
సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హడావిడి చేశారు. నిబంధలనకు విరుద్ధంగా సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం బుద్ధా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు పబ్లిసిటీ సెల్ లో ప్రెస్ మీట్‌లకు అనుమతి లేదని ఐ అండ్ పీఆర్ అధికారులు తెలిపారు.
కేవలం మంత్రులు మాత్రమే మీడియా సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఉందన్నారు. కానీ అలాంటి నిబంధనలేవి పట్టించుకోని ఆయన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడంపై మీడియా ప్రతినిధులు బుద్ధా వెంకన్నను ప్రశ్నించారు. దానిపై స్పందించిన ఆయన సచివాలయం.. కమిషనర్ దా అంటూ.. ప్రెస్ మీట్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment