పయ్యావుల గోదాముల్లో అక్రమ నిల్వలు.. | PAYYAVULA illegal stock stock .. | Sakshi
Sakshi News home page

పయ్యావుల గోదాముల్లో అక్రమ నిల్వలు..

Published Thu, Apr 17 2014 3:38 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

పయ్యావుల గోదాముల్లో అక్రమ నిల్వలు.. - Sakshi

పయ్యావుల గోదాముల్లో అక్రమ నిల్వలు..

అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చెందిన గోదాముల్లో అక్రమంగా నిల్వ చేసిన రూ. 20.80 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఉరవకొండ మండలం చిన్నముష్టూరు వద్ద పయ్యావులకు చెందిన లక్ష్మీ నరసింహ గోదాముల్లో మంగళవారం రాత్రి చేసిన తనిఖీల్లో 1,26,722 బస్తాల శనగపప్పు, 15,699 బస్తాల వరి ధాన్యం, 322 బస్తాల ధనియూలను విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

వీటికి సంబంధించిన రికార్డులు చూపకపోవడంతో సీజ్ చేసి.. పౌరసరఫరాలకు సంబంధించిన సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్న అభియోగం మేరకు 6(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (డీసీపీవో-విజిలెన్స్ విభాగం) సుబ్బన్న తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement