
సాక్షి, విజయవాడ: మద్యంపై వ్యాట్‌ను ఏపీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వ్యాట్‌తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సవరిస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గనుంది. మొత్తంగా బీర్లపై 20 నుంచి 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది.
ఐఎంఎల్ లిక్కర్‌పై వ్యాట్ 35 నుంచి 50 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గనుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యం అడ్డుకట్ట వేసేందుకు వ్యాట్ క్రమబద్దీకరించినట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ తెలిపారు.
చదవండి: వికేంద్రీకరణకు మద్దతుగా ‘చైతన్యయాత్ర’