Value added tax (VAT)
-
పెట్రోల్, డీజిల్‌పై ‘వ్యాట్’ తగ్గింపు
న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు తమ వంతుగా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించి, వినియోగదారులకు మరింత ఊరట కలిగించాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, కేరళ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 చొప్పున వ్యాట్‌లో కోత విధించింది. దీనివల్ల తమ ఖజానాపై ఏటా రూ.2,500 కోట్ల భారం పడుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. కేరళలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై 1.36 చొప్పున వ్యాట్ తగ్గించింది. తాము లీటర్ పెట్రోల్‌పై రూ.2.48, డీజిల్‌పై రూ.1.16 చొప్పున తగ్గిస్తామని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు. పెట్రో పన్ను తగ్గింపును పరిశీలిస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై చెప్పారు. పన్నులు పెంచినప్పుడు సంప్రదించారా?: తమిళనాడు ఆర్థిక మంత్రి పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు విషయంలో కేంద్రం పక్షపాతం ప్రదర్శించిందని తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఆదివారం విమర్శించారు. రాష్ట్రాలు సైతం పన్ను తగ్గించాలని కేంద్రం కోరడం సమంజసం కాదని చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై పన్నులు పెంచినప్పుడు కేంద్రం ఏనాడూ రాష్ట్రాలను సంప్రదించలేదని తప్పుపట్టారు. 2021 నవంబర్‌లో కేంద్రం ప్రకటించిన పన్ను కోత వల్ల తమిళనాడు ఇప్పటికే రూ.1,000 కోట్లకుపైగా నష్టపోయిందన్నారు. కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా పెట్రో ధరలు 2014 నాటి కంటే అధికంగానే ఉన్నాయని ఆక్షేపించారు. 72 గంటల్లోగా పెట్రోల్, డీజిల్‌పై తమిళనాడు సర్కారు పన్ను తగ్గించాలంటూ రాష్ట్ర బీజేపీ అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్రాలకు పన్ను నష్టం జరగదు: నిర్మల పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వల్ల కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్ను వాటాలో కోత పడుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో భాగమైన రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్సును మాత్రమే తగ్గించినట్లు తెలిపారు. ఈ సెస్సును రాష్ట్రాలతో కేంద్రం పంచుకోవడం లేదని ట్విట్టర్లో స్పష్టం చేశారు. కాబట్టి రాష్ట్రాలకు రావాల్సిన పన్ను వాటాలో ఎలాంటి కోత ఉండదని తేల్చిచెప్పారు. భారత్ భేష్: ఇమ్రాన్ ఖాన్ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్లో ప్రశంసించారు. దక్షిణాసియా ఇండెక్స్ రిపోర్టును ట్వీట్‌కు జతచేశారు. భారత ప్రభుత్వం రష్యా నుంచి తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండడం, దేశీయంగా వినియోగదారుల కోసం ధర తగ్గించడం మంచి పరిణామం అని తెలిపారు. అమెరికా నుంచి ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ రష్యా చమురు విషయంలో భారత్ వెనక్కి తగ్గడం లేదని పేర్కొన్నారు. స్వతంత్ర విదేశాంగ విధానంతో తమ హయాంలోనూ ఇలాంటి ఘనత సాధించేందుకు ప్రయత్నించామని అన్నారు. -
మద్యంపై వ్యాట్‌ను క్రమబద్ధీకరించిన ఏపీ సర్కార్
సాక్షి, విజయవాడ: మద్యంపై వ్యాట్‌ను ఏపీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వ్యాట్‌తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సవరిస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గనుంది. మొత్తంగా బీర్లపై 20 నుంచి 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. ఐఎంఎల్ లిక్కర్‌పై వ్యాట్ 35 నుంచి 50 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గనుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యం అడ్డుకట్ట వేసేందుకు వ్యాట్ క్రమబద్దీకరించినట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ తెలిపారు. చదవండి: వికేంద్రీకరణకు మద్దతుగా ‘చైతన్యయాత్ర’ -
2015–18 స్థాయికి పెట్రో ధరల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 2015–18 స్థాయికి సవరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్‌పై రూ.1.24, డీజిల్‌పై 93 పైసల చొప్పున వ్యాట్‌ను పెంచింది. పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు అదనంగా రూ.4, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా రూ.4 సుంకం విధించింది. కోవిడ్ కారణంగా ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ► లాక్డౌన్ వల్ల ఆదాయాలు భారీగా పడిపోవడంతో చాలా రాష్ట్రాలు పన్నులు పెంచాయి. అదే బాటలో ఇక్కడ కూడా ధరలు సవరించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు పన్ను రేట్లు పెంచాయి. ► లాక్డౌన్ వల్ల ఏప్రిల్‌లో రాష్ట్రానికి రూ.4,480 కోట్ల సొంత ఆదాయం రావాల్సి ఉండగా.. కేవలం రూ.1,323 కోట్లు మాత్రమే వచ్చింది. ఇదే పరిస్థితి మే, జూన్ నెలల్లోనూ కొనసాగింది. ► ఆదాయం తగ్గినా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వైద్యం, సంక్షేమం పథకాల పరంగా పెద్దఎత్తున నిధులను వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్దఎత్తున ప్రశంసలు వచ్చాయి. ► ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో 2015–18 స్థాయికి దాటకుండా పెట్రోల్, డీజిల్‌పై పన్ను రేట్లు సవరించినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సవరించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. -
వ్యాట్ కే పోటు
చక్రం తిప్పుతున్న రిటైర్డ్ అధికారి వరంగల్ బిజినెస్ : విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చట్టంలోని లొసుగులు, వ్యాపారుల ధనదాహం, వాణిజ్య శాఖ అధికారుల అవినీతి వెరసి.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. జిల్లాలోని వ్యాపార సంస్థలు ప్రతి వస్తువుపై ప్రజల నుంచి ముక్కుపిండి మరీ పన్ను వసూలు చేస్తున్నప్పటికీ... అవి ప్రభుత్వ ఖజానాకు చేరడం లేదు. మామూళ్ల మత్తులో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వ్యాపారులు తప్పుడు లెక్కలతో పన్ను మినహారుుంపు పొందుతున్నారు. వ్యాట్ ద్వారా ఏటా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. చట్టంలోని సెక్షన్ 16(3-ఎఫ్) ప్రకారం వ్యాపారులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్మితే... మొదట చెల్లించిన పన్నును తిరిగిపొందే అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సిమెంట్,ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్, మందులు, కన్జ్యూమర్ వస్తువులు, కంప్యూటర్, ఇనుము, యంత్రములు, సౌందర్య వస్తువుల వంటి వ్యాపారాలను నిర్వహిస్తున్న బడా వ్యాపారులు తక్కువ ధరకు విక్రయించినట్లు లెక్కలు చూపి ఆదాయం మిగుల్చుకుంటున్నారు. అరుుతే... ప్రభుత్వ ఖజానాను భర్తీ చేసే వాటిల్లో వాణిజ్య పన్నుల శాఖది కీలకపాత్ర. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, వ్యాపారులు సక్రమంగా పన్ను కట్టేలా చూడాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులపై ఉంది. కానీ.. వారు ఏమీపట్టనట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. చక్రం తిప్పుతున్న రిటైర్డ్ అధికారి జిల్లాలో వ్యాట్ చెల్లింపుల్లో అక్రమాలకు సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పనిచేసి కొన్నాళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందిన ఓ అధికారి దందా నడిపిస్తున్నట్లు సమాచారం. వ్యాపారులకు మేలు చేయడంతోపాటు అధికారులు, సిబ్బంది జేబులు నింపి.. తానూ లాభపడుతున్నాడు. తప్పుడు లెక్కలతో పన్ను మినహారుుంపు పొందుతున్న వ్యాపారుల నుంచి డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి ద్వారా అతడు ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తుంటాడు. వచ్చిన సొమ్మును వాటాల వారీగా పంచుకుంటున్నారు. ఈ దందాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరు ఉద్యోగులపై ఉన్నతాధికారులు కక్షసాధింపు చర్యలకు దిగినట్లు ఆ శాఖ ఉద్యోగవర్గాల ద్వారా తెలిసింది. వ్యాపారులకే మేలు వరంగల్ పరిధిలోని ఫోర్ట్ రోడ్, బీట్‌బజార్, రామన్నపేట్, బట్టల బజార్, జనగాం. నర్సంపేట, మహబూబాబాద్ వ్యాపార డివిజన్లు ఉన్నారుు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ద్వారా ప్రభుత్వానికి రూ.432.61 కోట్లు సమకూరింది. 2013-2014 లో రూ.483.25 కోట్లు వసూలైంది. వాస్తవానికి ఇంకా రూ.100 కోట్ల మేర వ్యాట్ వసూలు కావాల్సి ఉంది. నిజారుుతీగా వ్యవహరించిన కొందరు అధికారులు పలు వ్యాపార సంస్థలపై పన్నులు వేశారు. అయితే దానిని అప్పీలు అధికారులు నిర్ధారించకపోవడంతో వ్యాపారులకే మేలు జరిగింది.