జనాభా కంటే అధికంగా ‘ఆధార్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జనాభా కంటే ఆధార్‌కార్డుల సంఖ్య మూడుశాతం ఎక్కువగా ఉంద ని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వెల్లడిం చారు. రాష్ట్ర జనాభా 3,50,96,453కాగా, కార్డు లు మాత్రం 3,62,05,809 ఉన్నాయని చెప్పా రు. జిల్లాల వారీగా పరిశీలిస్తే...హైదరాబాద్ జిల్లాలో 40,10,238 మంది జనాభాకు గాను 62,68,817 లక్షల కార్డులు నమోదయ్యాయని, ఇది 56శాతం ఎక్కువని తెలిపారు. శనివారం మండలి ప్రశోత్తరాల సమయంలో.. జిల్లాల వారీగా పంపిణీ చేసిన ఆధార్‌కార్డులు ఎన్ని, దీనిని మరింత సమర్థంగా అమలుచేసేందుకు ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీవో) సేవలను ఉపయోగించుకునే ప్రతిపాదన ఏదైనా ఉందా అని ఎమ్మెల్సీ ఉల్లోళ్ల గంగాధ ర్‌గౌడ్ వేసిన ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధాన మిచ్చారు. దేశంలో ఎక్కడి నుంైచె నా ఆధార్‌ను నమోదు చేసుకునే అవకాశం ఉన్నందున, రాష్ట్రం బయట కూడా చేసుకుని ఉండొచ్చునన్నారు. పదిజిల్లాల్లో ఇప్పటికీ 450 నమోదు కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పారు. కేంద్రవిశిష్ట గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున, ఎన్జీవోల సేవల వినియోగం గురించి ప్రభుత్వానికి తెలియదని స్పష్టంచేశారు.
పరిశీలనలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
రాష్ట్రంలో పింఛన్‌దారుల ప్రయోజనం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన జీవన్ ప్రమాణ్ మాదిరిగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇందుకోసం అవసరమయ్యే సాఫ్ట్‌వేర్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) రూపొందించాల్సి ఉందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జీవన్ ప్రమాణ్ మాదిరిగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రవేశపెట్టే ప్రతిపాదన గురించి ఎమ్మెల్సీ పూలరవీందర్ అడిగిన ప్రశ్నకు మం త్రి సమాధానమిస్తూ ఈ వివరాలు తెలిపారు.