విభజనపై సుప్రీంలో పయ్యావుల పిల్ | Payyauvla Keshav filed PIL in SC against state bifurcation | Sakshi
Sakshi News home page

విభజనపై సుప్రీంలో పయ్యావుల పిల్

Published Thu, Oct 24 2013 3:56 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Payyauvla Keshav filed PIL in SC against state bifurcation

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, విభజన ప్రక్రియ తీరుతెన్నులను సవాల్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ హైదరాబాద్‌కు చెందిన సదాశివరెడ్డితో కలిసి 32వ అధికరణం కింద ప్రజా ప్రయోజనం వ్యాజ్యం(పిల్) దాఖలు చేశామన్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, పీఎంవో కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.  విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేత, పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement