viajayawada
-
నేడు ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై మండలి చైర్మన్ విచారణ
సాక్షి, గుంటూరు: ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై నేడు(మంగళవారం) శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు విచారణ జరపనున్నారు. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలను విచారణకు రావాలని ఇప్పటికే మండలి చైర్మన్ నోటీసులు ఇచ్చారు. ఇవాళే తుది విచారణ అని మండలి చైర్మన్ పేర్కొన్నారు. తుది విచారణ కావడంతో ఎమ్మెల్సీలు ఏం చెబుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఫిరాయించిన వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ.. మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది: ఎంపీ కేశినేని నాని
సాక్షి, విజయవాడ: కాల్ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. కేశినేని చిన్ని వ్యాఖ్యలపై.. ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడుతానని అన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని, గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని తెలిపారు. ఇక.. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని, నాయకుల పాత్ర తక్కువ ప్రజల పాత్ర ఎక్కువ అని తెలిపారు. రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశం తర్వాతే వైఎస్సార్సీపీలో చేరాలని అనుకున్నానని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ పిలుపుతో వెంటనే వైఎస్సార్సీపీలో చేరినట్లు వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని అన్నారు. రాజకీయాల్లో తన స్థాయి చంద్రబాబు స్థాయి ఒక్కటేనని.. స్థాయిలో లోకేష్.. తన కంటే చాలా తక్కువని అన్నారు. కాల్ మనీ కార్యకలాపాలకు పాల్పడేవాళ్ల మాటలకు తాను సమాధానం చెప్పనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నానిలో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. చదవండి: అంబేద్కర్‌ను పచ్చ మీడియా అవమానించింది: ఆర్కే. రోజా -
టీడీపీలో దుమారం రేపిన కేశినేని నాని వ్యాఖ్యలు
విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో మరోసారి దుమారం రేపాయి. తన సోదరుడు చిన్నాతో పాటు బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను ఆయన పరోక్షంగా టార్గెట్ చేశారు. ఓ వైపు తనతో పాటు తన వర్గాన్ని ప్రమోట్ చేసుకుంటూ సొంత పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ నియోజవర్గంలో తన కుమార్తె శ్వేత పోటీ చేయడం లేదని చెప్పారు. కొన్ని కబంధ హస్తాల నుంచి పశ్చిమ నియోజకవర్గానికి విముక్తి చేయడానికే తాను ఇంఛార్జ్‌గా వచ్చానని తెలిపారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారిని తాను సహించనని కేశినేని నాని హెచ్చరించారు. మేం ఏలుకుంటాం.. దోచుకుంటాం అంటే ఊరుకునేది లేదన్నారు. తాను ఎవరి చీకటి వ్యాపారాల్లో వాటాదారుడిని కాదని అన్నారు. అందుకే వాళ్లతో తనకు పడదని చెప్పారు. తాను వెళ్లిపోతే విజయవాడ నుంచి జగ్గయ్యపేట వరకు దోచుకోవచ్చనేదే వారి అజెండా అని తీవ్రంగా విమర్శించారు. తాను తినను.. ఎవ్వరీని తిననివ్వను.. అనేదే వాళ్ల బాధని పరోక్షంగా విమర్శలు చేశారు. కేశినేని నాని అనే వ్యక్తి ఎంపీగా లేకపోతేనే వాళ్లకు సంతోషమని అన్నారు. చదవండి: Tuni TDP Clashes: తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ -
ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై 18 వరకు నిర్ణయం వాయిదా - ఏసీబీ కోర్టు
విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ 18కి వాయిదా పడింది. ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై ఎప్పుడు కోర్టు ముందు హాజరుపరచాలో 18 తర్వాత నిర్ణయిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. కావున సోమవారం కోర్టుకి హాజరుపరచాల్సిన అవసరం లేదు. విచారణ సందర్బంగా చంద్రబాబుని 18 వరకు కస్టడీకి తీసుకోకూడదని సీఐడీని ఆదేశించింది. అంతే కాకుండా ఆ లోపల కోర్టు ముందు హాజరుపరచవద్దని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పు ఆధారంగా 18 తర్వాతే చంద్రబాబు పిటి వారెంట్‌పై నిర్ణయం తీసుకోనుంది. -
మంత్రిగా ఏడాది పూర్తి.. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు: ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్నట్లు రోజా తెలిపారు. ఈ ఏడాది కాలంలో ప్రతిష్టాత్మక పర్యటనలు, సదస్సులు జరిగాయన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ. శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఏడాదిగా తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సంస్కృతిని ప్రజలకు గుర్తు చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి రోజా తెలిపారు. ఏపీ టూరిజం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అందున్నట్లు పేర్కొన్నారు. యువతకు ఉపాధి దిశగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. విజయవాడలో బెర్మపార్క్‌లో పర్యాటక అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంలో పర్యాటక శాఖలో జరిగిన అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర క్రీడాకారులకు ఎన్నో రకాల ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. చదవండి: ‘చైతన్య రథం ఎడిటర్ ఎవరు?’ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. నోటీసులు ఒక కళాకారిణిగా తోటి కళాకారులకు తనవంతు సాయంగా జగనన్న సాంస్కృతిక సంబరాలు నిర్వహించామని రోజా పేర్కొన్నారు. టూరిజం విభాగంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఎంవోయూలు..గ్రౌండ్ లెవల్లో కార్యచరణ దిశగా ఉన్నాయన్నారు. ఒబెరాయ్ హోటల్స్‌కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి రోజా తెలిపారు. తిరుపతి టెంపుల్ టూరిజంతోపాటు విశాఖలో నేచురల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. త్వరలో 50 ప్రాంతాల్లో నూతనంగా బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టెంపుల్ టూరిజంలో ఏపీ దేశంలోనే మూడవస్థానంలో ఉందన్నారు. టూరిజంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని ఉన్నపళంగా ఏపీకి రావడం వల్ల అనేక సదుపాయాలు కోల్పోయామని విమర్శించారు. చంద్రబాబు వల్ల ఎంతో మంది కళాకారులు ఇబ్బంది పడ్డారని మండిపడ్డారు. -
మద్యంపై వ్యాట్‌ను క్రమబద్ధీకరించిన ఏపీ సర్కార్
సాక్షి, విజయవాడ: మద్యంపై వ్యాట్‌ను ఏపీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వ్యాట్‌తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సవరిస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గనుంది. మొత్తంగా బీర్లపై 20 నుంచి 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. ఐఎంఎల్ లిక్కర్‌పై వ్యాట్ 35 నుంచి 50 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గనుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యం అడ్డుకట్ట వేసేందుకు వ్యాట్ క్రమబద్దీకరించినట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ తెలిపారు. చదవండి: వికేంద్రీకరణకు మద్దతుగా ‘చైతన్యయాత్ర’ -
మార్చి 7, 8న ఘనంగా లేపాక్షి ఉత్సవాలు
సాక్షి, విజయవాడ: రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింపజేసేలా లేపాక్షి సంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. బుధవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పర్యాటక శాఖ ఏండీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... మార్చి 7, 8న ఏపీ పర్యాటక శాక అధ్వర్యంలో అనంతపురంలో జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి లేపాక్షి ఉత్సావాలను వైభవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌తో ఉత్సవాలు జరుగుతాయని, ఈ ఏడాది సంస్కృతిని థీమ్‌గా తీసుకున్నామన్నారు. కాగా ఈ ఉత్సవం నిర్వహణకు 15 కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. బాహ్య ప్రపంచానికి తెలియజేప్పెలా ఈ ఉత్సవాల నిర్వహణ ఉంటుందని, 2018లో లక్షకు పైగా ప్రజలు వచ్చారన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ పర్యటకలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన అంచన వేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలలో లేజర్ షో, ప్రముఖ గాయకులతో పాటలు, శోభాయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా పర్యాటకులకు ఒక మంచి అనుభూతిని అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాయలసీమ వైభవాన్ని తెలిపేలా.. గ్రామీణ పర్యటకాన్ని కూడా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అంతేగాక రాయలసీమ ప్రత్యేక వంటకాలను సైతం ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఉగ్గాని, రాగి సంగటి, నాటుకోడి కూర, గుత్తి వంకాయ వంటి ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో రాయలసీమ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఇక రాయలసీమ జీవన శైలిని ఉట్టిపడేలా దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా అత్యంత వైభవంగా నిర్వహించే ఈ లేపాక్షి వైభవములో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నేను, నాది కాదు.. మనం, మనది! ఇక పర్యటక శాక ఏండీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమలోను మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటి ద్వారా ఇతర ప్రాంతాల వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ పర్యాటక ప్రాంతాలను గుర్తిస్తూ వస్తున్నామన్నారు. పర్యాటక రంగం మంచి ఆదాయ వనరని, దీని ద్వారా కేరళ మంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటోoదన్నారు. ఈ రంగం ద్వారా స్థానికంగా ఉపాధి కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కాగా కరోనా వార్తల నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
టీడీపీ గ్యాంగ్‌కు ‘పచ్చ’మీడియా తోడైంది..
-
‘పంచ భూతాలను మింగేశారు’
సాక్షి, విజయవాడ: గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు బయటపడుతుండటంతో టీడీపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని భ్రమరావతిని చేసిన చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ చేయమని టీడీపీ సవాళ్లు విసిరింది. అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు సిట్ వేస్తే కక్ష అంటున్నారు. టీడీపీ నేతలవి నరం లేని నాలుకలు’ అని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాం ల గురించి రాష్ట్రపతికి ఇచ్చిన పుస్తకంలో ఎప్పుడో పొందుపరిచామని పేర్కొన్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే ఇష్టానుసారం దోచేశారని ధ్వజమెత్తారు.(‘ప్రతిపక్షంలో కూడా అదే పనిచేస్తున్నారు’) ఐదేళ్లలో పంచ భూతాలను కూడా దిగమింగిన టీడీపీ నేతలు.. ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకొనే సైంధవుల్లా మారారని ఎమ్మెల్యే విష్ణు నిప్పులు చెరిగారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత ఎంపీపై దాడికి పాల్పడటం టీడీపీ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. ఈఎస్ఐలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన అచ్చెన్నాయుడు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ గ్యాంగ్‌కు పచ్చ మీడియా తోడైందన్నారు. టీడీపీ అవినీతిని వెలికితీసి దోషులను కఠినంగా శిక్షిస్తామని మల్లాది విష్ణు తెలిపారు. -
రాజధాని అభివృద్ధి వికేంద్రికరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాద్యం
-
వెల్లంపల్లి కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ
-
మహాలక్ష్మమ్మకు నివాళి అర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఆయన తల్లి మహాలక్ష్మమ్మ అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఉదయం మంత్రి వెలంపల్లి నివాసానికి వెళ్లి మహాలక్ష్మమ్మ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అలాగే మంత్రి ధర్మాన కృష్ణదాస్, పార్టీ ఎమ్మెల్యే పార్థసారధి, లేళ్ల అప్పిరెడ్డి నివాళులు అర్పించి, వెలంపల్లిని పరామర్శించారు. మహాలక్ష్మమ్మ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. -
‘సీఎంను ప్రశ్నించినందుకు చంటిబిడ్డ తల్లిని’..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించినందుకు చంటిబిడ్డ తల్లిని జైల్లో బంధించారని, అంతు చూస్తా, ఫినిష్ అయిపోతారు అనే మాటలు వాడి చంద్రబాబు మరో చింతమనేని, జేసీ, బుద్దా వెంకన్న, రాజేంద్రప్రసాద్ స్థాయికి దిగజారారని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ నేతలను సీఎం బెదిరించిన 24 గంటల్లోనే.. కన్నా ఇంటిమీద దాడి జరిగిందని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రౌడీ రాజకీయాలు చేసేవారు కాల గర్భంలో కలిసిపోతారని అన్నారు. దాడి చేసిన గూండాలను అరెస్ట్ చేస్తూ.. బీజేపీ నాయకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసుల మీద దాడి చేసి, హత్యాయత్నం చేసిన జేసీ అనుచరులను ఆదర్శంగా తీసుకున్నారా.. ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరిగితే.. మీ కుటుంబ సభ్యులే! అన్న రాజేంద్రప్రసాద్ మీకు ఆదర్శమా.. ప్రధాని నరేంద్రమోదీని లోఫర్ అన్న నక్కా ఆనంద బాబు మీకు ఆదర్శమా అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్సీ ప్రకటన చేసిన 24 గంటల లోపే కన్నా మీద దాడి జరిగిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుని మీద పోలీసుల సహకారంతో టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ గుంటూరులో సాధారణ మైనారిటీలను కూడా.. ప్రశ్నించినందుకు చిత్ర హింసలు పెట్టలేదా. 40 ఏళ్ల అనుభవం ఇదేనా మీది. నాయీ బ్రాహ్మణులు ఆదుకోమని వస్తే బెదిరించారు. కేసీఆర్ మాట్లాడితే సైలెంట్‌గా నటిస్తున్నారు అంటే.. ఓటుకు నోటు కేసులో మీరు దొంగ అని తెలిపోయింది. చంద్రబాబు రైతు ద్రోహిగా మిగిలిపోతాడు. జగన్ మీద హత్యాయత్నం జరిగితే ఎయిర్‌పోర్టు మాది కాదు కేంద్రం చేతిలో ఉంది అన్నాడు. ఇప్పుడు ఎన్ఐఏకి కోర్టు ఇస్తే.. టీడీపీ నాయకులు భయపడి పోతున్నారు. అగ్రిగోల్డ్ కేసు కూడా సీబీఐకి ఇస్తారు అనగానే ఎందుకు భయపడుతున్నారు. అయేషా మీరా కేసు సీబీఐకి కోర్టు ఇచ్చింది. భూముల కుంభకోణంపై హైకోర్టు పిల్ స్వీకరించిందంటే.. తన కేసులు విచారణకు రాకుండా ఉండటానికి కోర్టు అమరావతికి రావొద్దు అన్నారు. చంద్రబాబు దోచుకుని, దాచుకుంటే.. ప్రజలు రక్షణ ఉండాలా. 2014లో బీజేపీతో కలిసే అధికారంలోకి వచ్చారు. 90 రోజుల్లో అధికారం పోతుంది కాబట్టి మీ దోపిడీ బయటకు వస్తుందని మీ భయం. అమిత్‌షా, మోదీ వస్తున్నారంటే.. శాంతి భద్రతలు సరిగా లేవని దొంగ నివేదిక ఇచ్చారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉంది. జనవరి 18న అమిత్‌షా రాయలసీమ వస్తున్నారు.. ఆపండి చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో సింగపూర్ తరహా జైలు కట్టుకోండి. 90 రోజుల తర్వాత మీ అడ్రస్ అక్కడే ఉంటుంద’’ని ఎద్దేవా చేశారు. -
వైఎస్ఆర్సీపీలోకి విజయవాడ మైనారిటీ సెల్ అధ్యక్షుడు
-
ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల అవస్థలు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలేజ్ హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క కరెంటు లేక, మరోపక్క తాగడానికి నీళ్లు లేక అష్టకష్టాలు పడుతున్నారు. సమస్యలపై అధికారులకు తెలియజేసినా ఫలితం లేదని విద్యార్థులు తెలిపారు. దీంతో వారు నిరసనకు దిగారు. కాగా, అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అర్ధరాత్రి పూజలు
-
బుజ్జి మిస్సింగ్ కేసు.. వీడని మిస్టరీ!
సాక్షి, విజయవాడ: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుజ్జి అనే బాలిక మరణం మిస్టరీగా మారింది. వన్‌టౌన్‌లోని ఓ వస్త్ర దుకాణంలో బుజ్జి పనిచేస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీన బుజ్జి అదృశ్యం కాగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వంశీ అనే యువకుడిపై ఆ ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. 45 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు ఆ తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే కొద్ది రోజుల క్రితం బుజ్జి మృతదేహం కృష్ణానదిలో దొరికిందని, అనాథ శవంగా భావించి తామే అంత్యక్రియలు నిర్వహించామని పోలీసులు వారికి చెప్పారు. తమ కూతుర్ని అప్పగించమంటే మృతదేహం ఫొటోలు చేతిలో పెట్టారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ కేసు పెడితే అనాథ శవంగా అంత్యక్రియలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ కూతుర్ని వంశీయే హత్య చేసి కృష్ణా నదిలో పడేశాడని వారు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని వైర్లతో కట్టేసినట్టు ఫొటోల్లో స్పష్టంగా ఉందని చెబుతున్నారు. -
సాయిశ్రీ మృతిపై హెచ్చార్సీలో ఫిర్యాదు
విజయవాడ: సాయిశ్రీ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సాయిశ్రీ మృతికి కారుకులైన బాలిక తండ్రితో పాటు ఎమ్మెల్యే బోండా ఉమలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ.. బాలల హక్కుల సంఘం అధికారులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన హెచ్చార్సీ జులై 20 కల్లా పూర్తి నివేదిక అందివ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. -
చైనా స్కెచ్
విజయవాడ సెంట్రల్ : రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్తో విజయవాడ నగర రూపురేఖలను మార్చేస్తామని చెబుతున్న పాలకులు, అధికారులు.. పేద, మధ్య తరగతి వర్గాల ఉపాధికి గండి కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరాన్ని గ్రీన్, బ్లూ సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయించిన సర్కార్ చైనాకు చెందిన గుచ్చియో ఇంటర్నేషనల్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (జీఐసీసీ) సంస్థకు డిజైన్ బాధ్యతలు అప్పగించింది. నగరపాలక సంస్థ, అర్బన్గ్రీన్ సంస్థ అధికారులు, జీఐసీసీ ప్రతినిధులు సంయుక్తంగా మార్చి నెల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. కృష్ణానది పరివాహక ప్రదేశాలు, రైవస్, ఏలూరు, బందరు కాల్వలు, బుడమేరు కాల్వగట్ల ప్రాంతాలు, గులాబీ తోట, మధురానగర్, అల్లూరి సీతారామరాజు వంతెన, సాంబమూర్తిరోడ్డు, అలంకార్ సెంటర్ వరకు కాల్వగట్లను పరిశీలించారు. ఆయాప్రాంతాల స్థితిగతులు, వాస్తవ నైతిక స్వరూపం, కనకదుర్గ ఫ్లైఓవర్‌కు సంబంధించిన మ్యాప్, నగర భౌగోళిక మ్యాప్‌లను చైనా బృందానికి అధికారులు అప్పగించారు. ఆ తరువాత జీఐసీసీ బృందం డిజైన్‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే పుష్కరాల వంకపెట్టి ఒక్కొక్కటీ తొలగిస్తున్నారని భోగట్టా. కార్పొరేషన్ ఒక్కటే ... నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ ఉన్న కట్టడాల తొలగింపు కార్యక్రమం ముమ్మరమైంది. తొలుత గాంధీ విగ్రహాన్ని, సీతమ్మవారి పాదాలు, ఆలయాలను తొలగిచారు. తాజాగా పోలీస్‌క్వార్టర్స్‌ను కూల్చేశారు. రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ పూల, కూరగాయల మార్కెట్ తరలింపునకు రంగం సిద్ధం చేశారు. నెలాఖరునాటికి మార్కెట్‌ను నేలమట్టం చేయాలన్నది అధికారుల ఆలోచన. చుట్టూ ఉన్న కట్టడాల తొలగింపు పోను ఒక్క కార్పొరేషన్ కార్యాలయం మాత్రమే మిగలనుంది. కట్టడాలు తొలగించిన ప్రాంతాన్ని రెస్టారెంట్లు, ఎమ్యూజ్మెంట్తో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి దండిగా ఆదాయం రాబట్టలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా తెలుస్తోంది. హోల్‌సేల్ మార్కెట్ తరలింపు వల్ల సుమారు ఐదువేల మంది వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడతారని మొరపెట్టుకున్న ప్రభుత్వ పెద్దలు పట్టించుకున్న దాఖలాలు లేవు. పూలింగ్ అస్త్రంప్రై ప్రకాశం బ్యారేజ్ నుంచి భవానీఘాట్ వరకు బ్లూ, గ్రీన్‌సిటీగా అ«భివృద్ధికి డిజైన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరకట్ట ప్రాంతంలోని 1,500 ఇళ్ళను ఇప్పటికే తొలగించారు. పున్నమిఘాట్ నుంచి స్వాతి థియేటర్ రోడ్డు చర్చి వరకు ఉన్న సుమారు 25 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు. రెండు విడతలుగా స్థల యజమానులతో కమిషనర్ జి.వీరపాండియన్ చర్చలు జరిపారు. 60 : 40 నిష్పత్తిలో స్థలాన్ని అభివృద్ధి చేసి కేటాయిస్తామనే ప్రతిపాదన చేశారు. ఇందుకు స్థల యజమానులు అంగీకరించలేదు. 60 శాతం తమకు కేటాయిస్తే సమ్మతమేనని చెప్పారు. చర్చలకు తాత్కాలిక బ్రేక్‌పడింది. పుష్కరాల అనంతరం పూలింగ్ అస్త్రాన్ని సంధించి స్థలాలను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ప్రైవేటు స్థలాల్లో సర్వే పూర్తి చేశారు. -
నవయుగ కవితా చక్రవర్తి జాషువా
విజయవాడ కల్చరల్ : నవయుగ కవితా చక్రవర్తి జాషువాఅని వక్తలు అభిప్రాయపడ్డారు. రసభారతి సాహితీ సంస్థ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ సంస్థల సంయుక్తంగా జాషువా 45వ వర్థంతి సభలను శనివారం శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిం చాయి. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ళ నారాయణరావు మాట్లాడుతూ జాషువా తన సాహిత్యం ద్వారా వేలమంది యువకవులను ప్రభావితం చేశాడన్నారు. జాషువా పిరదౌసీ కావ్యంపై డాక్టర్ జంధ్యాల పరదేశిబాబు, జాషువా కవితా వైభవం పై డాక్టర్ జంధ్యాల మహతీ శంకర్, ఆయన సాహిత్యంలో మానతా విలువలపై డాక్టర్ గుమ్మా సాంబశివరావు, జాషువా భావుకతపై పింగళి వెంకటకృష్ణారావులు ప్రసంగించారు. కార్యక్రమంలో రసభారతి సాహితీ సంస్థ అధ్యక్షుడు పి.లక్ష్మణరావు, కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి జి.వి.పూర్ణచంద్ పాల్గొన్నారు. అనంతరం కవి పండితులను జ్యోతిష్యశాస్త్రవేత్త రామన్, వ్యాపార వేత్త చెట్టపల్లి మారుతీ ప్రసన్నలు సత్కరించారు.