా, ఆ తర్వాతకాలంలో ఒంటరిగా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కున్నారు. పోరాటాలు చేశారు. సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలను ఎదుర్కున్నారు. 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాకపోయినా, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జనంలోకి వెళ్లి పాదయాత్ర చేసి, పేద ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు.చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిను దూషించడం, అసభ్య భాష వాడడం చేశారు. ఆ తేడాను జనం గమనించి 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించారు. లోకేష్ మంగళగిరిలోనే ఓటమిచెందారు. ఆ తర్వాత ఆయన అక్కడ కేంద్రీకరించి భారీ వ్యయం చేస్తూ, ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు రాయలసీమకు చెందినవారు. ఆయన చంద్రగిరి వదలి కుప్పం నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా పోటీచేస్తున్నారు. లోకేష్ ధైర్యవంతుడు అయి ఉంటే తన తండ్రి పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నుంచి పోటీచేసి ఉంటే ఆయనపై టీడీపీలో విశ్వాసం పెరిగేది. కానీ ఆ పని చేయలేకపోయారు.ఈ పరిస్థితిలో లోకేష్ పార్టీ అధ్యక్షుడు కావాలని వెంకన్న వంటివారు కోరుకున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఇంకా అర్హత సంపాదించలేకపోయారని అనుకోవాలా? యూపీలో సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ జీవించి ఉన్న రోజులలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికలలో అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలంతా ఓపెన్ గానే చెప్పారు. ఆ స్థితి లోకేష్ కు లేకపోవడం ఒక బలహీనతగా కనిపిస్తుంది.టీడీపీలో 2009 లో జూనియర్ ఎన్.టీ.ఆర్ సేవలను చంద్రబాబు వాడుకుని ఆ తర్వాత వదిలివేశారు. ఆయనను కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదు. జూనియర్ ఎన్.టీ.ఆర్ పార్టీలో ఉంటే లోకేష్ అవకాశాలు పోతాయని చంద్రబాబు భయపడ్డారు. నిజానికి లోకేష్ రాజకీయాలలోకి వస్తారా అని అంతకుముందు రోజుల్లో ఎవరైనా చంద్రబాబును అడిగితే ఆ ప్రశ్న వేసినవారిపై రుసరుసలాడేవారు. ఆ దశ నుంచి ఇప్పుడు కుమారుడిని జాకీలుపెట్టి లేపే పనిలో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యజమానులు పడ్డారు. పార్టీని నడపడం తప్పుకాదు. ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ రాజకీయాలను ఒక స్టాండర్డ్‌లో చేయలేకపోతే ప్రజలలో విశ్వసనీయత రాదు. ఇప్పుడు అదే సమస్యను లోకేష్ ఎదుర్కుంటున్నారు.ఏతావాతా చెప్పేదేమిటంటే వెంకన్న వంటివారికి టీడీపీ గెలుపు మీద సంశయాలు ఉండి ఉండాలి. అంతేకాక లోకేష్ సమర్థత మీద అనుమానాలు ఉండాలి. అందుకే ఆయనను పార్టీకి పరిమితం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. కానీ లోకేష్‌ను ఒక్కసారి పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అప్పుడు కూడా చంద్రబాబు చాటు మనిషిగానే ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. స్వతంత్రంగా పనిచేసేంత శక్తి ఉందా అనే భయం పార్టీలో ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే ఒకరకంగా, రాకపోతే మరోరకంగా ఈ పరిణామాలు ఉంటాయి. వివిధ సర్వేలను గమనిస్తే టీడీపీ శాసనసభ ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల ఫలితాల తర్వాత టీడీపీ సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
టికెట్టు నాదే.. తాట తీస్తా: బుద్దా వెంకన్న
విజయవాడ, సాక్షి: టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీరుపై మిత్రపక్షం జనసేన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. విజయవాడ పశ్చిమలో జనసేన తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని ఆ పార్టీ నేతలు బలంగా ప్రయత్నిస్తుండగా.. ఆ ప్రయత్నాలకు బుద్ధా వెంకన్న గండికొడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ బలప్రదర్శన పేరిట నిర్వహించిన హడావిడిపై జనసేన నేతలు మండిపడుతున్నారు. విజయవాడ వెస్ట్ టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ గురువారం బుద్ధా వెంకన్న దుర్గగుడి వరకు ర్యాలీ చేపట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవ్వబోయే దరఖాస్తును అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. తనకే బాబు టికెట్ ఇప్పించేలా అమ్మవారి ఆశీర్వదించారంటూ బయటకు వచ్చి హడావిడి చేశారు. ‘‘చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చా. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చా. .. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తా. అలాగని టిక్కెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తా. నాకు టిక్కెట్ కేటాయించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దర్నీ కోరుతున్నా’’ అని అన్నారాయన. అయితే.. ఈ తతంగం అంతా చూస్తున్న జనసేన నేతలకు మండిపోతోంది. పశ్చిమ టిక్కెట్ తమకే కేటాయించాలంటూ జనసేన నేత పోతిన మహేష్ చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో.. ఇప్పుడు బుద్ధా చేసిన హడావిడిని జనసేన నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ చంద్రబాబు ఏకపక్షంగా ఈ సీటును కూడా ప్రకటిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలా పదే పదే పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తూ సీట్లు ప్రకటించుకోవడంపై పార్టీ అధినేత పవన్‌ను కలిసి నిలదీసే యోచనలో జనసేన నేతలు ఉన్నట్లు సమాచారం. -
టీడీపీలో దుమారం రేపిన కేశినేని నాని వ్యాఖ్యలు
విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో మరోసారి దుమారం రేపాయి. తన సోదరుడు చిన్నాతో పాటు బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను ఆయన పరోక్షంగా టార్గెట్ చేశారు. ఓ వైపు తనతో పాటు తన వర్గాన్ని ప్రమోట్ చేసుకుంటూ సొంత పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ నియోజవర్గంలో తన కుమార్తె శ్వేత పోటీ చేయడం లేదని చెప్పారు. కొన్ని కబంధ హస్తాల నుంచి పశ్చిమ నియోజకవర్గానికి విముక్తి చేయడానికే తాను ఇంఛార్జ్‌గా వచ్చానని తెలిపారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారిని తాను సహించనని కేశినేని నాని హెచ్చరించారు. మేం ఏలుకుంటాం.. దోచుకుంటాం అంటే ఊరుకునేది లేదన్నారు. తాను ఎవరి చీకటి వ్యాపారాల్లో వాటాదారుడిని కాదని అన్నారు. అందుకే వాళ్లతో తనకు పడదని చెప్పారు. తాను వెళ్లిపోతే విజయవాడ నుంచి జగ్గయ్యపేట వరకు దోచుకోవచ్చనేదే వారి అజెండా అని తీవ్రంగా విమర్శించారు. తాను తినను.. ఎవ్వరీని తిననివ్వను.. అనేదే వాళ్ల బాధని పరోక్షంగా విమర్శలు చేశారు. కేశినేని నాని అనే వ్యక్తి ఎంపీగా లేకపోతేనే వాళ్లకు సంతోషమని అన్నారు. చదవండి: Tuni TDP Clashes: తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ -
టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. పచ్చ బ్యాచ్‌కు చుక్కలే!
రౌండప్ చేసి ఇబ్బంది పెడితే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను అంటాడు మహేష్ బాబు ఓ సినిమాలో. ఇప్పుడు బెజవాడ ఎంపీ కేశినాని కూడా మహేష్ బాబులా తయారయ్యాడు.. కన్ఫ్యూజన్లో దొరికిన వాళ్ళందర్నీ కెలుక్కుంటూ పోతున్నాడు. అవును బెజవాడ పండుగాడు కేశినేని నానితో అదే పెద్ద తిరకాసు.. ఆయన మానాన ఆయన్ను వదిలేస్తే పర్లేదు. విజయవాడ ఎంపీగా తన పనేదో తాను చేసుకుని పోయే రకం. అందరితో పులిహోరా కలుపుకుని పోయే రకం కాకున్నాపెద్దగా ఎవర్నీ ఇబ్బంది పెట్టే తత్త్వం లేకుండా ఉన్నంతలో అలా సాగిపోయే టైప్ నాయకుడు. అలాంటి మనిషిని కేవలం తనకు అలవిమాలిన చంచాగిరి చేయడం లేదని, సొంతంగా, వ్యక్తిగతంగా ఇమేజి బిల్డప్ చేసుకుని వెళ్తున్నాడు అనే కారణం చూపించి తన అనుయాయులు.. ప్రజల్లో ఇమేజి లేని వాళ్ళను పోగేసి చుట్టూరా రౌండప్ చేసి ఆయన్ను తరచూ డిస్టర్బ్ చేస్తూ వెళ్తున్నారు. విజయవాడ లోకసభ నియోజకవర్గం పరిధిలోని విజయవాడ వెస్ట్ (జలీల్ ఖాన్- బుద్ధా వెంకన్న) సెంట్రల్ (బోండా ఉమా) విజయవాడ ఈస్ట్ (గద్దె రామ్మోహన్) ఇంకా సిటీ పక్కనున్న నందిగామ (తంగిరాల సౌమ్య) నియోజకవర్గాల్లో నానికి ఇబ్బందులు కలిగించేలా చంద్రబాబు ఏర్పాట్లు చేసేసారు. ఈ నాయకులంతా పనిగట్టుకుని ఓ వర్గంలా ఏర్పడి సిట్టింగ్ ఎంపీకి ఇబ్బందులు కలిగించడమే లక్ష్యంగా పని చేస్తుంటారు. నగరంలో ఉంటున్న కేశినేని నానిని కాదని హైదరాబాద్‌లో బిజినెస్ చేసుకుంటున్న ఆయనను తమ్ముడు చిన్నిని విజయవాడ తీసుకొచ్చి ఆయనకు వ్యతిరేకంగా.. పోటీగా నాయకుడిగా తయారు చేస్తున్నారు. అయినా లెక్క చేయని నాని తన కుమార్తే శ్వేతను ఎమ్మెల్యేగా నిలబెట్టాలని చూస్తున్నారు. అసలు తండ్రికే విజయవాడలో చోటులేకుండా చేద్దాం అనుకున్న టీడీపీ పెద్దలు ఇప్పుడు ఆయన కూతుర్ని రానిస్తారా? ఖచ్చితంగా రానివ్వరు.. అలాగని నా రాత ఇంతే.. నా ప్రాప్తం ఇంతే అని ఊరుకునే రకం కాదు నాని. తనను ఇబ్బంది పెడుతున్న ఎవరూ నిద్రపోరాదు అనే కాన్సెప్ట్ మీద ఉంటూ విజయవాడ, చుట్టూ ఉన్న నియోజకవర్గాలను కెలుక్కుంటూ పోతున్నారు. మొన్న నందిగామ వైస్సార్సీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో కబుర్లు, కుశల ప్రశ్నలు అయ్యాక ఆయన్ను మెచ్చుకుంటూ రెండు మాటలు చెప్పేసి నందిగామ టీడీపీలోకి ఓ నిప్పు పుల్ల విసిరేశారు. అదిప్పుడు రాజుకుంది. విజయవాడ తెలుగదేశం రాజకీయాలు రోడ్డున పడ్డాయి.గొట్టం గాళ్ళు అందరూ బయటకు వచ్చారు.@JaiTDP @IamBondaUma @kesineni_nani pic.twitter.com/kH8zKmLv9l— varra Raveendra reddy (@varra1987) June 9, 2023 వాస్తవానికి నందిగామ మొదటి నుంచీ కమ్మల ప్రాబల్యం ఎక్కువ ఉన్న నియోజకవర్గం. దేవినేని వెంకట రమణ , ఆయన సోదరుడు దేవినేని ఉమా (ఇద్దరూ టీడీపీలో మంత్రులుగా చేసారు). కానీ ఆ తరువాత అది ఎస్పీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారడంతో అక్కడ గతంలో టీడీపీ నుంచి తంగిరాల ప్రభాకర్ (2014-2019) గెలుపొందారు. ఆయన అకాలమరణంతో ఆయన కుమార్తె సౌమ్యను ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా చేశారు. ఆ తరువాత 2019లో మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా(వైఎస్సార్సీపీ) గెలిచారు. అయితే, ఇప్పుడు నాని అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేతో రాసుకుపూసుకు తిరగడంతో టీడీపీ ఇంచార్జ్ సౌమ్యకు చిరాకు.. చికాకు కలిగింది. దీంతో ఆమె తన అనుచరులతో పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో నానిని నైతికత లేని నాయకుడిగా పేర్కొంటూ పోస్టులు పెట్టిస్తున్నారు. ఇక నాని వర్గం.. ముదురు టెంకలు ఉన్న విజయవాడనే కెలికేసారు.. సౌమ్యను వదులుతారా..? అదే జోరుతో ఆమెను సైతం ట్రోల్ చేస్తూ పోతున్నారు. మొత్తానికి నాని దెబ్బకు నందిగామ టీడీపీలో నిప్పు రవ్వలు మొదలయ్యాయి. ఇది కూడా చదవండి: తొంగి చూసినట్లే ఈనాడు రాతలు!..మరి వాటికీ సమాధానాలు చెప్పొచ్చుగా? -
వంద మందితో సూసైడ్ బ్యాచ్
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ‘వంద మందితో సూసైడ్ బ్యాచ్‌ను సిద్ధం చేశాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే వారిని చంపటానికైనా, చావటానికైనా ఈ వంద మంది సిద్ధంగా ఉంటారు. రానున్న రెండేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సంగతి చూస్తాం’ అని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుధవారం ఆయన తన ఇంటి వద్ద ఉన్న కార్యాలయంలో టీడీపీ నేత నాగుల్‌మీరాతో కలిసి చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. చంద్రబాబు జోలికి వస్తే చంపేస్తామని హెచ్చరించారు. ‘చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై చెత్త వాగుడు వాగే బ్యాచ్‌కు హెచ్చరిక చేస్తున్నాం. పిచ్చి వేషాలు వేసే వైఎస్సార్ సీపీ బ్యాచ్ ఈ రెండేళ్లూ నోరు అదుపులో పెట్టుకోవాలి. అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా, చావడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇందుకోసం వంద మందితో సూసైడ్ బ్యాచ్‌ను సిద్ధం చేసుకున్నాం’ అని హెచ్చరించారు. చంద్రబాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయని భావిస్తున్నారని, ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. అనంతరం ‘చంపటానికైనా, చావటానికైనా సిద్ధం’ అంటూ కార్యకర్తలతో శపథం చేయించారు. నాగుల్‌మీరా మాట్లాడుతూ చంద్రబాబు పాలన మళ్లీ రావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని పేర్కొన్నారు. -
చంద్రబాబును ఆ పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తారు: జోగి రమేష్
సాక్షి, విజయవాడ: బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పుట్టిన రోజు పూట కేక్ కట్ చేసుకోకుండా బుద్ధి లేకుండా బుద్దా వెంకన్న మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వంద మందితో సూసైడ్ స్క్వాడ్ తయారు చేసుకున్నానని ఎలా మాట్లాడతారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు.. చంద్రబాబుని కూడా ఆ పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. చంద్రబాబుని ప్రజలే మరిచిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రతిపక్షనేతగా కూడా పనికిరాడని ప్రజలు భావిస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమపాలన అందిస్తున్నారని తెలిపారు. అమ్మ ఒడి, ఆసరా లాంటి అన్నిపధకాలు ప్రజలకి అందుతున్నాయని పేర్కొన్నారు. -
రహస్య భేటీలతో విజయవాడ టీడీపీ కేడర్‌లో గుబులు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడలోని కేశినేని భవన్లో స్ట్రామ్ వాటర్ అంశంపై ఎంపీ నాని సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి బొండా ఉమ, బుద్దా అనుయాయులైన ఆరుగురు కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. 14 మంది కార్పొ రేటర్లలో ఆరుగురు రాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఆ పార్టీలో వర్గాలు ఉన్నాయని అనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. కరోనా వేవ్‌ల్లో వివిధ వేరియంట్లు వృద్ధి చెందినట్లు విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలోని టీడీపీ నేతల్లో విభిన్న స్పర్థలు పుట్టుకొస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ ముఖ్యుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో మట్టికరచిన పార్టీ తాజా పరిణామాలతో అంతకన్నా అడుగంటుతోంది. రహస్య భేటీలు ఓ వైపు, పోటాపోటీ పరామర్శలు, ఓదార్పులను మరోవైపు నాయకులు కొనసాగిస్తున్నారు. బెజవాడ పార్లమెంటు పరిధిలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయని, చివరకు పార్టీ ఏ దరికి చేరుతుందో కూడా అంతుచిక్కడం లేదని క్యాడర్ అంచనాకు వస్తోంది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా తన కుమార్తె శ్వేత మాత్రమే పోటీలో ఉంటుందని తనదైన శైలిలో ఏకపక్షంగా ప్రకటించి రచ్చకు తెర తీశారని పార్టీ లో విమర్శలు ఎదుర్కొన్న ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) నేటికీ అదేతీరుతో వ్యహరిస్తున్నారని ఆయన వ్యతిరేకులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. కార్పొరేటర్ అయిన తన కుమార్తె శ్వేతను విజయవాడ వెస్ట్, సెంట్రల్తో పాటు లోక్‌సభ పరిధిలోని తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోనూ నాని తిప్పుతు న్నారని స్వపక్షీయులు గుర్తు చేస్తున్నారు. స్థానిక పార్టీ బాధ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ హోదాలో కార్పొరేటర్ పర్యటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వర్గీయులకేమైనా పార్టీలో ప్రత్యేకతలు ఉన్నాయా అని బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల నేతలు నిలదీస్తున్నారు. ఎంపీ హోదాలో కేశినేని నాని ఎక్కడికైనా వెళ్లవచ్చని, శ్వేత తమ నియోజకవర్గాల్లో పర్యటనలు ఏంటని ఇటీవల వెస్ట్, సెంట్రల్లో నిలదీశారని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఇటీవల కేశినేని భవన్లో నిరసన దీక్ష చేపట్టగా తూర్పు నియోజకవర్గంలో వెళ్లి చేసుకోవాలంటూ నాగుల్ మీరా, బుద్దా వెంకన్న వర్గీయులు ధ్వజమెత్తారు. సెంట్రల్‌లోని శివాలయం ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమంలో, వెస్ట్‌లో 45వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం ప్రారంభం సందర్భంగానూ రగడ చోటుచేసుకుంది. ఆ నలుగురు రహస్య భేటీ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ తీవ్ర విమర్శలు చేసిన బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తాజాగా బొండా నివాసంలో రహస్య భేటీ నిర్వహించారు. గతంలో కేశినేని భవన్లో ఉంటూ నానితో అత్యంత సన్నిహితంగా మెలిగిన కొమ్మారెడ్డి పట్టాభి కూడా బొండా బృందంతో జత కట్టారు. కేశినేనికి వ్యతిరేకంగా ఎంత బలంగా పని చేయాలి, ఎంపీని ఎలా ఒంటరిని చేయాలనే సమాలోచనలు నలుగురు చేశారని సమాచారం. అందులో భాగంగానే అధిష్ఠానంపై నానిది ధిక్కారస్వరమని, కార్పొరేషన్ ఎన్నికల్లో శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం వల్ల పార్టీ సర్వ నాశనమైందని సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు వైరల్ చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో బుద్దా వెంకన్న గట్టి పోటీ ఇస్తారని విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ లోక్‌సభ పరిధిలో ఏదో ఒక కార్యక్రమం పేరిట రహస్య పర్యటనలు కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కేశినేనికి వ్యతిరేకంగా బొండా బృందానికి మాజీ మంత్రి దేవినేని ఉమ పరోక్ష మద్దతు లేకపోలేదని స్వపక్షీయులు అంటున్నారు. మచిలీపట్నం లోక్ సభ పరిధిలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు పదవి ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ గుర్రుగా ఉన్నారు. మరోవైపు వైఎస్సార్ సీపీ సర్కారు విజయవాడ నగర అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి పార్టీని పటిష్ట పరచుకుంటోందని టీడీపీ వర్గీయులు విశ్లేషి స్తున్నారు. నగరంలోని పేదల విషయంలో భారీఎత్తున చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం తీరు సర్కారు వైఖరిని తేటతెల్లం చేస్తోందని అంటున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ ప్రజా మద్దతును కూడగట్టుకుంటున్న సర్కారు వైఖరిని టీడీపీ వర్గీయులు గుర్తిస్తున్నారు. -
ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బెదిరింపు కాల్స్..ఆడియో వైరల్
సాక్షి, విజయవాడ: కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఫ్యాన్ వీచిన గాలికి సైకిల్ కనుమరుగైంది. ఒకవైపు టీడీపీ పార్టీని తమ భుజాలపై మోస్తున్న కార్యకర్తలను, నాయకులను ఓదార్చాల్సిన బాధ్యత మరిచిన ఆ పార్టీ అగ్రనాయకులు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడ కార్పోరేషన్ పరిధిలో ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. విజయవాడ 42 వ డివిజన్ నుంచి పోటీచేసి ఓడిపోయిన టీడీపీ కార్పోరేటర్ అభ్యర్ధి యెదుపాటి రామయ్యపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బెదిరింపులకు దిగారు. యెదుపాటి రామయ్య ఫేస్బుక్లో టీడిపీ నాయకులను విమర్శించారు. ‘ఒక్క ప్రెస్‌మీట్‌తో 20 మంది కార్పోరేట్ అభ్యర్ధులం ఓడిపోయాం. మన ఓటమికి కారణం ఎవరో మనందరికి తెలుసు ’ అని పశ్చిమ నియోజక వర్గ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు. ఈ విషయాన్ని లేవనెత్తినందుకు గాను బుద్దా వెంకన్న నుంచి బెదిరింపుకాల్స్ వచ్చాయని తెలిపారు. ఆ ఆడియోను విడుదల చేశారు యెదుపాటి రామయ్య. ఇప్పుడు ఆ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చివరగా తమకు ఇక ఫోన్లు చేయవద్దని, అవసరమైతే పార్టీని వీడుతామని రామయ్య భార్య రమణి తెలిపారు. అదే సమయంలో తాము ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతాం సార్ అంటూ ఫోన్ పెట్టేశారు రమణి. -
‘అది గుడిని, గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్’
-
'పదవుల్లేక వారికి మతి భ్రమించినట్టయింది'
సాక్షి, అమరావతి : కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శనివారం టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అయ్యన్నపాత్రుడుకి మతిభ్రమించింది.. బుద్దా వెంకన్నకు బుద్ధిలేదు. అడ్డదారిలో రాజకీయాలు చేసే వ్యక్తి ట్విటర్ లోకేష్.. ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం పనికిరాడు. కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే నేను విచారణకు ఆదేశించా. విచారణలో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు 2014-18 మధ్య అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాం.(చదవండి : ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి) అయితే తెలకపల్లి కార్తిక్ 2019 డిసెంబర్లోనే బెంజ్ కారును కొనుగోలు చేశాడు. అయితే కారుకు సంబంధించిన కంతులు కట్టకపోవడంతో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ బెంజ్ కారును సీజ్ చేసింది. 2020 జూన్‌లో ఈఎస్ఐ కుంభకోణం కింద కార్తిక్‌పై కేసు నమోదయింది. కారు తీసుకొని ఉంటే.. ఈఎస్ఐ స్కాంలో A14 ముద్దాయిగా ఉన్న కార్తిక్‌ను కేసులో నేనేందుకు పేరు తొలగించలేదో చెప్పాలి. టీడీపీ నాయకులు పదవులు లేక మతిభ్రమిచ్చింది.నేను భూమి కొనుగోలులో అన్ని పేపర్లు కరెక్టుగా ఉన్నందుకే కొన్నా,, ఎక్కడా భూకజ్జాకి పాల్పడలేదు. 'అంటూ చురకలంటించారు. -
కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు
-
కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు : పిన్నెల్లి
సాక్షి, గుంటూరు(మాచర్ల): పల్నాడులో ప్రశాంత పరిస్థితులను చెడగొట్టేందుకు టీడీపీ యత్నిస్తోందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడ నుంచి 10 కార్లలో టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నతో పాటు మరికొందరు గూండాలను చంద్రబాబు పంపించారన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. మాచర్లలో దూసుకొచ్చిన టీడీపీ వాహనాల్లో ఒకటి ఓ పిల్లాడికి తగిలిందని, దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని తెలిపారు. వారిని సముదాయించాల్సింది పోయి బోండా సహా ఇతర టీడీపీ నాయకులు దుర్భాషలాడారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకమని, అందులో భాగంగానే పది కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారని తెలిపారు. ప్రజాబలం లేని చంద్రబాబు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఆ ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అన్నారు. ఇదే పల్నాడులో 2014 స్థానిక ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు అంబటి రాంబాబు, ముస్తాఫాలపై దాడులు చేసి చంపడానికి యత్నించారని గుర్తు చేశారు. మొన్నటికి మొన్న రైతుల ముసుగులో తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, అయినా తాము సంయమనంతో వ్యవహరించామని తెలిపారు. -
బాబు ఇల్లు మునిగితే.. సంతాప దినాలా!
సాక్షి, అమరావతి: వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు అహర్నిశలు శ్రమిస్తుంటే .. చంద్రబాబు ఇల్లు మునుగుతోందంటూ టీడీపీ నేతలు వారం రోజులపాటు సంతాప దినాలు జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్ ఎద్దేవా చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరదలతో ప్రజలు అల్లాడుతుంటే వారికి సహాయం చేయాలని ఏ రాజకీయ పార్టీకైనా, వ్యక్తికైనా అనిపిస్తుందన్నారు. చంద్రబాబు, ఆయన వందిమాగధులైన దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, బొండా ఉమ లాంటివారు మాత్రం బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇక్కడ ఒక ఇంటిని కూడా నిర్మించుకోలేదన్నారు. ఎవరో నిర్మించిన అక్రమ కట్టడంలో ఉండటం ఏంటని నిలదీశారు. బుద్ధిలేని వెంకన్న ఆత్మహత్య చేసుకుంటానంటున్నారని.. ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు, శరం ఉండాలని పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగరటం పెద్ద సమస్యలా గగ్గోలు పెడుతున్నారని, డ్రోన్లతో వరద పరిస్థితులను అంచనా వేయటం తప్పెలా అవుతుందని నిలదీశారు. చంద్రబాబును హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు అంటున్నారని.. ఐదుకోట్ల ఆంధ్రులు ఆయనను ఇప్పటికే రాజకీయంగా సమాధి చేశారని అన్నారు. చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం, అగత్యం ఎవరికీ లేదని, ఆయన బందరు రోడ్డులో నడుచుకుంటూ వెళ్లినా పట్టించుకునేవారే ఉండరని అన్నారు. ఓర్వలేకే జగన్ పర్యటనపై విమర్శలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తే ఓర్వలేని వారంతా మాట్లాడుతున్నారని, టీడీపీ వారి లాగా పర్యటనలకు రూ.కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదని రమేష్ పేర్కొన్నారు. ఇందుకు సీఎం వైఎస్ జగన్ తన సొంత డబ్బు వెచ్చిస్తున్నారని స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసం అక్కడి వారితో మాట్లాడి పరిశ్రమలు వచ్చేలా చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు చౌకబారు మాటలు మాట్లాడుతూ.. విందులు, విలాసాలు చేస్తున్నారనటం సరికాదన్నారు. కొందరు బీజేపీలో చేరి చంద్రబాబుకు అనుకూలంగా అద్దె గొంతులు వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధిష్టానం ఇలాంటి కోవర్టులను గురించి తెలుసుకుని ప్రవర్తించాలన్నారు. కనీస జ్ఞానం లేకుండా లోకేశ్ పడవను అడ్డుపెట్టి వరదను చంద్రబాబు ఇంట్లోకి పంపారని ట్వీట్ చేయటం అతడి అపరిపక్వతకు నిదర్శనమన్నారు. -
బాబు.. లోకేష్‌కు రాజకీయ జ్ఞానం నేర్పు
సాక్షి, తాడేపల్లి: వరద వచ్చి ప్రశాంతంగా ముగిసింది కానీ టీడీపీ నాయకుల బురద రాజకీయాలు మాత్రం ఆగలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఎద్దేవా చేశారు. సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరద సహాయక చర్యలపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే.. చంద్రబాబు భజనపరులు మాత్రం బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కట్టడంలో ఉండటం తప్పని తెలిసి కూడా చంద్రబాబు అందులోనే ఉండటాన్ని ఏమంటారని ఆయన ప్రశ్నించారు. వరద, ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి డ్రోన్ ఉపయోగిస్తే తప్పేంటన్నారు. చంద్రబాబును హత్య చేయడానికే డ్రోన్లు వాడుతున్నారని దేవినేని ఉమా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. బాబును ప్రజలు ఎప్పుడో హత్య చేసి.. 23 అడుగుల గొయ్యిలో పాతేశారని జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏమన్నా అయితే ఆత్మహత్య చేసుకుంటానని అంటున్న బుద్ధిలేని బుద్దా వెంకన్నాను ముందు అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. చంద్రబాబు రోడ్డు మీద వెళ్తుంటే పట్టించుకునే నాధుడే లేడని ఎద్దేవా చేశారు. బుద్దా వెంకన్న, దేవినేని ఉమాలు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సొంత ఖర్చులతో అమెరికా వెళ్లారని.. చంద్రబాబులా విందు, వినోదాలకు కాదని స్పష్టం చేశారు. జగన్ విదేశీ పెట్టుబడుల కోసం తాపత్రయ పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు మంచి కార్యకర్తలను తయారు చేసుకోకుండా కోవర్టులను తయారు చేసుకున్నారని జోగి రమేష్ ఆరోపించారు. ఆ కోవర్టుల్లో కొందరు బీజేపీలో చేరి చంద్రబాబు గొంతు వినిపిస్తున్నారని ఆయన మండి పడ్డారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు అడ్డంగా పెట్టాలని లోకజ్ఞానం లేని లోకేష్ ట్విట్లు చేస్తున్నాడని రమేష్ ఎగతాళి చేశారు. చంద్రబాబు కనీసం వారానికొకసారైనా లోకేష్‌కు రాజకీయ జ్ఞానం నేర్పాలని రమేష్ కోరారు. -
ట్విట్టర్లో టీ‘ఢీ’పీ!
సాక్షి, అమరావతి బ్యూరో : టీడీపీ ఎంపీ కేశినేని నాని.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ ట్వీట్ వార్ రాత్రి వరకు కొనసాగి.. ఏకంగా కాళ్లు పట్టుకోవడం, పునర్జన్మలు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లింది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఈ స్థాయిలో జరుగుతున్నా టీడీపీ పెద్దలు ఎవరూ ఇప్పటి వరకూ స్పందించకపోవడం గమనార్హం. కేశినేని ట్వీట్‌కు బుద్ధా కౌంటర్ ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు.. నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!’ అంటూ కేశినేని నాని ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు 9.32 గంటల సమయంలో రీట్వీట్ చేసిన బుద్ధా వెంకన్న.. ‘సంక్షోభ సమయంలో పార్టీ, నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాంటి అవకాశవాదులు కాదు.. చనిపోయేవరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ‘నిన్నటి దాకా చంద్రబాబు కాళ్లు.. రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్లు.. కాళ్లు కాళ్లే.. వ్యక్తులు మాత్రమే తేడా!’ అని కేశినేని నాని ట్విట్టర్లో హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించిన బుద్దా వెంకన్న.. కేశినేనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు. దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబర్‌పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా.. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా? నువ్వు చేసినవన్నీ అభాండాలు, నేను చెప్పేవన్నీ నిజాలు. బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1977లో సొంతంగా దొంగ రిసిప్ట్లు తయారు చేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలు ఫైనాన్స్ కంపెనీలకు ఛీట్ చేసిన నువ్వా ట్వీట్ చేసేది. చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని చిరంజీవి పార్టీని కూల్చావు.. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడిలా మాట్లాడుతున్నావు. విజయసాయి రెడ్డి మీద నేను పోరాడుతున్నానో నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు. నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు.. ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు’ అని కేశినేనిపై బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.దానికి కేశినేని స్పందిస్తూ ‘రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు గుళ్లో కొబ్బరిచిప్ప దొంగలకు, సైకిల్ బెల్లుల దొంగలకు, కాల్‌మనీగాళ్లకు, సెక్స్ రాకెట్‌గాళ్లకు, బ్రోకర్లకు, పైరవీదారులకు అవసరమని.. తనకు అవసరం లేదని ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ మాటల యుద్ధం రాత్రి వరకు ఇలా కొనసాగింది. వీరు ఇద్దరూ ట్వీటర్ పోరు నిర్వహిస్తుండగానే టీడీపీ నేత నాగుల్‌మీరా మధ్యలో స్పందిస్తూ.. ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి కాదు. పులి పులే నక్క నక్కే.. నాయకుని కోసం రాజీలేని పోరాటం చేసే తత్వం కేశినేని నాని డీఎన్ఏలోనే ఉంది. ప్రజాక్షేత్రం నుంచి గెలిచిన వారికే ప్రజానాయకులెవరో తెలుస్తుంది కాగితం పులులకు కాదు.’ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇరువురు నేతలు బహిరంగాంగా రచ్చకెక్కినా అసలు పార్టీలో ఏం జరుగుతోంది. ఇద్దరు నేతలు ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నా.. పార్టీ అధినేత ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు? అన్న ప్రశ్నలతో ఆ పార్టీ కేడర్ సతమతవుతోంది. బుద్ధాకు కోపం ఇందుకేనా? ఇటీవల విజయవాడలో ఓ సమావేశం నిర్వహించిన కేశినేని నాని.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాగుల్‌మీరాను గెలిపించాలని మాజీ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. ఆ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న బుద్ధా వెంకన్నకు ఇది ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. అప్పటి నుంచి నాని, వెంకన్న మధ్య మాటల యుద్ధం, వ్యంగ్యాస్త్రాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
టీడీపీ నేతల గుండాగిరిపై నోటీసులు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యాన్ని దూషిస్తూ, బెదిరింపులకు దిగిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరాకు హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారా వీరికి నోటీసులు అందచేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దౌర్జన్యంపై ‘సాక్షి’ పత్రికలో ‘ఐపీఎస్‌పై గూండాగిరి’ శీర్షికన 2017లో కథనం ప్రచురితమైంది. ఇది చదివిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు దీనిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సాక్షి కథనాన్ని సుమోటోగాగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులందరికీ ఇప్పటికే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, కేశినేని నానికి నోటీసులు అందలేదని ఓ న్యాయవాది వివరించారు. దీంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది. -
బుద్ధా.. మీ మాటలు వెనక్కితీసుకోండి: దాసరి ఫ్యామిలీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, వైఎస్సార్సీపీ నాయకుడు మోహన్‌బాబును ఉద్దేశించి.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకట్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోహన్‌బాబును విమర్శిస్తూ.. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు గురించి ప్రస్తావించడంపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోహన్‌బాబు తమకు పెద్ద అన్నయ్యలాంటి వారు అని, నాన్న చనిపోయిన తరువాత అన్ని ఆయనే చూసుకుంటున్నారని దాసరి నారాయణరావు పెద్ద కొడుకు తారకప్రభు తెలిపారు. దాసరి నారాయణరావుకు మోహన్ బాబు పంగనామాలు పెట్టారని బుద్ధా వెంకన్న అన్నారని, ఈ వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని తారకప్రభు కోరారు. తాము ఎప్పుడైనా, ఎక్కడైనా మోహన్ బాబు తమను మోసం చేశారని చెప్పమా? తాము చెప్పకుండా ఈ విషయంలోకి దాసరిని ఎందుకు లాగారని బుద్ధా వెంకన్నను ఆయన ప్రశ్నించారు. దాసరి నారాయణరావు గారి పెద్ద కోడలు పద్మ స్పందిస్తూ.. ‘మోహన్‌బాబు నన్ను అమ్మా అని పిలుస్తారు. నన్ను కూతురిలా ఆయన చూసుకుంటారు. మా రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉంటాయి. బుద్ధా వెంకన్నగారూ.. మీ మాటలను వెనక్కి తీసుకోండి. రాజకీయాల కోసం మా కుటుంబాన్ని ఇందులోకి లాగకండి’ అని హితవు పలికారు. -
నోరుంది కదా అని పారేసుకోకండి: మంచు విష్ణు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు మోహన్బాబునుద్దేశించి టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన ఆరోపణలపై హీరో మంచు విష్ణు ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. 'టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి.. ఎలెక్షన్స్ ఉండేది ఇంకో పది రోజులే.. దాని తర్వాత.. మీరు మా ఇంటికి రావాలి.. మేము మీ ఇంటికి రావాలి.. ఒకళ్లనొకళ్లు ముఖాలు చూసుకోవాలి... ఎలక్షన్స్‌లో మీరూ విమర్శించొచ్చు.. మేము మిమల్ని విమర్శించొచ్చు, కానీ డీసెన్సీ ఉండాలి. అన్నిటికి ఒక హద్దు ఉంటుంది. నెల రోజుల ముందు తిరుపతికి వచ్చి మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చిపోకండి' అంటూ ట్వీట్ చేశారు. TDP MLC బుద్ధా వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి.. ఎలెక్షన్స్ ఉండేది ఇంకో పది రోజులే.. దాని తర్వాత.. మీరు మా ఇంటికి రావాలి.. మేము మీ ఇంటికి రావాలి.. ఒకళ్లనొకళ్లు ముఖాలు చూసుకోవాలి...(1/2) #VoteForFan #APNeedsYSJagan #APWithYSRCP — Vishnu Manchu (@iVishnuManchu) April 2, 2019 ఎలక్షన్స్ లో మీరూ విమర్శించొచ్చు.. మేము మిమల్ని విమర్శించొచ్చు, కానీ డీసెన్సీ ఉండాలి. అన్నిటికి ఒక హద్దు ఉంటుంది. నెల రోజుల ముందు తిరుపతికి వచ్చి మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చి పోకండి.(2/2) #VoteForFan #APNeedsYSJagan #APWithYSRCP — Vishnu Manchu (@iVishnuManchu) April 2, 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల ఆపాలి
సాక్షి, అమరావతి : ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని నిలిపివేయాలని కోరుతూ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, సాధినేని యామిని, గౌతు శిరిషా, సతీష్‌లు ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి కలిసి సినిమా విడుదలను ఆపాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారన్నారు. (‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై ఈసీకి ఫిర్యాదు) ఎన్నికల వేళ ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపుతుందని అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు ప్రతిష్టతను దిగజార్చేలా సినిమా ట్రైలర్ ఉందన్నారు. ఎన్నికలల్లో చంద్రబాబును దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమా విడుదలను ఆపాలని డిమాండ్ చేశారు. రామ్‌గోపాల్ వర్మ విడుదల చేసిన ట్రైలర్ వీడియోని సీఈఓకి ఇచ్చామని, ఆయన పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వివాదాలు కేంద్ర బిందువైంది. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి వెనక్కి తగ్గేది లేదంటూ మార్చి 22న విడుదల అని ప్రకటించేశాడు. తాజాగా టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. చదవండి : టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన లక్ష్మీ పార్వతి -
‘నువ్వో, నేనో తేల్చుకుందాం!’
సాక్షి, విజయవాడ : ‘బుద్దా వెంకన్న ఎమ్మెల్సీగా పనికిరాడు.. దమ్మూ, ధైర్యం ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చెయ్. పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను బీజేపీ తరుపున నిలబడతా.. నువ్వో నేనో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం’ అంటూ బీజేపీ నగర అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుద్దా వెంకన్న స్ధాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రం నిధులివ్వలేదని టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఎవ్వరు తిడితే వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవులివ్వడం సిగ్గుచేటన్నారు. కన్నా లక్ష్మీనారాయణ అడిగిన వంద ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని తెలిపారు. దమ్ముంటే చంద్రబాబును కన్నాతో డిబేట్‌కు రప్పిస్తారా అని సవాల్ విసిరారు. -
‘దుర్గ గుడి వ్యవహారాలన్నింటికీ ఆయనే కారణం’
సాక్షి, విజయవాడ : దుర్గ గుడిలో జరిగే వ్యవహారాలన్ని బుద్దా వెంకన్న కనుసన్నల్లోనే జరుగుతన్నాయి. అందుకే చీర మాయం అయిన వ్యవహారంపై పోలీసులు ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత కొంత కాలం నుంచి దుర్గగుడిలో జరుగుతున్న చీరల మాయంపై ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. పాలకమండలి సభ్యుల వ్యవహారశైలి వివాదస్పదంగా ఉన్నా ప్రభుత్వ చర్యలు మాత్రం శూన్యమని విమర్శించారు. గతంలో తాంత్రిక పూజలు.. ఇప్పుడు చీరల మాయం అసలు ఇంతకు దుర్గ గుడిలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రజలకు తెలయజేయాలని డిమాండ్ చేశారు. గతంలో మంత్రి నారా లోకేష్ కోసమే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారు కాబట్టే అందుకు సంబంధించిన నివేదిక ఇంత వరకూ రాలేదని ఆరోపించారు. యనమల జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పు : మల్లాది విష్ణు రాష్ట్రంలో కొన్ని పత్రికల రాతలు చూస్తూంటే అవి ఎవరి విజయం కోసం పనిచేస్తున్నాయో జనాలకు అర్థమవుతుంది. మరి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖలో ప్రస్తావించిన అంశాలకు యనమల రామకృష్ణుడు ఎందుకు సమాధానం చెప్పలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ కృషి చేస్తోంటే.. టీడీపీ మాత్రం నిస్సిగ్గుగా బీజేపీతో స్నేహం కొనసాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న కుట్రలన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు సర్కారు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. -
మహిళా ఎమ్మెల్యేను తిట్టించడం సిగ్గుచేటు
గన్నవరం: ఓ పక్క మహిళలు, బాలికలకు రక్షణగా నిలవాలి, గౌరవించాలి అని సీఎం చంద్రబాబు ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ.. మరోపక్క మహిళా ఎమ్మెల్యే అనే కనీస గౌరవం లేకుండా ఆర్కే రోజాను అసభ్యకరంగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో తిట్టించడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గన్నవరం పార్టీ కార్యాలయంలో గురువారం విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, జోగి రమేశ్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న బుద్దా వెంకన్న సంస్కారహీనుడి వలే మాట్లాడుతుండటం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. దాచేపల్లి ఘటనలో బాధితురాలి పక్షాన పోరాడిన రోజాను సభ్య సమాజం తలదించుకునే విధంగా బుద్దా మాట్లాడడం చూస్తుంటే టీడీపీకి మహిళలంటే ఏమాత్రం గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. ఇటువంటి బుద్ధిహీనులకు ప్రజలు తగిన సమాధానం చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం ద్వారా డ్వాక్రా మహిళలు, రైతులు, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య, వైద్యం వంటి సదుపాయాలన్నీ లభిస్తాయని అందరూ విశ్వసిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు: ఉదయభాను విపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సామినేని ఉదయభాను అన్నారు. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గపు పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను అన్ని వర్గాల ప్రజలు జగన్ దృష్టికి తీసుకువెళుతున్నారని, ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. రోజాను కించపరిచే విధంగా అసభ్యంగా మాట్లాడిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఓ సంస్కారహీనుడని జోగి రమేశ్ ధ్వజమెత్తారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగిలించిన నీచ చరిత్ర ఉన్న బుద్దా గురించి జిల్లా ప్రజలందరికి తెలుసన్నారు. ప్రజలు ఛీకొట్టిన వారందరిని టీడీపీలోకి తీసుకువచ్చి ఎమ్మెల్సీ, విప్ పదవులిచ్చిన చరిత్రహీనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. మహిళ అనే కనీస గౌరవం లేకుండా వ్యవహరించిన బుద్ధిహీనుడైన బుద్దాను చెప్పులతో కొట్టినా తప్పులేదన్నారు. -
‘కొబ్బరి చిప్పల దొంగ బుద్దా వెంకన్న’
సాక్షి, గన్నవరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. మహిళా ఎమ్మెల్యే అన్న కనీస గౌరవం లేకుండా రోజాపై అనుచిత వాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న సంస్కార హీనుడని మండిపడ్డారు. గుడిలో కొబ్బరి చిప్పలు దొంగిలించే చరిత్ర బుద్దా వెంకన్నది అని ఎద్దేవా చేశారు. గన్నవరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు జోగి రమేశ్, సామినేని ఉదయభాను, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావు, పేర్ని నాని మాట్లాడుతూ.. ఓ మహిళా ఎమ్మెల్యేను అగౌరవపరిచేలా బుద్దా వెంకన్న మాట్లాడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బజారులో ఛీకొట్టిన వారిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వనించి ఎమ్మెల్సీలు, విప్ పదవులు ఇస్తున్నారని విమర్శించారు. మహిళలను గౌరవించాలంటూ చంద్రబాబు ర్యాలీలు చేస్తూనే తన ఎమ్మెల్సీల చేత ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయిన్నారని ఆరోపించారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగే వ్యక్తి బుద్దా వెంకన్న అని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు ఒక్క రోజు దీక్ష కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నార’ని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. -
టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి
విజయవాడ సిటీ: తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్నను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను నిలదీసిన ఎమ్మెల్యే రోజాపై బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపితే.. తమ ఎమ్మెల్యే రోజాపై కోడిగుడ్లతో కొట్టిస్తామంటారా? అని ఆయన మండిపడ్డారు. అదే జరిగితే చంద్రబాబు ఎక్కడ పర్యటన ఉంటే అక్కడ తామూ కోడిగుడ్లతో దాడి చేస్తామని హెచ్చరించారు. బుద్దా వెంకన్న సభ్యతా సంస్కారాలతో వ్యవహరించాలని హితవుపలికారు. ప్రజల పక్షాన తాము నిలబడితే.. ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దాచేపల్లి ఘటనకు నిరసనగా ఎమ్మెల్యే రోజా చేసిన పోరాటంతో సీఎం చంద్రబాబు సైతం ఆ బాలికను పరామర్శించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని నిలదీశారని ఎమ్మెల్యే రోజాపై అసభ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. బుద్దా వెంకన్న చంద్రబాబు పాఠశాలలో చేరినప్పటి నుంచి రాజకీయ హుందాతనం లేకుండా మాట్లాడు తున్నాడని మండిపడ్డారు. మీ నాయకుడు లోకేష్ విదేశాల్లో మహిళలతో విచ్చలవిడిగా తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయని, ఇంట్లో పనమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించినట్టు అభియోగాలు ఉన్నాయని గుర్తు చేశారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు.