సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. నా కంటికి కూడా దెబ్బ తగలడంతో విపరీతంగా నొప్పి వచ్చిందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సీఎం జగన్‌పై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనే అని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు.
కాగా, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు తగిలిన వెంటనే నాకు కూడా గాయమైంది. ఆ ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదు. నాకు కనుగుడ్డుపై ర్యాష్ అయ్యింది. ఇప్పుడు కూడా కంటి నొప్పి ఉంది. సీఎం జగన్ తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు, ఎన్నికల కమిషన్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టాలి.
చంద్రబాబు నీచమైన రాజకీయం చేస్తున్నాడు. గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు చంపించాడు. సీఎం జగన్‌పైన ఈరోజు ఇలా కుట్ర చేశారు. సిగ్గులేకుండా లోకేష్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎన్నికల కోసం డ్రామాలాడే అలవాటు చంద్రబాబుదే. టీడీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. సీఎం జగన్‌పై దాడిని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారమే సీఎం జగన్‌పై దాడి జరిగింది. దాడి చేసిన వెంటనే బాబు మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. సీఎం జగన్‌పై దాడిని కూడా డ్రామా అనడం చంద్రబాబు నైజం. విచారణ వేగంగా జరుగుతుంది.. వాస్తవాలు బయటకి వస్తాయి. ఈ దాడి ఘటనపై ఎన్నికల కమిషన్ వెంటనే దర్యాప్తు చేయాలన్నారు.
మరోవైపు, సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే రోజా నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్నకు వస్తున్న ఆదరణ చూడలేకే చంద్రబాబు దాడులు చేయించారు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి. పవన్ కల్యాణ్ కుట్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక, ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు సరికాదు. తన గెలుపు కోసం ఎదుటి వ్యక్తిని చంపాలనుకోవడం సిగ్గుచేటు. ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారు అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment