
సాక్షి, విజయవాడ: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుజ్జి అనే బాలిక మరణం మిస్టరీగా మారింది. వన్‌టౌన్‌లోని ఓ వస్త్ర దుకాణంలో బుజ్జి పనిచేస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీన బుజ్జి అదృశ్యం కాగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వంశీ అనే యువకుడిపై ఆ ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. 45 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు ఆ తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
అయితే కొద్ది రోజుల క్రితం బుజ్జి మృతదేహం కృష్ణానదిలో దొరికిందని, అనాథ శవంగా భావించి తామే అంత్యక్రియలు నిర్వహించామని పోలీసులు వారికి చెప్పారు. తమ కూతుర్ని అప్పగించమంటే మృతదేహం ఫొటోలు చేతిలో పెట్టారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ కేసు పెడితే అనాథ శవంగా అంత్యక్రియలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ కూతుర్ని వంశీయే హత్య చేసి కృష్ణా నదిలో పడేశాడని వారు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని వైర్లతో కట్టేసినట్టు ఫొటోల్లో స్పష్టంగా ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment