ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఆరు స్థానాలను సాధించింది. టీడీపీ ఒక స్థానాన్ని దక్కించుకుంది.
07:59PM
రెండో ప్రాధాన్యత ఓట్లతో.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా గెలుపు
07:10PM
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీగా గెలుపు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొమ్మి ఇజ్రాయిల్ ఎమ్మెల్సీగా గెలుపు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా విజయం
- వైఎఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం ఎమ్మెల్సీగా విజయం
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెన్మత్స సూర్యనారాయణ రాజు ఎమ్మెల్సీగా విజయం
- టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం
06:50PM
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
- మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి
- రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం
- కాసేపట్లో అధికారికంగా ఫలితాలు
►175కి 175 ఓట్లు వ్యాలిడ్‌గా గుర్తింపు
05:32PM
► ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్తు కమిటీలో జరుగుతుంది. పోలింగ్ అయిన మొత్తం 175 ఓట్లకు గాను అన్ని ఓట్లు అంటే 175 ఓట్లు కూడా వాలిడ్ అని అధికారులు తెలిపారు.
05:00PM
►ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. అసెంబ్లీ కమిటీ హాల్‌లో కౌంటింగ్ ప్రక్రియ. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా మర్రి రాజశేఖర్, ఇజ్రాయిల్, పోతుల సునీత, జయ మంగళ వెంకట రమణ, కోలా గురువులు, పెనుమత్స సూర్యనారాయణ రాజు, చంద్రగిరి ఏసురత్నం
02:40PM
►ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది
02:29PM
►అసెంబ్లీకి చేరుకున్న ఎమ్మెల్యే అప్పలనాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతో 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లయ్యింది.
►ఇప్పటివరకు 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయాల్సి ఉన్న నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు.. కుమారుడు ప్రదీప్ వివాహం కారణంగా ఆలస్యమయింది. ఆయన విశాఖ నుంచి చాపర్‌లో విజయవాడకు బయలుదేరారు. కాసేపట్లో చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓటు వేసే అవకాశం ఉంది.
►ఇప్పటివరకు 172 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో ముగురు ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది.
►ఇప్పటివరకు 149 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
►మంత్రులు బూడి ముత్యాల నాయుడు, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్ కర్ణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు 130 మంది ఓటు వేశారు.
► రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
► ఇప్పటివరకు 80 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
► ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 35 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు.
►ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ జరుగుతోంది.
►శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175. ఇందులో వైఎస్సార్‌సీపీకి 151 మంది సభ్యులు ఉండగా.. టీడీపీకి అధికారికంగా 23 మంది, జనసేనకు ఒకరు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా నలుగురు సభ్యులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అలాగే జనసేనకు ఉన్న ఒక సభ్యుడు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. ఒక్కో ఎమ్మెల్సీ గెలుపొందడానికి 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను బరిలో దించింది.
►ఈ క్రమంలో వాస్తవంగా చూస్తే.. ఒక్క స్థానం గెలవడానికి కూడా టీడీపీకి బలం లేదు. అయినా సరే అభ్యర్థిని బరిలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీలో పనితీరు ఆధారంగా కొంతమంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశం లేదని అంచనా. ఈ నేపథ్యంలో అలాంటి వారి మద్దతు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
►ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. అసెంబ్లీలోని కమిటీ హాల్ నంబర్ –1లో తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది. అనంతరం ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. తదుపరి ఫలితాలు ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment