
సాక్షి, విజయవాడ : ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు తీవ్రంగా ఖండించారు. బుద్ధిలేని బుద్ధా వెంకన్న నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపితే.. కోడిగుడ్లతో కొట్టిస్తామంటారా? అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు దుష్ట పరిపాలనలో మహిళలు, చిన్నారులు నలిగిపోతున్నారని అన్నారు.
ప్రజల పక్షాన తాము నిలబడితే.. ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. విదేశీ మహిళలతో లోకేశ్ అసభ్య ఫొటోలు ఉన్నాయని, ఇంట్లో పనివాళ్లతో అసభ్యంగా ప్రవర్తించినట్టు అభియోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేనిపైనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు.