
సాక్షి, విజయవాడ: బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పుట్టిన రోజు పూట కేక్ కట్ చేసుకోకుండా బుద్ధి లేకుండా బుద్దా వెంకన్న మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వంద మందితో సూసైడ్ స్క్వాడ్ తయారు చేసుకున్నానని ఎలా మాట్లాడతారని దుయ్యబట్టారు.
ఎన్టీఆర్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు.. చంద్రబాబుని కూడా ఆ పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. చంద్రబాబుని ప్రజలే మరిచిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రతిపక్షనేతగా కూడా పనికిరాడని ప్రజలు భావిస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమపాలన అందిస్తున్నారని తెలిపారు. అమ్మ ఒడి, ఆసరా లాంటి అన్నిపధకాలు ప్రజలకి అందుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment