హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు ఈనెల 17వ తేదీ వరకూ వాయిదా పడ్డాయి. విభజన బిల్లుపై సభలో సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ప్రసంగం అనంతరం స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభను వాయిదా వేశారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విభజన బిల్లుపై సవరణల ప్రతిపాదన ఇవ్వలేదని సమాచారం.
కాగా ఈరోజు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే సమైక్య తీర్మానం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. స్పీకర్ తిరస్కరించటంతో పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. అనంతరం విభజన బిల్లుపై చర్చను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ సభనుంచి వాకౌట్ చేసింది.