సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవడం దారుణమన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలోని సింగ్ నగర్‌లో పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘రాజ్యాంగం ప్రతీ పౌరుడికి భద్రత, హక్కులు, స్వేచ్ఛ కల్పించింది. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటోంది.
కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తోంది. సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవటం దారుణం. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందుంది. ఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైన పరిపాలన జరుగుతోంది. ప్రజల హక్కులు హరించబడుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది. రాజ్యాంగం అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు ఎందుకు నివాళులర్పించలేదు?. ప్రభుత్వం, అధికారులు వివక్షత చూపిస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: AP: సోషల్ మీడియా కార్యకర్తలపై పెరిగిన వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment