Payyauvla Keshav
-
పయ్యావుల అనుచరుల దౌర్జన్యకాండ
సాక్షి, ఉరవకొండ : కౌకుంట్ల పంచాయతీ విభజనను జీర్ణించుకోలేని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శ్రీనివాసులు తమ అనుచరుల ద్వారా కౌకుంట్ల పంచాయతీలో దౌర్జన్యకాండ సాగిస్తున్నారు. వారం రోజుల క్రితం వడ్డే వెంకటేష్, గంగమ్మ కుటుంబంపై దాడి ఘటన మరకముందే మైలారంపల్లిలో తాము పంచే చీరలు తీసుకొనందుకు దంపతులపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. బాధితులు అల్లాబకష్, ఇమాంబీ కథనం మేరకు.. పది రోజుల క్రితం జరిగిన పంచాయతీ విభజన గ్రామసభలో ప్రజలను ప్రలోభ పెట్టడానికి పెద్దఎత్తున పంపిణీ చేయడానికి చీరలు తీసుకొచ్చారు. అయితే కొన్ని గ్రామాల్లో చీరల పంపిణీ వాయిదా పడటంతో వాటిని మంగళవారం రాత్రి పంపణీ చేశారు. అయితే అల్లాబకష్ దంపతులు వాటిని తీసుకోవడానికి అంగీకరించలేదు. దీన్ని జీర్ణించుకోలేని పయ్యావుల ప్రధాన అనుచరులు వెంకటరమణప్ప, సాయిరాజు, ప్రణయ్, శ్రీకాంత్‌తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. ఇమాంబి చీర, జాకెటు చింపి ఆమెను తీవ్రంగా అవమానపరిచారు. గ్రామస్తులు బాధితులను హుటాహుటినా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ ధరణిబాబు తెలిపారు. వారి దౌర్జన్యకాండను ఇక సహించం పయ్యావుల కేశవ్ ఆయన సోదరుడు పయ్యావు ల శ్రీనివాసుల దౌర్జన్యకాండను ఇక సహించ బోమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై.మధు సూధన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చిన్నకౌకుంట్ల, విడపనకల్లు మండలం కరకముక్కల, పాల్తూరు గ్రామాల్లో పయ్యావుల అనుచరులు వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్‌గా దాడులు చేశారన్నారు. గ్రామాల్లో తమ అధిపత్యం చెలాయించడం కోసం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే తాము చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. -
‘దాణా కుంభకోణం కంటే పెద్ద స్కాం’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం చేపట్టిన ‘నీరు-చెట్టు’పథకంలో అంతులేని అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నీరు-చెట్టు పనులపై దృష్టి పెట్టింది. ఆ పథకంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను నిగ్గుతేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను రంగంలోకి దింపింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మాజీ సీఎం చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. ‘చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగిన నీరు-చెట్టు కుంభకోణం బీహార్ దాణా స్కాం కంటే పెద్దది. 22 వేల కోట్ల నిధులను జన్మభూమి కమిటీలకు పంచి పెట్టారు. సమగ్ర దర్యాప్తు జరిగితే బాబు, చిన బాబు ఇంకా అనేక పెద్ద తలకాయల బండారం బయట పడుతుంది’ అని పేర్కొన్నారు. (చదవండి : నేతా.. కక్కిస్తా మేత!) బంధుప్రీతిలో బాబును మించినోళ్లు లేరు..! చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన ఉండదనే విషయం మరోసారి రుజువైందని విజయసాయి రెడ్డి అన్నారు. కాపులు, బలహీనవర్గాలను ఆయన ఎప్పుడూ విశ్వసించరనేది మరోసారి అర్థమైందన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ (పీఏసీ) పదవిని చాలా మంది ఆశించినా చివరకు పయ్యావుల కేశవ్‌ను ఎంపిక చేసి బాబు బంధుప్రీతి చాటుకున్నారని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. -
వెంకయ్యకు అలా చెప్పింది మేమే..
సాక్షి, అమరావతి : బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. గురువారం శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను పయ్యావుల తప్పుబట్టారు. పయ్యావులు మాట్లాడుతూ.. సభలో సోము వీర్రాజు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అసలు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిందే ముంపు మండలాల కోసమని, రాజ్యసభలో వెంకయ్య నాయుడు మాట్లాడిన అంశాలను తామే స్లిపుల ద్వారా పంపామని, ఆ విషయాన్ని సోము వీర్రాజు తెలుసుకోవాలన్నారు. రాయలసీమ డ్రిప్ ఇరిగేషన్ చంద్రబాబు వల్లే వచ్చిందని తెలిపారు. దీనిపై స్పందించిన సోము వీర్రాజు సభలో నేను మాట్లాడే ప్రతిసారి అడ్డుతగలడం మంచి పద్ధతి కాదన్నారు. -
విశ్వేశ్వరరెడ్డి విజయకేతనం
ఉరవకొండ, న్యూస్‌లైన్ : ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పరాజయం పాలయ్యారు. ఆయనపై వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి 2,275 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొదటి రౌండ్ మినహా తక్కిన 16 రౌండ్లలో విశ్వేశ్వరరెడ్డి స్పష్టమైన ఆధిక్యం కనబర్చారు. తన ఓటమి ఖాయమని తెలుసుకున్న పయ్యావుల కేశవ్ 16వ రౌండ్ లెక్కింపు కొనసాగుతుండగానే కౌంటింగ్ హాలు నుంచి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో మొత్తం 1,93,398 ఓట్లు ఉండగా 1,65,251 పోలయ్యాయి. ఇందులో విశ్వేశ్వరరెడ్డికి 81,042, కేశవ్‌కు 78,767 ఓట్లు లభించాయి. చివర్లో మళ్లీ కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చిన పయ్యావుల తన ఓటమిని జీర్ణించుకోలేక అనుచరులతో కలిసి నానా రభస సృష్టించారు. రీకౌంటింగ్ జరిపించాలంటూ జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డితో కలిసి హంగామా చేశారు. వీరి వాదన న్యాయబద్ధంగా లేకపోవడంతో అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా కౌంటింగ్ పూర్తి చేశారు. విజయం సాధించిన విశ్వేశ్వరరెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశిదేవి డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విశ్వేశ్వరరెడ్డిని భుజాలపైకి ఎత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. -
పయ్యావుల గోదాముల్లో అక్రమ నిల్వలు..
అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చెందిన గోదాముల్లో అక్రమంగా నిల్వ చేసిన రూ. 20.80 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఉరవకొండ మండలం చిన్నముష్టూరు వద్ద పయ్యావులకు చెందిన లక్ష్మీ నరసింహ గోదాముల్లో మంగళవారం రాత్రి చేసిన తనిఖీల్లో 1,26,722 బస్తాల శనగపప్పు, 15,699 బస్తాల వరి ధాన్యం, 322 బస్తాల ధనియూలను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన రికార్డులు చూపకపోవడంతో సీజ్ చేసి.. పౌరసరఫరాలకు సంబంధించిన సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్న అభియోగం మేరకు 6(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (డీసీపీవో-విజిలెన్స్ విభాగం) సుబ్బన్న తెలిపారు. -
విభజనపై సుప్రీంలో పయ్యావుల పిల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, విభజన ప్రక్రియ తీరుతెన్నులను సవాల్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ హైదరాబాద్‌కు చెందిన సదాశివరెడ్డితో కలిసి 32వ అధికరణం కింద ప్రజా ప్రయోజనం వ్యాజ్యం(పిల్) దాఖలు చేశామన్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, పీఎంవో కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేత, పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.