
సాక్షి, అమరావతి : బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. గురువారం శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను పయ్యావుల తప్పుబట్టారు.
పయ్యావులు మాట్లాడుతూ.. సభలో సోము వీర్రాజు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అసలు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిందే ముంపు మండలాల కోసమని, రాజ్యసభలో వెంకయ్య నాయుడు మాట్లాడిన అంశాలను తామే స్లిపుల ద్వారా పంపామని, ఆ విషయాన్ని సోము వీర్రాజు తెలుసుకోవాలన్నారు. రాయలసీమ డ్రిప్ ఇరిగేషన్ చంద్రబాబు వల్లే వచ్చిందని తెలిపారు. దీనిపై స్పందించిన సోము వీర్రాజు సభలో నేను మాట్లాడే ప్రతిసారి అడ్డుతగలడం మంచి పద్ధతి కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment