
సాక్షి, విజయవాడ: గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు బయటపడుతుండటంతో టీడీపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని భ్రమరావతిని చేసిన చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ చేయమని టీడీపీ సవాళ్లు విసిరింది. అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు సిట్ వేస్తే కక్ష అంటున్నారు. టీడీపీ నేతలవి నరం లేని నాలుకలు’ అని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాం ల గురించి రాష్ట్రపతికి ఇచ్చిన పుస్తకంలో ఎప్పుడో పొందుపరిచామని పేర్కొన్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే ఇష్టానుసారం దోచేశారని ధ్వజమెత్తారు.(‘ప్రతిపక్షంలో కూడా అదే పనిచేస్తున్నారు’)
ఐదేళ్లలో పంచ భూతాలను కూడా దిగమింగిన టీడీపీ నేతలు.. ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకొనే సైంధవుల్లా మారారని ఎమ్మెల్యే విష్ణు నిప్పులు చెరిగారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత ఎంపీపై దాడికి పాల్పడటం టీడీపీ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. ఈఎస్‌ఐలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన అచ్చెన్నాయుడు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ గ్యాంగ్‌కు పచ్చ మీడియా తోడైందన్నారు. టీడీపీ అవినీతిని వెలికితీసి దోషులను కఠినంగా శిక్షిస్తామని మల్లాది విష్ణు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment