నిరసనలు, నినాదాలతో దద్దరిల్లాయి
నినాదాలు, నిరసనల మధ్య దద్దరిల్లిన ఉభయసభలూ..ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. తొలుత రెండుసార్లు వాయిదాపడ్డ అసెంబ్లీ తిరిగి సమావేశమయ్యాక.. సభలో ఎటువంటి మార్పు లేకపోవడంతో.. డిప్యుటీ స్పీకర్ మల్లూ భట్టీవిక్రమార్క సభను సోమవారానికి వాయిదా వేశారు.
శనివారం సమావేశాలు ప్రారంభం కాగానే ప్లకార్డులు చేతపట్టి.. స్పీకర్ పోడీయంను చుట్టుముట్టిన సభ్యులు .. సభను సాగనీయకుండా అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో శాసనసభ మారుమ్రోగిపోయింది. ఒకదశలో ప్లకార్డులు లోనికి తేవద్దని, స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేశారు.
ఇటు పెద్దలసభలోకూడా ఇదే సీన్ కనిపించింది. ఇరుప్రాంతాల నేతలు నినాదాలు చేస్తూ..సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో.. వాయిదాపర్వం కొనసాగింది. ఆతరువాత ప్రారంభమైన మండలిలో.. నినాదాలు కొనసాగడంతో.. ఛైర్మన్ చక్రపాణి సభను సోమవారానికి వాయిదా వేశారు.