
అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడంతో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.
‘‘మంత్రి అచ్చెన్నాయుడు నేను ఒకే ప్రాంతం నుంచి వచ్చాం. సుదీర్ఘ రాజకీయాలు చేసిన అనుభవం నాకు ఉందని అచ్చెన్నాయుడికి తెలుసు. మేం గాలికి వచ్చామని మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆయన తన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి.
.. మేం ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా నాపై మాట్లాడటం ఇద్దరికీ గౌరవంగా ఉండదు. మేమంతా రాజకీయంగా పోరాటాలు చేసే ఇక్కడకు వచ్చాం’’ అని బొత్స, అచ్చెన్నకు హితవు పలికారు. ఇదిలా ఉంటే.. సాక్షి టీవీ సహా నాలుగు ఛానెల్స్‌కు మండలి లైవ్ ప్రసారాలను సమాచార శాఖ నిలిపివేయడం గమనార్హం.
మండలిలో అచ్చెన్న vs బొత్స
మంత్రి అచ్చెన్నాయుడు👇
2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చింది
గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదు
కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.
జగనన్న కాలనీలు అన్నారు.. దాని గురించి నేను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదు.. ఏం జరిగిందో అందరికీ తెలుసు..
కేంద్రం డబ్బులతోనే కథ నడిపారు
రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
మేము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం.
మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి?
విపక్ష నేత బొత్స సత్యనారాయణ👉🏼.. 2014 - 19 ఇళ్లు కట్టిన వారికి మా ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదనడం అవాస్తవం. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చాం. అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదు. కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతో ఇవ్వలేదని చెప్పటం సరికాదు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చింది. మా పార్టీ వాళ్ళకే పనులు, పథకాలు ఇవ్వాలని మా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు.
.. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు పథకాల పై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడటానికి సిగ్గుపడాలి. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా?.

.. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా?.. కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా మీ సొంత ఆస్తి అనుకుంటున్నారా?. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం.