assembly council
-
ప్రతిపక్షం లేకుండా బాబు కుట్ర..
-
నిరసనలతో దద్దరిల్లిన మండలి..
-
ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఈ ఇద్దరు వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి పార్టీ మారారు. దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్సీపీ నేత, మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆ ఇద్దరికి నోటీసులు పంపించారు. నోటీసుల ఆధారంగా వాళ్లిద్దరి నుంచి వివరణ సైతం తీసుకున్నారు మండలి చైర్మన్. ఈ క్రమంలో.. ఇప్పుడు సమగ్ర విచారణ అనంతరమే ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. -
నేడు ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై మండలి చైర్మన్ విచారణ
సాక్షి, గుంటూరు: ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై నేడు(మంగళవారం) శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు విచారణ జరపనున్నారు. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలను విచారణకు రావాలని ఇప్పటికే మండలి చైర్మన్ నోటీసులు ఇచ్చారు. ఇవాళే తుది విచారణ అని మండలి చైర్మన్ పేర్కొన్నారు. తుది విచారణ కావడంతో ఎమ్మెల్సీలు ఏం చెబుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఫిరాయించిన వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ.. మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
జైలు తప్పదా బాబూ?
తోటకూర కట్ట దొంగిలించినప్పుడే మందలించి ఉంటే బిడ్డ గజదొంగగా మారకపోవు గదా అని బాధపడిందట వెనుకటికి ఒక తల్లి. చిన్ననాటి చేతివాటాన్ని చూసి అప్పుడు ముచ్చట పడింది. పెద్దయ్యాక తొండ ముదరడంతో కంగారు పడింది. మన యెల్లో మీడియాకు మాత్రం అటువంటి కంగారేమీ లేదు. ముప్పయ్యేళ్లుగా చంద్రబాబు ప్రదర్శిస్తున్న జిత్తులమారితనానికి అది మురిసిపోతూనే ఉన్నది. బాబు వ్యూహం, బాబు ఎత్తుగడ, బాబు మంత్రాంగం వంటి పేర్లతో భజన చేసింది. ఇప్పుడు కూడా అదే వరస. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినా, పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలి పారిపోయినా యెల్లో మీడియా బాణీ మారలేదు. అమరావతి నిర్మాణం కోసం హైదరాబాద్‌ను వదిలి వచ్చాడని సర్దిచెప్పింది. అది బాబు కమిట్మెంట్గా బాకా ఊదింది. ప్రజా ధనాన్ని దోపిడీ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ‘ఈనాడు’ పత్రికాధిపతి చంద్రబాబుకు తోడుగా నిలబడ్డాడు. ఇవి రాజ కీయపరమైన ఆరోపణలు కావు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప కులు ఎన్టీ రామారావు పబ్లిగ్గా చెప్పిన మాటలు. ‘రామోజీరావు గొంతెమ్మ కోర్కెలు నేను తీర్చలేకపోయాను. అందువల్లనే ఆయన నా మీద కత్తిగట్టాడు. చంద్రబాబు నయవంచకుడు. మొదటి నుంచీ అతనివి స్వార్థపూరిత ఆలోచనలే. అదను కోసం నా దగ్గర పొంచి ఉన్నాడు. సమయం రాగానే వెన్నుపోటు పొడి చాడు’ అని రామారావు బహిరంగంగా ఆరోపించారు. ఈ అపవిత్ర కూటమి గురించి ఎన్టీ రామారావు కంటే సాధికారికంగా ఎవరు చెప్పగలరు? అపవిత్ర కూటమికి అందలం దక్కితే పవిత్ర కార్యక్రమాలు చేపడుతుందని ఆశించడం అవివేకం కాదా? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల పాలనలో వ్యతిరేక వార్తలు లేవు. అన్ని పత్రికలూ ఆస్థాన భజంత్రీలే. ఉపఎన్నికల్లో గెలుపు కోసం ఆ రోజుల్లోనే చంద్రబాబు కోట్లు గుమ్మరిస్తే, ఎన్నికలను జూదంగా మారిస్తే ‘ఆహా చంద్రబాబు చాణక్యం’ అని కీర్తించాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే,ఎంపీలను ఫిరాయింపజేస్తే, స్థానిక సంస్థల్లో మెజారిటీ లేకున్నా పీఠాలను కైవసం చేసుకుంటే చంద్రబాబు చక్రం తిప్పాడని రాసేవారు. ఇటువంటి చర్యలు తప్పులుగా, ప్రజాస్వామ్య విరుద్ధమైనవిగా యెల్లో ఫోర్త్ ఎస్టేట్‌కు కనిపించలేదు. కనుకనే బాబు చెలరేగిపోయారు. వ్యవస్థలను మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నారు. న్యాయ వ్యవస్థలో నెగ్గుకు రావడమెలాగో అభ్యాసం చేశారు. ఎన్టీ రామారావు నుంచి పార్టీని, జెండాను, బ్యాంకు ఎకౌంట్లను ‘న్యాయ’బద్ధంగా లాగేసుకున్నారు. ఆ అనుభవం అక్కరకొచ్చింది. ఎవరైనా కోర్టుల్లో కేసులు వేస్తే స్టేలు తెచ్చుకోవడంలో ప్రావీణ్యత సంపాదించారు. ఆయన అవినీతిపై పత్రికలు ఒక్క ముక్కా రాయలేదు. రెండెకరాల కుటుంబ ఆస్తితో రాజకీయ జీవితం మొదలు పెట్టిన చంద్రబాబు వేలకోట్ల ఆస్తులకు పడగెత్తారు. దేశంలోని రాజకీయ నాయకులందరిలోకి చంద్రబాబే సంపన్నుడని తెహల్కా డాట్‌కామ్ లెక్కలతో సహా ఆనాడే ప్రకటించింది. వామపక్షాలు కూడా ఈయన ఆస్తుల వివరాలతో కరపత్రాలు ప్రచురించాయి. కానీ యెల్లో మీడియా మాత్రం ఏనాడూ బాబు స్కామ్‌ల జోలికి వెళ్లలేదు. ఆయన అక్రమాస్తులపై దర్యాప్తు కోరుతూ న్యాయస్థానాల్లో పిటీషన్లు పడితే సీబీఐ వంటి దర్యాప్తు సంస్థ విచిత్రమైన సాకులు చెప్పింది. తమ దగ్గర తగినంత సిబ్బంది లేని కారణంగా బాబు అక్రమాస్తులపై దర్యాప్తు చేయ లేమని న్యాయస్థానానికే చెప్పింది. ఇదీ చంద్రబాబు నిర్వహణా ‘దక్షత’. ఈ దక్షతనే యెల్లో మీడియా నేటికీ వేనోళ్ల కొనియాడు తున్నది. ఏపీ అసెంబ్లీ నుంచి మొన్న జరిగిన కౌన్సిల్ సభ్యుల ఎన్నికలోను చంద్రబాబు చాతుర్యాన్ని యెల్లో మీడియా ప్రశంసించకుండా ఉండలేకపోయింది. 175 మంది సభ్యులున్న అసెంబ్లీ నుంచి ఈ దఫా ఏడుగురిని కౌన్సిల్‌కు ఎన్నుకోవలసి ఉన్నది. సభలో తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులుండాలి. కానీ పార్టీతో విభేదించి వేరువేరు సందర్భాల్లో నలుగురు సభ్యులు పార్టీకి దూరంగా జరిగారు. అధికారపక్షం వారు ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం వలన వారు స్వతంత్రంగా ఉంటున్నారు. టీడీపీకి 19 మంది మిగిలారు. ఒక్కరిని కౌన్సిల్‌కు గెలిపించుకోవడానికి 22 ఓట్లు కావాలి. నికరంగా 19 ఓట్లే ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపింది. తెలుగుదేశం పార్టీ తన పాత పద్ధతుల్లోనే బేరసారా లకు దిగుతుందని అప్పుడే అర్థమైంది. అందుకు అనువైన వాతావరణాన్ని కూడా వైసీపీ నాయకత్వం కల్పించింది. ప్రజా దరణ కోల్పోతున్న ఎమ్మెల్యేలనూ, గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించడంలో పలుమార్లు విఫలమైన వారినీ వైసీపీ నాయ కత్వం గుర్తించింది. వారిలో కొందరికి హెచ్చరికలు జారీ చేసింది. ఇక బాగుపడే అవకాశం లేని కేసులుగా భావించిన వారిని పిలిచి, ‘వచ్చే ఎన్నికల్లో మీకు టిక్కెట్ ఇవ్వబోవడం లేద’ని నాయకత్వం ఖరాఖండిగా చెప్పేసింది. ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ అసంతృప్తిని రెండు నెలల కిందనే వెళ్లగక్కారు. తెలుగు దేశం పార్టీతో సఖ్యతగా ఉండటం మొదలుపెట్టారు. పార్టీ కూడా వీరిని దూరం పెట్టి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నది. ఈ రెండు ఓట్లనూ వైసీపీకి లెక్కలోకి తీసుకోలేదు. ఏ అభ్యర్థికీ కేటాయించలేదు. టిక్కెట్ రాదని తెలిసి అసంతృప్తితో ఉండే చేపలను పట్టేందుకు చంద్రబాబు వలవేసి కూర్చున్నారు. ఈ రెండు చేపలూ ముందుగానే పడ్డాయి. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు వైసీపీ నాయకత్వానికీ, స్వయంగా ముఖ్యమంత్రికీ కూడా తెలుసు. అయినా సూత్రబద్ధమైన వైఖరి తీసుకోవడానికే ఆయన కట్టు బడ్డారు. ఓటింగ్ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లి శ్రీదేవి ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చారు. ఆరోజు కూడా ఆమెకు టిక్కెట్‌పై హామీ ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ సంగతి యెల్లో మీడియా హెడ్డు ‘ఈనాడే’ రాసింది. తప్పుడు హామీలిచ్చి ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవాలనుకుంటే చంద్రబాబు వలలో పడ్డ నాలుగు ఓట్లూ వైసీపీ ఖాతాలోనే ఉండేవి. కానీ ఒక సీటును గెలుచుకోవడం కంటే మాటను నిలబెట్టుకోవడం ముఖ్యమనే నిబద్ధతను ముఖ్యమంత్రి జగన్ ప్రదర్శించారు. ఇది నాయకత్వ లోపంగా, చాతుర్యం లేకపోవడంగా యెల్లో మీడియా పరిగణిస్తున్నది. వైసీపీలో టిక్కెట్ దొరకదని ఖాయంగా తేలిపోయిన నాలుగు పుచ్చు వంకాయల కొను గోలుకు 50 కోట్లు వెచ్చించడం చంద్రబాబు సమర్థతగా కనిపించింది. తెలుగునాట రాజకీయాలను ఈ స్థాయిలో భ్రష్టుపట్టించిన ఘనత మాత్రం నిస్సందేహంగా బాబు – యెల్లో మీడియా కాంబినేషన్దే! మీడియాలో ఇప్పటికీ పెద్ద సెక్షన్ బాబు వెంటనే ఉన్నది. వ్యవస్థలతో నెగ్గుకు రావడం తనకు తెలిసిన కనికట్టు విద్యే. మిగిలిన ప్రతిపక్షాలను అవసర సమయాల్లో లొంగదీసుకునే వశీకరణ మంత్రం కూడా తెలుసు. కనుక యెల్లో మీడియా దన్నుతో తాను చేసిన లక్షల కోట్ల అక్రమాలు ఎప్పటికీ నిరూ పితం కావనే ధీమా బాబులో ఉండేది. కానీ, ఆయన హిరణ్యకశిపుని కథను మరిచిపోయాడు. పగలు కానీ – రాత్రి కానీ, భూమిపై కానీ – ఆకాశంలో కానీ, ఏ ఆయుధం చేత కానీ, మనిషి చేత – జంతువు చేతకానీ తనకు మరణం సంభవించ కుండా బ్రహ్మను మెప్పించి హిరణ్యకశిపుడు వరాన్ని పొందాడు. ఆ వరభంగం కాకుండానే నారసింహావతారం ఆ రాక్షసుడిని సంహరించింది. ఎన్ని రక్షణ కుడ్యాలను నిర్మించు కున్నా పాపం చేసినవాడు తప్పించుకోలేడని ఈ కథ మనకు చెబుతున్నది. అమరావతి పేరుతో రాజధాని నిర్మాణం అనే కార్యక్రమం వెనుక ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం దాగి ఉన్నదని విజ్ఞులందరికీ ఇప్పుడర్థమవుతున్నది. ఇంగితజ్ఞానం కలిగిన సామాన్యులకు సైతం ఆ కహానీ విన్నప్పుడు అదే అభిప్రాయం కలుగుతుంది. రాజధాని డొంకలో గజిబిజిగా అల్లుకున్న వేలాది అవినీతి తీగెల్లో ఒక తీగె యథాలాపంగా ఒకసారి ఆదాయపు పన్ను అధికారుల కాళ్లకు తగిలింది. ఆ తీగె వెంట బయల్దేరితే అది చంద్రబాబు ఇంటి దొడ్లోకి దారితీసింది. మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే ఒక కన్సల్టెంట్ ఇంట్లో ఏదో కేసుకు సంబంధించి సోదాలు చేసిన ఐటీ అధికారులకు అనుకోకుండా అమరావతి లింకు దొరికింది. దాని మీద శోధన మొదలుపెట్టిన అధికారులు ఈ సృజనాత్మక అవినీతికి నోళ్లు వెళ్లబెట్టారు. చివరకు తాము శోధించినంత మేరకు ఒక నివేదికను పొందుపరుస్తూ గడిచిన నవంబర్‌లో చంద్రబాబుకు నోటీసులు కూడా పంపించారు. ఈ నాలుగు నెలలు విషయం బయటకు పొక్కకుండా ఆపగలిగేందుకు... చక్రం తిప్పే కళ చంద్రబాబుకు ఉపకరించింది. ఇక ఈ నిప్పును ఎంతోకాలం దాచలేడు. సదరు మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే ఆయన షాపూర్జీ పల్లోంజీ అనే కంపెనీకి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీకి, దాంతోపాటు ఎల్ అండ్ టీకి చంద్రబాబు ప్రభుత్వం కొన్ని పనులను కాంట్రాక్టు ఇచ్చింది. అమరావతిలో సచివా లయం, అసెంబ్లీ, హైకోర్టు తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు కొన్ని టిడ్కో ఇళ్లను కూడా అప్పగించారు. ఈ నిర్మాణాల కోసం చదరపు అడుగుకు రూ. పదకొండు వేలకు పైగా చెల్లిస్తున్నారనీ, ఇది అసాధారణమనీ అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. కానీ కమీషన్లు భారీగా దండుకోవాలంటే ఆ మాత్రం ఉండాలని బాబు ప్రభుత్వం భావించింది. 2019 జనవరిలో తమకు రావాల్సిన కమీషన్లలో కొంత భాగాన్ని తను కోరు కున్నట్టుగా బదిలీ చేయించుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. తన పీఏ శ్రీనివాస్, లోకేశ్ పీఏ రాజేశ్‌లకు టాస్క్‌ను అప్పగించారు. వారు మనోజ్ వాసుదేవ్‌తో మాట్లాడి తాము చెప్పిన కొన్ని సూట్‌కేస్ కంపెనీల్లోకి నిధుల్ని బదిలీ చేయాలని ఆదేశించారు.అలా చెల్లించడానికి మొదట షాపూర్జీ కంపెనీ ప్రతినిధులు అశక్తత వ్యక్తం చేశారట! కావాలంటే పార్టీ ఫండ్‌గా ఇస్తామని ఆఫర్ చేశారట. అందుకు బాబు పీఏ శ్రీనివాస్ అంగీక రించకుండా తాము చెప్పినట్లు చేయకపోతే పెండింగ్ బిల్లులు ఆపేస్తామని బెదిరించారు. దీంతో చేసేదిలేక కంపెనీ ప్రతి నిధులు శ్రీనివాస్ చెప్పినట్టే చేశారు. మనోజ్ వాసుదేవ్‌ను పిలిచి అర్జెంట్‌గా డబ్బులు కావాలని చంద్రబాబు చెప్పడంతో షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి 52 కోట్ల 50 లక్షలను హయగ్రీవ, అన్నై, షలాకా కంపెనీల్లో, 62 కోట్ల 90 లక్షలు నవొలిన్, ఎవరెట్ కంపెనీల ఖాతాల్లోకి వేయించాడు. ఎల్ అండ్ టీతో మాట్లాడి 41 కోట్ల 90 లక్షలు బోగస్ కంపెనీల్లో వేయించాడు. ఈ కంపెనీల నుంచి మొత్తం 157 కోట్ల రూపాయలు రామోజీ చిన్నకొడుకు వియ్యంకుడైన ఆర్వీఆర్ రఘు, మరికొందరి కంపెనీల్లోకి బదిలీ అయ్యాయి. వారు ఆ సొమ్మును చంద్రబాబుకు చేర్చారు. ఇవి కాకుండా దుబాయ్‌లో చంద్రబాబుకు స్వయంగా క్యాష్ రూపంలో 15 కోట్ల 14 లక్షల రూపాయల విలువైన దీరామ్‌లను అంద జేసినట్టు కూడా మనోజ్ వాసుదేవ్ ఐటీ అధికారుల ఎదుట వాఙ్మూలాన్నిచ్చాడు. ఈ విషయాలన్నీ నిజమేనని బాబు పీఏ శ్రీనివాస్ కూడా అధికారుల ఎదుట అంగీకరించి సంతకం చేశాడు. మనీలాండ రింగ్ అంశం కూడా ఇమిడి ఉన్నందువలన నేడో రేపో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ రంగంలోకి దిగే అవకాశం ఉన్నది. పక్కా సాక్ష్యాధారాలున్న నేపథ్యంలో జైలు శిక్షను తప్పించు కోవడం దాదాపు అసాధ్యమే. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు సర్కార్ చేసిన మరో స్కామ్‌లో వివిధ బోగస్ కంపెనీల ద్వారా 371 కోట్ల రూపాయలు చంద్రబాబు ఇంటిదారి పట్టాయి. ఈ వ్యవహా రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడమే కాకుండా ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది. ఇక్కడ స్కిల్లూ లేదూ, డెవలప్‌మెంటూ లేదు. ప్రజాధనం మాత్రం చంద్రబాబు జూబ్లీ హిల్స్ ప్యాలెస్‌కు చేరింది. రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి సీమెన్స్ అనే కంపెనీ ఉదారంగా ముందుకు వచ్చిందనీ, ప్రాజెక్టు విలువ 3,356 కోట్లనీ, అందులో 90 శాతం సీమెన్స్ గ్రాంటుగా ఇస్తుందనీ, మనం పదిశాతం పెడితే సరి పోతుందనీ చంద్రబాబు కేబినెట్లో చెప్పారు. ఆ తర్వాత జీవోలో కూడా అదే విషయం చెబుతూ రాష్ట్రంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆ క్లస్టర్లలో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఉంటుందని చెప్పారు. చివరకు ఒప్పందంలోకి వచ్చేసరికి సీమెన్స్ గ్రాంటు ప్రస్తావన లేదు. కొసమెరుపు ఏమిటంటే ఒప్పందం చేసుకున్నది కూడా సీమెన్స్ సంస్థతో కాదు. అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులతో! విషయం తెలిసి కంపెనీ ఆ ఉద్యోగులను తొలగించింది. ఒప్పందంతో తమకు సంబంధం లేదని ప్రకటించింది. సీమెన్స్ గ్రాంటు రాలేదు కానీ ప్రభుత్వం పెట్టాల్సిన పదిశాతం పన్నులతో కలిపి 371 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా ప్రయాణం చేసి చంద్ర బాబు ఇంటికి చేరుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పుడు సాక్ష్యాధారాలు లభించిన ఈ రెండు కేసులూ చంద్రబాబు అవినీతి పురాణానికి సంబంధించిన టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్ మాత్రమే. తవ్వాల్సిన కొండ ఇంకా చాలా ఉన్నది. ఇప్పటికే వెలుగు చూసిన కొండ కొస అంచు కూడా చాలు – బాబుకు శిక్ష పడేందుకు! అందుకే ఆయనలో భయం పెరిగింది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ గజగజ వణుకుతున్నాడనే పాట మొదలుపెట్టాడు. యథా బాప్... తథా బేటా! పితాశ్రీని చూసి సుతాశ్రీ కూడా మొదలుపెట్టాడు. నన్ను చూసి జగన్ భయపడుతున్నాడనీ పాదయాత్రకు వచ్చే కార్య కర్తలకు వినోదాన్ని పంచుతున్నాడు. సుతాశ్రీ డైలాగులు వింటుంటే కిల్ బిల్ పాండే (బ్రహ్మానందం క్యారెక్టర్) గుర్తు కొస్తున్నాడని కార్యకర్తలు మురిసిపోతున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఆరు స్థానాలను సాధించింది. టీడీపీ ఒక స్థానాన్ని దక్కించుకుంది. 07:59PM రెండో ప్రాధాన్యత ఓట్లతో.. వైఎస్సార్సీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా గెలుపు 07:10PM వైఎస్సార్సీపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీగా గెలుపు వైఎస్సార్సీపీ అభ్యర్థి బొమ్మి ఇజ్రాయిల్ ఎమ్మెల్సీగా గెలుపు వైఎస్సార్సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా విజయం వైఎఎస్సార్సీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం ఎమ్మెల్సీగా విజయం వైఎస్సార్సీపీ అభ్యర్థి పెన్మత్స సూర్యనారాయణ రాజు ఎమ్మెల్సీగా విజయం టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం 06:50PM ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కాసేపట్లో అధికారికంగా ఫలితాలు ►175కి 175 ఓట్లు వ్యాలిడ్‌గా గుర్తింపు 05:32PM ► ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్తు కమిటీలో జరుగుతుంది. పోలింగ్ అయిన మొత్తం 175 ఓట్లకు గాను అన్ని ఓట్లు అంటే 175 ఓట్లు కూడా వాలిడ్ అని అధికారులు తెలిపారు. 05:00PM ►ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. అసెంబ్లీ కమిటీ హాల్లో కౌంటింగ్ ప్రక్రియ. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా మర్రి రాజశేఖర్, ఇజ్రాయిల్, పోతుల సునీత, జయ మంగళ వెంకట రమణ, కోలా గురువులు, పెనుమత్స సూర్యనారాయణ రాజు, చంద్రగిరి ఏసురత్నం 02:40PM ►ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది 02:29PM ►అసెంబ్లీకి చేరుకున్న ఎమ్మెల్యే అప్పలనాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతో 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లయ్యింది. ►ఇప్పటివరకు 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయాల్సి ఉన్న నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు.. కుమారుడు ప్రదీప్ వివాహం కారణంగా ఆలస్యమయింది. ఆయన విశాఖ నుంచి చాపర్‌లో విజయవాడకు బయలుదేరారు. కాసేపట్లో చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓటు వేసే అవకాశం ఉంది. ►ఇప్పటివరకు 172 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో ముగురు ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది. ►ఇప్పటివరకు 149 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ►మంత్రులు బూడి ముత్యాల నాయుడు, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్ కర్ణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు 130 మంది ఓటు వేశారు. ► రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► ఇప్పటివరకు 80 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 35 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ►ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ జరుగుతోంది. ►శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175. ఇందులో వైఎస్సార్సీపీకి 151 మంది సభ్యులు ఉండగా.. టీడీపీకి అధికారికంగా 23 మంది, జనసేనకు ఒకరు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా నలుగురు సభ్యులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అలాగే జనసేనకు ఉన్న ఒక సభ్యుడు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. ఒక్కో ఎమ్మెల్సీ గెలుపొందడానికి 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను బరిలో దించింది. ►ఈ క్రమంలో వాస్తవంగా చూస్తే.. ఒక్క స్థానం గెలవడానికి కూడా టీడీపీకి బలం లేదు. అయినా సరే అభ్యర్థిని బరిలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీలో పనితీరు ఆధారంగా కొంతమంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశం లేదని అంచనా. ఈ నేపథ్యంలో అలాంటి వారి మద్దతు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ►ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. అసెంబ్లీలోని కమిటీ హాల్ నంబర్ –1లో తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది. అనంతరం ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. తదుపరి ఫలితాలు ప్రకటిస్తారు. -
వెంకయ్యకు అలా చెప్పింది మేమే..
సాక్షి, అమరావతి : బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. గురువారం శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను పయ్యావుల తప్పుబట్టారు. పయ్యావులు మాట్లాడుతూ.. సభలో సోము వీర్రాజు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అసలు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిందే ముంపు మండలాల కోసమని, రాజ్యసభలో వెంకయ్య నాయుడు మాట్లాడిన అంశాలను తామే స్లిపుల ద్వారా పంపామని, ఆ విషయాన్ని సోము వీర్రాజు తెలుసుకోవాలన్నారు. రాయలసీమ డ్రిప్ ఇరిగేషన్ చంద్రబాబు వల్లే వచ్చిందని తెలిపారు. దీనిపై స్పందించిన సోము వీర్రాజు సభలో నేను మాట్లాడే ప్రతిసారి అడ్డుతగలడం మంచి పద్ధతి కాదన్నారు. -
ఏపీ శాసనసభ 9.30.. మండలి 10 గంటలకు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు నేటినుంచి ఐదురోజుల పాటు జరుగనున్నాయి. గురువారం ఉదయం 8.45 గంటలకు బీఎసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఒకరోజు పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఉదయం 9.30 గంటలకు శాసన సభ ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కానుంది. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణం రేపే
హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ రేపు పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారిద్దరూ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఏ.చక్రపాణి ఛాంబర్లో పదవీ ప్రమాణం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. -
జనాభా కంటే అధికంగా ‘ఆధార్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జనాభా కంటే ఆధార్‌కార్డుల సంఖ్య మూడుశాతం ఎక్కువగా ఉంద ని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వెల్లడిం చారు. రాష్ట్ర జనాభా 3,50,96,453కాగా, కార్డు లు మాత్రం 3,62,05,809 ఉన్నాయని చెప్పా రు. జిల్లాల వారీగా పరిశీలిస్తే...హైదరాబాద్ జిల్లాలో 40,10,238 మంది జనాభాకు గాను 62,68,817 లక్షల కార్డులు నమోదయ్యాయని, ఇది 56శాతం ఎక్కువని తెలిపారు. శనివారం మండలి ప్రశోత్తరాల సమయంలో.. జిల్లాల వారీగా పంపిణీ చేసిన ఆధార్‌కార్డులు ఎన్ని, దీనిని మరింత సమర్థంగా అమలుచేసేందుకు ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీవో) సేవలను ఉపయోగించుకునే ప్రతిపాదన ఏదైనా ఉందా అని ఎమ్మెల్సీ ఉల్లోళ్ల గంగాధ ర్‌గౌడ్ వేసిన ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధాన మిచ్చారు. దేశంలో ఎక్కడి నుంైచె నా ఆధార్‌ను నమోదు చేసుకునే అవకాశం ఉన్నందున, రాష్ట్రం బయట కూడా చేసుకుని ఉండొచ్చునన్నారు. పదిజిల్లాల్లో ఇప్పటికీ 450 నమోదు కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పారు. కేంద్రవిశిష్ట గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున, ఎన్జీవోల సేవల వినియోగం గురించి ప్రభుత్వానికి తెలియదని స్పష్టంచేశారు. పరిశీలనలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ రాష్ట్రంలో పింఛన్‌దారుల ప్రయోజనం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన జీవన్ ప్రమాణ్ మాదిరిగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇందుకోసం అవసరమయ్యే సాఫ్ట్‌వేర్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందించాల్సి ఉందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జీవన్ ప్రమాణ్ మాదిరిగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రవేశపెట్టే ప్రతిపాదన గురించి ఎమ్మెల్సీ పూలరవీందర్ అడిగిన ప్రశ్నకు మం త్రి సమాధానమిస్తూ ఈ వివరాలు తెలిపారు. -
మండలిలో ఇంజనీరింగ్ లొల్లి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అంశం శాసన మండలిలో శుక్రవారం దుమారం లేపింది. ప్రమాణాల పేరిట కళాశాలల గుర్తింపును రద్దు చేయడం శోచనీయమంటూ విపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం చేతకాకుంటే.. ఆ విషయం చెప్పాలిగానీ, ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేయడం తగదని విమర్శించాయి. రాష్ట్రంలో 174 ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దుచేయడంతో సుమారు 90 వేలమంది విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైందని, విద్యార్థుల జీవితాల తో సర్కారు చెలగాటమాడుతోందని కాంగ్రెస్, టీడీపీ, మజ్లిస్ సభ్యులు నిప్పులు చెరిగారు. ఇక మజ్లిస్ ఎమ్మెల్సీ హైదర్ రిజ్వీ అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అస్పష్టంగా సమాధానం ఇవ్వడంతో... విపక్షాలన్నీ ఒక్కటై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. రిజర్వేషన్ పెంచడమంటే ఇలాగేనా..? ముస్లింలకు విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్‌ను పెంచుతామన్న సర్కారు... ముస్లిం మైనార్టీ సంస్థలకు చెందిన కళాశాలలకు అనుమతిని రద్దు చేసిందని మజ్లిస్ ఎమ్మెల్సీ హైదర్రిజ్వీ ఆరోపించారు. అన్ని సదుపాయాలు సక్రమంగా ఉన్నాయని నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఇచ్చిన కళాశాలలకు సైతం గుర్తింపు రద్దు చేశారని.. అందులో గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న కళాశాలలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పాలేగాని.. కళాశాలలను మూస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. ప్రమాణాలు లేవని ప్రైవేటు కళాశాలలను మూస్తున్న జేఎన్టీయూహెచ్ అధికారులు... ప్రమాణాలు లేకుండానే ప్రభుత్వ కళాశాలలను నడిపించవచ్చా అని నిలదీశారు. మంథనిలోని యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో 1,104 మంది విద్యార్థులుంటే కేవలం నలుగురే అధ్యాపకులు ఉన్నారన్నారు. ప్రస్తుతం ప్రమాణాలు లేవని తేల్చిన కళాశాలలకు గతంలో అనుమతులిచ్చిన అధికారులపై ఏ చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్సీ నాగేశ్వర్ ప్రశ్నించారు. జేఎన్టీయూహెచ్ నిర్వహించిన తనిఖీల నివేదికలను శాసనమండలికి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు చైర్మన్‌ను కోరారు. దీనిపై సభాసంఘం వేసి సభ్యుల సందేహాలను తొలగించాలని విపక్ష నేత డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆన్లైన్లో చూసుకోండి.. ఇంజనీరింగ్ కళాశాలల్లో జేఎన్టీయూహెచ్ మూడు దఫాలుగా నిర్వహించిన తనిఖీల నివేదికలను వర్సిటీ వెబ్సైట్లో ఉంచామని.. మండలి సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ చూసుకోవచ్చని మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. గుర్తింపు రద్దు కేవలం ఆయా కళాశాలల్లో మొదటి సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గుర్తింపు రద్దయిన కళాశాలల్లో 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్మెంట్ను ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తుందని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతను పెంచేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని, గుర్తింపు రద్దు విషయంలో ఎటువంటి వివక్ష చూపలేదని కడియం పేర్కొన్నారు. తనిఖీ నివేదికలపై అభ్యంతరాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చన్నారు. కాగా.. తనిఖీ నివేదికలను వర్సిటీ వెబ్సైట్లో ఉంచామని చెప్పి ఉప ముఖ్యమంత్రిని కూడా జేఎన్టీయూహెచ్ అధికారులు తప్పుదోవ పట్టించారని టీడీపీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు ఆరోపించారు. -
నిరసనలు, నినాదాలతో దద్దరిల్లాయి
-
నిరసనలు, నినాదాలతో దద్దరిల్లాయి
నినాదాలు, నిరసనల మధ్య దద్దరిల్లిన ఉభయసభలూ..ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. తొలుత రెండుసార్లు వాయిదాపడ్డ అసెంబ్లీ తిరిగి సమావేశమయ్యాక.. సభలో ఎటువంటి మార్పు లేకపోవడంతో.. డిప్యుటీ స్పీకర్ మల్లూ భట్టీవిక్రమార్క సభను సోమవారానికి వాయిదా వేశారు. శనివారం సమావేశాలు ప్రారంభం కాగానే ప్లకార్డులు చేతపట్టి.. స్పీకర్ పోడీయంను చుట్టుముట్టిన సభ్యులు .. సభను సాగనీయకుండా అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో శాసనసభ మారుమ్రోగిపోయింది. ఒకదశలో ప్లకార్డులు లోనికి తేవద్దని, స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. ఇటు పెద్దలసభలోకూడా ఇదే సీన్ కనిపించింది. ఇరుప్రాంతాల నేతలు నినాదాలు చేస్తూ..సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో.. వాయిదాపర్వం కొనసాగింది. ఆతరువాత ప్రారంభమైన మండలిలో.. నినాదాలు కొనసాగడంతో.. ఛైర్మన్ చక్రపాణి సభను సోమవారానికి వాయిదా వేశారు. -
సీఎం సమర్థుడు కాడా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమర్థతపై శాసనమండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. శుక్రవారం రెండోసారి మండలి సమావేశాలు వాయిదా పడిన అనంతరం మంత్రులు పార్థసారథి, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీల మధ్య లాబీల్లో ముచ్చట్లు మొదలయ్యాయి. శ్రీధర్‌బాబు శాఖ ఎందుకు మార్చాల్సివచ్చిందని షబ్బీర్‌ప్రశ్నించగా... వాణిజ్య పన్నుల శాఖ రాబడి ఇటీవల త గ్గిపోయిందని, అందుకే సమర్థుడైన శ్రీధర్‌బాబుకు అప్పగించారని పార్థసారథి చెప్పారు. రాబడి పెంచే సమర్థుడు శ్రీధర్‌బాబు అయితే, ఇప్పటివరకు ఆ శాఖ ఉంచుకున్న సీఎం అసమర్థుడా? అని షబ్బీర్ ప్రశ్నించారు. మధ్యలో కలుగజేసుకున్న ఎమ్మెల్సీ పొంగులేటి... శాఖ మార్పు ప్రధానం కాదని, ఎప్పుడు మార్చారన్నది ముఖ్యమన్నారు. ఈ చర్యతో అటు సీఎం, ఇటు శ్రీధర్‌బాబు గ్రాఫ్‌లు బీభత్సంగా పెరిగిపోయాయని, ఇద్దరూ సన్నిహిత మిత్రులే కనుక మార్చుకుని ఉంటారని పార్థసారథి చెప్పారు. అలాంటిదేం లేదని, శ్రీధర్‌తో సీఎం మాట్లాడడం లేదని షబ్బీర్ చెప్పారు. ఇటీవల రాష్ట్రపతి ఎట్‌హోం విందు ఇచ్చినప్పుడు కూడా నువ్వు హుషారు ఎక్కువ చేస్తున్నావని శ్రీధర్‌బాబునుద్దేశించి సీఎం వ్యాఖ్యానించారని, తర్వాత శ్రీధర్‌బాబు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు. అంతకుముందు పార్థసారథి మాట్లాడుతూ సీమాంధ్రకు రాజధానిని కూడా చూసుకున్నామని, విజయవాడ దగ్గర్లో నందిగామ, ఇబ్రహీంపట్నం, గుంటూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు 45వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలిపారు.