నేడు ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై మండలి చైర్మన్ విచారణ | AP Legislative Council Will Hear MLC Disqualification Petition | Sakshi
Sakshi News home page

నేడు ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై మండలి చైర్మన్ విచారణ

Published Tue, Mar 5 2024 9:22 AM | Last Updated on Tue, Mar 5 2024 12:14 PM

AP Legislative Council Will Hear MLC Disqualification Petition - Sakshi

సాక్షి, గుంటూరు: ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై నేడు(మంగళవారం) శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు విచారణ జరపనున్నారు. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలను విచారణకు రావాలని ఇప్పటికే మండలి చైర్మన్‌ నోటీసులు ఇచ్చారు. ఇవాళే తుది విచారణ అని మండలి చైర్మన్ పేర్కొన్నారు.

తుది విచారణ కావడంతో ఎమ్మెల్సీలు ఏం చెబుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఫిరాయించిన వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ.. మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement