
సాక్షి, విజయవాడ: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆయన తల్లి మహాలక్ష్మమ్మ అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఉదయం మంత్రి వెలంపల్లి నివాసానికి వెళ్లి మహాలక్ష్మమ్మ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అలాగే మంత్రి ధర్మాన కృష్ణదాస్, పార్టీ ఎమ్మెల్యే పార్థసారధి, లేళ్ల అప్పిరెడ్డి నివాళులు అర్పించి, వెలంపల్లిని పరామర్శించారు. మహాలక్ష్మమ్మ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment