నోరుంది కదా అని పారేసుకోకండి: మంచు విష్ణు | Mohanbabu counters Budda venkanna comments in Twitter | Sakshi
Sakshi News home page

నోరుంది కదా అని పారేసుకోకండి: మంచు విష్ణు

Published Tue, Apr 2 2019 12:34 PM | Last Updated on Tue, Apr 2 2019 5:11 PM

Mohanbabu counters Budda venkanna comments in Twitter - Sakshi

ఎలక్షన్స్‌లో మీరూ విమర్శించొచ్చు.. మేము మిమల్ని విమర్శించొచ్చు, కానీ డీసెన్సీ ఉండాలి.

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబునుద్దేశించి టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన ఆరోపణలపై హీరో మంచు విష్ణు ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. 'టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి.. ఎలెక్షన్స్ ఉండేది ఇంకో పది రోజులే.. దాని తర్వాత.. మీరు మా ఇంటికి రావాలి.. మేము మీ ఇంటికి రావాలి.. ఒకళ్లనొకళ్లు ముఖాలు చూసుకోవాలి... 

ఎలక్షన్స్‌లో మీరూ విమర్శించొచ్చు.. మేము మిమల్ని విమర్శించొచ్చు, కానీ డీసెన్సీ ఉండాలి. అన్నిటికి ఒక హద్దు ఉంటుంది. నెల రోజుల ముందు తిరుపతికి వచ్చి మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చిపోకండి' అంటూ ట్వీట్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement