assembly adjourned
-
'బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు’
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్ కమార్ యాదవ్ ఆరోపించారు. రెండో రోజు మంగళవారం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏటా రూ. 10 వేల కోట్లు ఇస్తామని చెప్పి.. గత మూడేళ్లలో రూ. 8 వేల కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ తీరుతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదని మండిపడ్డారు. బీసీ సంక్షేమంపై తాము చెప్పదలచుకున్న వివరణ చెప్పి వాకౌట్ చేస్తామన్నా సమయం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని తెలిపారు. -
ప్రతిపక్షాల నిరసన.. సభ వాయిదా
-
'బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు’
-
ప్రతిపక్షాల నిరసన.. సభ వాయిదా
బీసీ సంక్షేమం మీద చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టుబట్టింది. ఈ అంశంపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్క మాట మాట్లాడగానే.. స్పీకర్ మైక్ కట్ చేశారు. ఇప్పటికే ఆ ప్రశ్న ముగిసిపోయి మరో ప్రశ్నలోకి వెళ్లిపోయామని, అందువల్ల దానిపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేమని అన్నారు. అయితే.. బీసీ సంక్షేమం మీద తాము వాకౌట్ చేయాలనుకుంటున్నామని, అందువల్ల ఆ విషయమై తాము చెప్పదలచుకున్న వివరణ చెప్పి వాకౌట్ చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంత అడిగినా పట్టించుకోలేదు. దాంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా నినాదాలు చేస్తుండగానే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే గందరగోళం నడుమ ఎవరికీ ఏమీ వినిపించలేదు. దాంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
మూడోరోజు దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ
-
మూడోరోజు దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడో రోజు కూడా ఉద్రిక్తత కొనసాగింది. ప్రత్యేక హోదా నినాదంతో సభ దద్దరిల్లింది. శనివారం సమావేశాలు ప్రారంభం కాగానే ప్రత్యేక హోదాపైనే వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టింది. హోదాపై చర్చకు అవకాశం కల్పించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పోడియం చుట్టు ముట్టి నిరసనకు దిగారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులపై అధికార పక్షం మాటల దాడికి దిగింది. రెచ్చగొట్టే ధోరణిలోనే వ్యవహరిస్తూ సభలో మరింత ఉద్రిక్త పరిస్థితిని సృష్టించింది. మైక్ దొరికితే చాలు వ్యక్తిగత దూషణలకు దిగుతూ అధికార పార్టీ సభ్యులు ఊగిపోయారు. తిట్టేందుకు టీడీపీ సభ్యులకు మైక్ ఇచ్చిన స్పీకర్.... ప్రతిపక్ష నేత జగన్ హోదాపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగానే మైక్ కట్ చేశారు. దీంతో జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అటు మార్షల్స్ కూడా ప్రతిపక్ష సభ్యులపై అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సమావేశాలను పది నిమిషాలు వాయిదా వేశారు. -
అసెంబ్లీలో గందరగోళం, సభ రేపటికి వాయిదా
-
అసెంబ్లీలో గందరగోళం, సభ రేపటికి వాయిదా
హైదరాబాద్ : రెండుసార్లు వాయిదా అనంతరం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ శనివారానికి వాయిదా పడింది. ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు కూడా దద్దరిల్లింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో హోరెత్తింది. దీంతో సభలో వాయిదాల పర్వం కొనసాగింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టింది. ప్రజలందరూ కోరుకొంటున్నట్లుగా ఈ అంశంపై చర్చించాలని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ముందు ప్రకటన చేస్తామని ఆ తర్వాతే చర్చ చేపట్టాలని అధికార పక్షం స్పష్టం చేసింది. విపక్షం మాత్రం ప్రభుత్వ ప్రకటనకు తాము ఒప్పుకునేది లేదని, ముందు చర్చ చేపట్టాలని తెలిపింది. ప్రశాంతంగా ప్రారంభమైన సభలో అధికార పక్షం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహారించింది. చర్చకు పట్టుబట్టిన విపక్షానికి సర్దిచెప్పాల్సిన అధికార పక్షం అనవసర వ్యాఖ్యలు చేసింది. లోటస్ పాండ్ రూల్స్ సభలో నడవవంటూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. సభను 15 నిమిషాలు కూడా నడవకుండా విపక్ష సభ్యులు వ్యవహారిస్తున్నారన్న చీఫ్ విప్ వ్యాఖ్యలు సభలో ఉద్రిక్తతకు కారణమయ్యాయి. దీంతో ఆగ్రహించిన విపక్ష సభ్యులంతా స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ గట్టిగా నినదించారు. పోడియం దగ్గర మార్షల్స్ విపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలతో మార్షల్స్ దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమ పట్టు వీడలేదు. హోదాపై చర్చించాల్సిందేనంటూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఈ సందర్భంగా మరోసారి తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను మరో 15 నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశాలు మొదలైనా.. చర్చపై వైఎస్ఆర్ సీపీ సభ్యులు ఉడుంపట్టు పట్టారు. దీంతో సభాలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సమావేశాలను శనివారానికి వాయిదా వేశారు. -
మార్షల్స్ మాపై దాడి చేస్తారా..?
హైదరాబాద్: ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు కూడా దద్దరిల్లింది. 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ⇒ప్రభుత్వం ప్రకటన చేసి తర్వాత.. విపక్షాన్ని మాట్లాడనీయకుండా చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. పోడియం వద్ద తాము శాంతియుతంగానే ఆందోళన చేశామని ఆయన తెలిపారు. మార్షల్సే తమపై దాడి చేశారన్నారు. మార్షల్స్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవని ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. ⇒అబద్ధాలు, అవాస్తవాలతో పుట్టిన పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మార్షల్స్ తమపై దాడి చేస్తారా..అని ఆయన ప్రశ్నించారు. దాడి చేసే అధికారం మార్షల్స్‌కు ఎక్కడిదని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్సీపీ నిరంతర పోరాటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తమ హక్కులను కాలరాసే చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి మేలు జరిగేంత వరకు ప్రజల పక్షాన నిలబడతామని చెవిరెడ్డి అన్నారు. ⇒మార్షల్స్ పై దాడి చేశారనడం పచ్చి అబద్ధమని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. విభజన హామీలపై చర్చ అంటే ప్రభుత్వం భయపడుతోందన్నారు. ప్రత్యేక హోదాపై ముందు చర్చ జరగాలని సూచించారు. ⇒రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు గమనించాలన్నారు. ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతోందని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తామేమైనా దొంగలమా, లేక రౌడీలమా అంటూ.. ఎందుకు మార్షల్స్‌ను పెట్టారని ధ్వజమెత్తారు. తాము చేసే పోరాటం ప్రత్యేక హోదా కోసమే అన్నారు. ⇒ప్రత్యేక హోదా వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ⇒ఓటుకు కోట్లు కేసు వల్లే బాబు హోదాను తాకట్టు పెట్టారు: ఎమ్మెల్యే సునీల్ ⇒చంద్రబాబుకు పదవులపైనే ఎక్కువ ఆశ:ఎమ్మెల్యే నారాయణ స్వామి ⇒ఇద్దరు కాంట్రాక్టర్లను కేంద్రం వద్దకు పంపించి, ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారు. కేంద్రం ప్రకటనను బాబు ఎలా స్వాగతిస్తారు: ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా -
చర్చకు పట్టు, అసెంబ్లీ మళ్లీ వాయిదా
-
చర్చకు పట్టు, అసెంబ్లీ మళ్లీ వాయిదా
హైదరాబాద్ : ప్రతిపక్షం నిరసనలు, నినాదాలతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరోసారి వాయిదాపడింది. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబడుతుంటే...అధికార టీడీపీ హోదా అంశాన్ని పక్కనబెడుతూ సభను వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టడంతో సభ తొలుత పది నిమిషాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా వైఎస్ఆర్ సీపీ తన పట్టు వీడలేదు. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం ముందు బైఠాయించిన నిరసన తెలిపారు. చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన విరమించి, సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ సూచించారు. దీంతో గందరగోళం మద్యే సభ మళ్లీ వాయిదా పడింది. -
ప్రత్యేక హోదాపై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ
-
ప్రత్యేక హోదాపై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ
హైదరాబాద్ : ప్రత్యేక హోదా అంశంపై గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. దీంతో సమావేశాలు ప్రారంభం అయిన కొద్దిసేపటికే 10 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. అంతకు ముందు ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో పట్టుబట్టింది. ఇదే అంశంపై వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిర్కరించిన విషయం తెలిసిందే. హోదాపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. 344 కింద చర్చకు పట్టుబట్టారు. అయితే జీఎస్టీ బిల్లు తర్వాతే చర్చిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాలు పాటు వాయిదా వేశారు. -
ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఆందోళనలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం దద్దరిల్లింది. ఎమ్మెల్యే ఆర్కే రోజా విషయంలో న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు ఎంతకూ వెనక్కి తక్కకపోవడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ సభ మూడోసారి ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. రోజాను సభకు అనుమతించాలంటూ నినాదాలు చేయగా పరిస్థితిని కంట్రోల్ చేయలేని పక్షంలో సభను సోమవారానికి వాయిదావేశారు. అంతకుముందు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సభకు నల్ల దుస్తులతో వచ్చి తమ నిరసన తెలిపారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం, రోజాను ఎందుకు అనుమతించడం లేదంటూ పదే పదే అడుగుతున్న క్రమంలో రెండు సార్లు సభ వాయిదా పడిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ సోమవారానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. అంతకుముందు వరుసగా రెండుసార్లు వాయిదా పడిన తర్వాత తిరిగి సమావేశమైనప్పుడు కూడా సభలో గందరగోళం నెలకొంది. రోజాపై సస్పెన్షన్ ఎత్తేయాలని విపక్షం ఎంతగా పట్టుబట్టినా అధికారపక్షం వినిపించుకోలేదు. ఈ గందరగోళం నడుమే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయం పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తమ నినాదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో అధికార పక్షం నుంచి సభను నియంత్రించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. కానీ విపక్షం తన పట్టు వీడకపోవడంతో.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను సోమవారానికి వాయిదా వేశారు. -
కొనసాగుతున్న వాయిదాల పర్వం
ఏపీ అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం మీద చర్చకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడం, అధికార పక్షం దానికి ససేమిరా అనడంతో ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి రెండుసార్లు పదేసి నిమిషాల చొప్పున సభ వాయిదా పడింది. తొలిసారి సభ పది నిమిషాలే వాయిదా పడినా.. దాదాపు అరగంట తర్వాత గానీ తిరిగి సమావేశం కాలేదు. సమావేశమైన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టడం, స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో స్పీకర్ సభను మరోసారి పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అంతకుముందు, కెమెరాకు అడ్డుగా నిలబడి ప్రత్యక్ష ప్రసారాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ ఎమ్మెల్యే డి.రాజాకు హెచ్చరిక చేశారు. -
సభలో గందరగోళం: అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా
హైదరాబద్: కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ప్రతిపక్షం అంబేద్కర్‌ను అవమానిస్తోందని, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య హక్కులను అందరికీ కల్పించారని రావెల కిశోర్ బాబు అన్నారు. అపర బాంధవుడు అంబేద్కర్ గురించి చర్చించాలని బీఏసీలో ఆలోచించిన తర్వాత అంబేద్కర్‌పై చర్చకు ఇష్టపడటం లేదంటే దళిత జాతిని, అంబేద్కర్‌ను అవమానిస్తున్నారని ఆరోపించారు. సభలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కాల్‌మనీపై చర్చ జరగడానికి దమ్ము లేదని, అందులో నేరస్థులంతా మీవాళ్లేనని ఆరోపించారు. ఈ సమయంలో ఆయన మైకును కట్ చేసిన స్పీకర్.. అసెంబ్లీని పది నిమిషాల పాటు వాయిదా వేశారు. -
మాఫీపై తేల్చకుండానే వాయిదానా?
- శాసనసభ ఎదుట బైఠాయించిన విపక్ష ఎమ్మెల్యేలు - సర్కారు సభ నుంచి పారిపోయిందంటూ ధ్వజం - నేతల అరెస్టు, పోలీస్‌స్టేషన్‌కు తరలింపు సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేశారంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ శాసనసభ్యులు గురువారం సభ వాయిదా పడిన వెంటనే అసెంబ్లీ నుంచి ప్రదర్శనగా గన్‌పార్కు తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం వెళ్లేందుకు ప్రయత్నించారు. దాన్ని పోలీసులు వమ్ము చేయడంతో రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయకుండా సభను వాయిదా వేసుకుని ప్రభుత్వం పారిపోయిందని, రైతుల ఆత్మహత్యలపై బాధ్యతారహితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రైతు ఆత్మహత్యలను ఆపాలని, ఏకమొత్తంగా రుణమాఫీ చేయాలని నినదించారు. ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేఎల్పీ నాయకుడు కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు వివేకానంద, రాజేందర్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీపీఎం నేత సున్నం రాజయ్య, సీపీఐ నేత రవీంద్రకుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.జీవన్ రెడ్డి, జె.గీతారెడ్డి, జి.చిన్నారెడ్డి, డి.కె.అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్, పద్మావతి, వంశీచంద్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, రాజాసింగ్ తదితరులు 20 నిమిషాలకు పైగా రోడ్డుపైనే ఆందోళన చేశారు. దాంతో పోలీసులు మరోసారి రంగప్రవేశం చేసి వారందరినీ అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. నేతల సంఘీభావం అరెస్టయిన ఎమ్మెల్యేలను నాంపల్లి పోలీసుస్టేషన్లలో సుమారు 2 గంటలపాటు ఉంచారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీలు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. సభలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నియంతృత్వ పోకడలతో పోతోందంటూ మండిపడ్డారు. రెండో రోజూ ‘విపక్ష ఐక్యత’ రుణమాఫీ అంశంపై ప్రతిపక్షాలు రెండోరోజూ ఐక్యంగా కదిలాయి. నిర్దిష్టమైన హామీ ఇవ్వాల్సిందేనంటూ బుధవారం రాత్రి సభలోనే బైఠాయించిన విపక్షాలు, గురువారం కూడా సభ ప్రారంభం కాగానే అదే ఐక్యతను ప్రదర్శించాయి. ఎంఐఎం మినహా విపక్షాలన్నీ ఐక్యంగా రోడ్డెక్కడంతో కాంగ్రెస్‌లోనూ నూతనోత్తేజం కనిపించింది. ఇంత దుర్మార్గమా?: జానా, జీవన్ రూ.లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చండని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా బాధ్యత నుంచి తప్పించుకుని పారిపోతున్నదని సీఎల్పీ నేత జానారెడ్డి, ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారుకు పట్టడం లేదన్నారు. ‘‘సభను అర్ధంతరంగా వాయిదా వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రుణమాఫీ చేసేదాకా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. వదిలే ప్రసక్తే లేదు’’ అని హెచ్చరించారు. ప్రశ్నించిన ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం, మార్షల్స్‌తో సభ నుంచి బయటకు పంపడం దారుణమని వారు విమర్శించారు. -
ఎమ్మెల్యేల అరెస్టు.. స్టేషన్‌కు తరలింపు
తెలంగాణ అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేయడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. గన్ పార్కు ఎదుట ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఏకమొత్తంగా రుణమాఫీ చేయమంటే సభను వాయిదా వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రతిపక్షాల ఐక్యపోరాటం కొనసాగుతుందని అన్ని పక్షాల నేతలు చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రైతు రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇవ్వలేదని మండిపడ్డారు. అర్ధాంతరంగా సభను వాయిదా వేయడం నిరంకుశ పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, వామపక్షాల సభ్యులు గన్‌పార్కు వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. -
ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రోజులపాటు కొనసాగిన సమావేశాల్లో 9 బిల్లులు ఆమోదం పొందాయి. మొత్తం 20 గంటల 39 నిమిషాలపాటు సమావేశాలు కొనసాగాయి. రెండు వాయిదాల తర్వాత సమావేశమైన అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులిద్దరూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రవేశపెట్టారు. ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాసిన లేఖలో స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారని, ఆయనపై చర్య తీసుకోవాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే జయ నాగేశ్వరరావు, అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో అతికించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని టీడీపీ సభ్యురాలు అనిత సభా హక్కుల ఉల్లంఘన నోటీసిచ్చారు. ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ... ఓటుకు కోట్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పొడియం చుట్టుముట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన రెండు నోటీసులను ప్రివిలేజ్ కమిటీకి నివేదిస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేశారు. మరో వైపు ఇవాళ జరిగిన సమావేశాలకు ముఖ్యమంత్రి దూరంగా ఉన్నారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌కే ఆయన పరిమితమైయ్యారు. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు ప్రత్యేక హోదా తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారానికి వాయిదా వేశారు. కాగా రెండోరోజు కూడా సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి. -
డ్వాక్రా, రుణమాఫీపై పట్టు, సభ వాయిదా
-
డ్వాక్రా, రుణమాఫీపై పట్టు, సభ వాయిదా
హైదరాబాద్ : ప్రతిపక్షం నిరసనలు, నినాదాలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. డ్వాక్రా, రుణమాఫీపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టింది. మరొక రోజులో సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి డ్వాక్రా, రైతు రుణమాఫీపై చర్చించాలంటూ నినాదాలు చేశారు. అయితే ఇప్పటికే ఆ అంశంపై సభలో చర్చ జరిగిందని, ఒకవేళ చర్చించాలంటే తీర్మానం ఇవ్వాలని స్పీకర్ సూచించారు. అయినా విపక్ష సభ్యులు తమ పట్టువీడలేదు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలు మాట్లాడటానికే అసెంబ్లీ ఉందన్నారు. -
అలాంటప్పుడు పిల్ల కాంగ్రెస్ ఎవరు?
-
అలాంటప్పుడు పిల్ల కాంగ్రెస్ ఎవరు?
హైదరాబాద్ : తల్లి, పిల్ల కాంగ్రెస్ వ్యాఖ్యలతో బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడింది. టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి తల్లి-పిల్ల కాంగ్రెస్ అంటూ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తామెన్నడూ అధికారంలో లేకున్నా ప్రతిసారి అధికార పక్ష సభ్యులు తమని ఆపాదిస్తున్నారన్నారు. చంద్రబాబుకు మందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని కిరణ్ సర్కార్‌కు అసెంబ్లీ సాక్షిగా మద్దతునిచ్చి ఆనాటి కాంగ్రెస్ సర్కార్‌ను నిలబెట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే 33 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారని గుర్తుచేశారు. అలాంటప్పుడు పిల్ల కాంగ్రెస్ ఎవరని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ సమాధానంతో టీడీపీ ఇరకాటంలో పడింది. -
'నరేంద్రగారు మాకు పాఠాలు చెప్పొద్దు'
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా ప్రతిపక్షం అడ్డుపడుతోందని ప్రభుత్వ విప్ ధూళిపాళ్ల నరేంద్ర చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ ఉపనేత జ్యోతుల నెహ్రు అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేంద్రగారు మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, సభలో ప్రతిపక్షం అభ్యర్థనలను ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్లే సభ నుంచి తాము మంగళవారం వాకౌట్ చేశామన్నారు. అధికారపక్షం ఏకపక్ష ధోరణితో వెళుతోందని, రెండు చేతులు కలిస్తేనే చప్పళ్లు వస్తాయని, సమస్యలు లేవనెత్తితే తమపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని జ్యోతుల నెహ్రు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభ వ్యవహారాలను చూస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. కాగా అంతకు ముందు ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ సభలో ప్రతిపక్షతీరు సరిగ్గా లేకనే సభ జరగడంలేదని అన్నారు. వివరణపై సమాధానం చెప్పకముందే ప్రతిపక్షం సభనుంచి వాకౌట్ చేసిందన్నారు. -
రెండు నిమిషాలు మైక్ ఇచ్చే బదులు...
హైదరాబాద్ : రెండు నిమిషాలు మైక్ ఇస్తే చాలు తమ అభిప్రాయం చెప్తామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావును అభ్యర్థించారు. రెండు నిమిషాలు మైక్ ఇచ్చే బదులు... సభా సమయాన్ని వృధా చేయడమెందుకన్నారు. కావాలంటే సమయం చూసుకొని రెండు నిమిషాలు సమయం ఇవ్వాలన్నారు. అంతకు ముందు తొమ్మిదిమంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ సభాపతిపై మాట్లాడారనే ఆరోపణపైనే ఇప్పటికే ఎనిమిది మంది శాసనసభ్యులను మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారని, మళ్లీ అదే సభ్యలపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. -
స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నా: వైఎస్ జగన్
-
స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నా: వైఎస్ జగన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చర్చను స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెండోసారి వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే రాజధానిపై చర్చకు అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేయగా అందుకు స్పీకర్ నిరాకరించారు. కాగా అంతకు ముందు రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సమీకరణ అంశంపై శాసనసభ దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దాంతో సభ రెండు సార్లు వాయిదాపడింది. బుధవారం సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో రైతులను భయభ్రాంతులకు గురిచేశారని, వారిపై విపరీతమైన ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా భూసమీకరణ చేశారని ఆ పార్టీ ఆరోపించింది. తక్షణమే ఈ కీలక అంశంపై చర్చించాలని పట్టుబట్టింది. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో... వైఎస్ఆర్ సీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టడంతో సభ తొలిసారి వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా వైఎస్ఆర్ సీపీ సభ్యులు చర్చకోసం పట్టుబట్టారు. గతంలో రాజధాని అంశంపై చర్చ జరిగిందని, ఇప్పుడు కూడా చర్చించడానికి సిద్ధమేనని ప్రభుత్వం తరఫున మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అయితే ఎప్పుడు చర్చించేదన్న సమయాన్ని కచ్చితంగా చెప్పాలని, ఆ మేరకు సభాకార్యక్రమాల్లో సమయం నిర్ధారించాలని వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టింది. రాజధాని ప్రాంతంపై ప్రభుత్వం చెప్పేదానికీ, వాస్తవ పరిస్థితులకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని, వీటిని సభ దృష్టికి తీసుకురావాల్సిందేనని స్పష్టం చేసింది. అత్యంత కీలక అంశం అయినందున దీనిపై చర్చించాలని గట్టిగా పట్టుబడుతూ మరోసారి సభను అడ్డుకుంది. దీంతో సభ రెండోసారి వాయిదా పడింది. అనంతరం స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారంటూ 9మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ ఎమ్మెల్యే అనిత నోటీస్ ఇచ్చారు. దీనిపై మరోసారి సభలో గందరగోళం నెలకొంది. -
రాజధానిపై రగడ, సభ వాయిదా
హైదరాబాద్ : రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం రగడ చోటుచేసుకుంది. దాంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది. కాగా రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డు కాదని, అయితే రాజధాని పేరుతో బలవంతపు భూ సేకరణను ఆ పార్టీ తప్పుబడుతోంది. ఇదే అంశాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ..ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే ఈ అంశంపై సభలో చర్చ ముగిసిందని స్పీకర్ తెలిపారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు నిరసనకు దిగారు. బలవంతపు భూసేకరణ అంశంపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...రాజధాని భూసేకరణపై అసెంబ్లీలో చర్చ జరపాలని పదేపదే స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యలపై చర్చకు అనుమతించాలని జగన్ పట్టుబట్టారు. దీనిపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుని ప్రజా రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షం సహకరించాలన్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు ఒక్క రైతు కూడా మద్దతు తెలపలేదన్నారు. వివాదం లేని అంశాన్ని వివాదం చేయాలని ప్రతిపక్షం చూస్తోందని మరోమంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీంతో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను మరో 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. -
రాజధానిపై రగడ, సభ వాయిదా
-
'నరేంద్రగారు మాకు పాఠాలు చెప్పొద్దు'
-
సమయం ఎప్పుడు కేటాయిస్తారు: వైఎస్ జగన్
హైదరాబాద్ : రాజధాని ప్రాంతంలో బాధలపై శాసనసభలో చర్చ జరగకపోతే ఎలా అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలోఆయన మాట్లాడుతూ సీఆర్డీఏ బిల్లుపై మాత్రమే గత అసెంబ్లీలో చర్చ జరిగిందన్నారు. రైతులు, కూలీ రైతులు, కౌలు రైతుల గురించి చర్చించకుంటే ఎలా అని అన్నారు. గత సమావేశాల్లో రైతులు, రైతుకూలీలు, కౌలు రైతుల గురించి చర్చ జరగలేదన్నారు. ఈ అంశంపై చర్చకు ఎప్పుడు సమయం ఇస్తారో దయ ఉంచి చెప్పాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరారు. రాజధాని అంశంపై మార్చి 16, 2015న 344 కింద చర్చకు అడిగామని ఆయన తెలిపారు. అందుకు సంబంధించి జిరాక్స్ కాపీలను సభకు చూపించారు. -
ఎప్పుడు సమయం కేటాయిస్తారు: వైఎస్ జగన్
-
చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, అసెంబ్లీ వాయిదా
హైదరాబాద్ : విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడ్డాయి. ఏపీ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. అంతకు ముందు ఇదే అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దాంతో కీలక అంశంపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు తమ పట్టు వీడలేదు. దాంతో స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు. మరోవైపు ప్రతిపక్షం సభను జరగనివ్వకుండా విలువైన సమయాన్ని వృధా చేస్తోందంటూ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఏ సమస్యపైనా అయినా చర్చించేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కూడా సమావేశాలకు సహకరించాలని ప్రతిపక్షాన్ని విజ్ఞప్తి చేశారు. -
గంటలోనే రెండుసార్లు వాయిదా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గంటలోనే రెండుసార్లు వాయిదా పడ్డాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై విపక్షం నిరసనలు, ఆందోళనలతో ఏపీ అసెంబ్లీ మంగళవార దద్దరిల్లింది. ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలతో సభను హోరెత్తించారు. ఇదే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన విషయం తెలిపిందే. వాయిదా తీర్మానంపై చర్చకు ప్రతిపక్షం పట్టుబట్టడంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దాంతో స్పీకర్ తొలుత సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా వైఎస్ఆర్ సీపీ సభ్యులు తమ పట్టువీడలేదు. చర్చకు అనుమతించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు జోక్యం చేసుకుని బడ్జెట్ సమావేశాల్లో వాయిదా తీర్మానాలకు అనుమతించరని తెలిపారు. ఛార్జీల పెంపుపై సభలో సీఎం ప్రకటన చేసేందుకు సిద్ధమేనని, అయితే చర్చకు మాత్రం అనుమతించేది లేదన్నారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో స్పీకర్ మరో 15 నిమిషాలు అసెంబ్లీని వాయిదా వేశారు. -
వాదన పూర్తి కాకుండానే.. వాయిదా!
-
వాదన పూర్తి కాకుండానే.. వాయిదా!
పట్టిసీమ ప్రాజెక్టు గురించి చర్చలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం పూర్తి కాకుండానే సభ వాయిదా పడింది. పట్టిసీమ ప్రాజెక్టు గురించిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అవకాశం లభించగా.. ఆల్మట్టి విషయంలో చంద్రబాబు చెప్పిన అసత్యాలను ఆయన కడిగి పారేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తయిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే.. సుప్రీంకోర్టుకు వైఎస్ రాజశేఖర రెడ్డి సమర్పించిన వివరాలను, అందులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నివేదిక లోని 5సి భాగం గురించి ప్రస్తావించి సాక్ష్యాధారాలతో ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఆ సమయంలో మధ్యలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఆయన తాము ప్రాజెక్టులను పూర్తిచేస్తామంటూ తనదైన శైలిలో మాట్లాడి కూర్చున్నారు. ఆ తర్వాత స్పీకర్ తనకు గవర్నర్ నరసింహన్ నుంచి లేఖ వచ్చిందంటూ.. తన ప్రసంగానికి అసెంబ్లీ ధన్యవాదాలు తెలిపిన అంశాన్ని గవర్నర్ ప్రస్తావించారని చదివి వినిపించారు. అనంతరం అసెంబ్లీని గురువారానికి వాయిదా వేశారు. వాస్తవానికి అంతకుముందే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులిచింతల గురించి మాట్లాడబోతుండగా.. పట్టిసీమ గురించి మాట్లాడాలని, చర్చను డైవర్ట్ చేయొద్దని సూచించారు. కానీ.. చివరకు ఆ పట్టిసీమ గురించి కూడా మాట్లాడే అవకాశం ప్రతిపక్ష నాయకుడికి లభించకుండానే అసెంబ్లీ గురువారానికి వాయిదా పడిపోయింది. -
ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు అసెంబ్లీలో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అంశాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. -
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఈరోజు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. తమ వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలని విపక్షం డిమాండ్ చేసింది. అయితే చర్చకు సిద్ధమన్న ప్రభుత్వం మరో ఫార్మెట్లో రావాలని సూచించింది. తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్షమిచ్చిన వాయిదా తీర్మానాల్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. చాలా ముఖ్యమైన రైతు సమస్యలపై తాము తీర్మానాలు ఇచ్చామని, వాటిని తిరస్కరించడం భావ్యం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి వచ్చారు. రైతు సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు కార్యక్రమం చేపట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత టీ బ్రేక్ కోసం సభను పది నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత ప్రారంభమైన సభ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ చేపట్టింది. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించారు. అనంతరం కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించింది. అనంతరం మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ఫలితం లేకపోవటంతో ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనంతరం స్పీకర్ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. -
ఏపీ ఉభయసభలు సోమవారానికి వాయిదా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మరోవైపు సభ నిర్వహణ అంశాలపై సభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) ఉదయం పది గంటలకు సమావేశం కానుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే అవకాశాలున్నాయి. బడ్జెట్‌ను 12వ తేదీన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు.ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 13న సభకు సమర్పిస్తారు. సెలవుదినాలు పోను సభ 16 రోజులు జరిగే అవకాశముంది. -
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారానికి వాయిదా పడింది. హుద్‌హుద్ తుపానుపై తీవ్రస్థాయిలో వాడివేడిగా చర్చలు జరిగిన అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన తర్వాత అసెంబ్లీని శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. అంతకుముందు ఉత్తరాంధ్రలో వచ్చిన హుద్‌హుద్ తుపాను విలయంపై సభలో విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేరు కాబట్టి, ఇది ముఖ్యమైన అంశం అయినందున దీనిపై రేపు చర్చిద్దామని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించినా, అధికారపక్షం ఏమాత్రం పట్టించుకోకుండా తమకు తోచిన రీతిలో చర్చను ఏకపక్షంగా నడిపించేసింది. -
‘మెట్రో’ మార్పుపై చర్చకు బీజేపీ పట్టు
మద్దతు తెలిపిన టీడీపీ రెండుసార్లు అసెంబ్లీ వాయిదా సాక్షి, హైదరాబాద్: మెట్రోరైల్ అలైన్మెంట్ మార్పుపై ఇచ్చిన వాయిదా తీర్మానంమీద చర్చకు గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో భారతీయ జనతాపార్టీ పట్టుబట్టింది. శాసనసభలో తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాకే ప్రశ్నోత్తరాలను తీసుకోవాలన్న బీజేపీ డిమాండ్‌కు స్పీకర్ మధుసూదనాచారి అంగీకరించకపోవడంతో సభ రెండుమార్లు వాయిదా పడింది. బీజేపీకి టీడీపీ సభ్యులు మద్దతు తెలపడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మెట్రోరైల్ అలైన్మెంట్ మార్పుపై జంట నగరాల పరిధిలోని అన్ని పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించాకే ఎలాంటి నిర్ణయమైనా ఉంటుందని చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఉదయం సభ ప్రారంభంకాగానే బీజేపీ సభ్యులు మెట్రోరైల్ అలైన్‌మెంట్‌పై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ పట్టుబట్టారు. మెట్రోరైల్‌పై పలు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను ప్రదర్శించారు. వీరికి టీడీపీ సభ్యులు మద్దతు తెలుపుతూ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. ఈ సమయంలో సభా వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీష్‌రావు జోక్యం చేసుకొని, ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని సూచించారు. అయినా సభ్యులు పట్టువీడకపోవడంతో ప్రశ్నోత్తరాల్లోని ఐఎంజీ భూముల అంశాన్ని తప్పించుకునేందుకే బీజేపీ, టీడీపీలు సభను అడ్డుకుంటున్నారని అన్నారు. ఇదే సమయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ‘నిన్న పొన్నాల లక్ష్మయ్య బండా రం బయటపడింది. నేడు చంద్రబాబు సంగతి బయటపడుతుందనే నాటకాలు ఆడుతున్నారు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో సభలో మరింత గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల నినాదాలమధ్య స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. తర్వాత కూడా పరిస్థితిలో మార్పులేకపోవడంతో సభను మరో పది నిమిషాలు వాయిదా వేశారు. అన్ని పక్షాలతో చర్చించి నిర్ణయం: సీఎం సభ తిరిగి ప్రారంభం అయ్యాక సైతం బీజేపీ, టీడీపీలు తమ ఆందోళనపై వెనక్కి తగ్గలేదు. దీంతో సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ‘గ్రీన్‌ల్యాండ్స్-జూబ్లీహిల్స్ మెట్రోరైల్ మార్గంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. దీనిపై సీఎస్ సహా ఇతర అధికారులతో చర్చిస్తున్న సమయంలోనే ఓ శాసనసభ్యుడు యాదృచ్ఛికంగా అక్కడ ఉన్నారు తప్పితే, చర్చల్లో పాల్గొనలేదు. శాసనసభ మీదుగా అమరుల స్తూపంపై పోతున్న లైను, సుల్తాన్ బజార్‌ను ధ్వంసం చేసే ఉమెన్స్ కాలేజీ లైను, పాతబస్తీ ప్రార్థనా మందిరాల గుండాపోతున్న లైన్లపై మార్పు చేద్దామని ఆలోచనలు చేస్తున్నాం. శాసనసభ ముగిశాక దీనిపై జంట నగరాల అన్ని పార్టీల శాసనసభ్యులతో సమావేశంపెట్టి ఎల్అండ్టీ సంస్థతో మాట్లాడి నిర్ణయం చేద్దాం’ అని సూచించారు. సీఎం ప్రకటనతో ఇరుపార్టీల సభ్యులు శాంతించారు. నేడు బడ్జెట్‌కు ఆమోదం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌కు శుక్రవారం శాసనసభ ఆమోదం తెలపనుంది. జూన్ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చేసిన వ్యయానికి, డిసెంబర్ రెండో తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు నిధుల వ్యయం కోసం ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకు వస్తోంది. మొత్తం రూ. 1,00,648 కోట్లకు శాసనసభ ఆమోదం తెలపాల్సి ఉంది. శుక్రవారం శాసనసభ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే దానిని గవర్నర్ నరసింహన్ అనుమతి కోసం పంపిస్తారు. గవర్నర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే.. ఆర్థిక శాఖ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం, నిధుల వినియోగానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ఉత్తర్వుల జారీ అనంతరం డిసెంబర్ రెండో తేదీ నుంచి శాసనసభ ఆమోదించిన మేరకు నిధులు వినియోగించుకోవడానికి వీలవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి బడ్జెట్‌నే లక్ష కోట్లకు పైగా పెట్టడం గమనార్హం. -
భూములపై అసెంబ్లీలో గందరగోళం
భూకేటాయింపులపై తెలంగాణ అసెంబ్లీలో గందరగోళంతో చెలరేగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తర్వాత స్పీకర్ టీడీపీకి అవకాశం ఇవ్వగా.. రేవంత్‌రెడ్డి లేచి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే, క్షమాపణలు చెప్పకుండా రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడుతారంటూ టీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తీవ్ర గందరగోళం చెలరేగడం, ఎంత ప్రయత్నించినా సభ అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, గత కాంగ్రెస్ సర్కారు తప్పు చేసిందని ఎక్కడా అనలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు బహిరంగ వేలం వేయగా, ఆ వేలంలో డీఎల్ఎఫ్ మాత్రమే పాల్గొందని ఆయన చెప్పారు. ఆరోపణల్లో అబద్ధాలు ఉన్నాయని మాత్రమే తాను అన్నానని, స్పీకర్ ఆదేశిస్తే మొత్తం ఫైళ్లన్నీ సభ ముందు పెడతానని కేసీఆర్ తెలిపారు. సాధారణంగా ఎవరూ నోట్‌ఫైళ్లను సభ ముందుకు తీసుకురారని, కానీ స్పీకర్ అడిగితే వాటిని కూడా సభముందు ఉంచుతానని చెప్పారు. ఏపీఐఐసీ చేసిన పొరపాట్ల వల్ల లోపాలు జరిగాయని అన్నానని, ఓ మంత్రి రాసిన నోట్‌ఫైల్ సభ ముందు పెట్టడం సభ్యత కాదని తెలిపారు. పూర్వాంకర్ అనే సంస్థ ఇప్పుడు హైకోర్టులో కేసు వేసిందని, నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో లోపం వల్లే ఈ భారం పడుతోందని చెప్పారు. వాళ్ల వాదన నెగ్గితే వడ్డీతో కలిపి రూ. 900 కోట్లు కట్టాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల మనసు గాయపడేలా ఒక్క మాట కూడా మాట్లాడబోనని, అయితే భట్టివిక్రమార్క చెప్పినట్లుగా సభా నాయకుడిగా సంయమనం పాటించేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తానని కేసీఆర్ వివరించారు. -
భూములపై అసెంబ్లీలో గందరగోళం
-
పార్టీ ఫిరాయింపులపై దద్దరిల్లిన అసెంబ్లీ
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల అంశంపై మంగళవారం తెలంగాణ శాసనసభ దద్దరిల్లింది. దాంతో అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగింది. సభలో ప్రశ్నోత్తరాలు పూర్తి కాకుండానే సభ రెండు సార్లు పదినిమిషాల పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభప్రారంభమైన తర్వాత బడ్జెట్ పద్దులపై చర్చను చేపట్టాలని స్పీకర్ మధుసూదనాచారి ఆదేశించారు. కాంగ్రెస్ సభ్యులు మాత్రం పార్టీ ఫిరాయింపుల అంశంపై చర్చను చేపట్టాలని ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోలేదు. మరోవైపు ప్రభుత్వానికి అర్హత ఉందా? లేదా? అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యులు పట్టు వీడక పోవడంతో సభ రెండో సారి 10 నిమిషాలపాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం విపక్ష సభ్యులు తమ పట్టువీడకపోవటంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేయాలని హరీశ్‌రావు ప్రతిపాదించగా స్పీకర్ ఆమోదించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి మినహా 14మంది కాంగ్రెస్ సభ్యులపై ఒకరోజుపాటు సస్పెన్షన్ వేటు పడింది. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ పద్దులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
తీర్మానాలపై చర్చకు విపక్షాలు పట్టు, అసెంబ్లీ వాయిదా
-
తీర్మానాలపై చర్చకు విపక్షాలు పట్టు, అసెంబ్లీ వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సోమవారం ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసుదనాచారి తిరస్కరించారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చించాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దాంతో ఈ అంశాన్ని ప్రశ్నోత్తరాల అనంతరం చర్చిద్దామని స్పీకర్ సూచించారు. అయినా కాంగ్రెస్ సభ్యులు తమ పట్టువీడకుండా వెల్‌లోకి దూసుకెళ్లి , పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. -
టీడీపీ సభ్యుల నిరసన, అసెంబ్లీ వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించటంపై తెలంగాణ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. తెలంగాణలో పంటలు ఎండిపోవటానికి చంద్రబాబే కారణమన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలంలో విద్యుత్ ప్రారంభిస్తే యాగీ చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించగా, ఆయన ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. స్పీకర్ మధుసూదనాచారి వారించినా టీడీపీ సభ్యులు తమ నిరసన కొనసాగిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ అనుమతితోనే తాను మాట్లాడుతున్నానని కేసీఆర్ అన్నారు. దాంతో అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలగటంతో స్పీకర్ సమావేశాలను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. -
తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. విపక్షాలు నిరసనలతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు రైతుల ఆత్మహత్యలపై చర్చకు పట్టుబట్టాయి. అయితే ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం చర్చిద్దామని స్పీకర్ సూచించినా విపక్ష సభ్యులు పట్టువీడలేదు. తెలంగాణ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు తమ పట్టువీడలేదు. దాంతో సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినా విపక్షాలు నిరసన కొనసాగించారు. దాంతో స్పీకర్ సభను మరోసారి పదినిముషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగారు. దాంతో సభకు ఆటంకం కలిగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. పది మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఒక్క రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ తీర్మానాన్ని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి హరీష్ రావు ప్రతిపాదించగా స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం ప్రారంభమైన సభలో బడ్జెట్‌పై చర్చ జరిగింది. బడ్జెట్‌పై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మాట్లాడిన తర్వాత స్పీకర్ మధుసుదనా చారి సమావేశాలను సోమవారానికి వాయిదా వేశారు. -
విపక్షాల నిరసన, అసెంబ్లీ రెండుసార్లు వాయిదా
-
విపక్షాల నిరసన, అసెంబ్లీ రెండుసార్లు వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల నిరసనల మధ్య శాసనసభ ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే రెండుసార్లు పది నిమిషాల పాటు వాయిదా పడింది. శుక్రవారం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు రైతుల ఆత్మహత్యలపై చర్చకు పట్టుబట్టాయి. చర్చ జరపాలంటూ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే బీఏసీ సమావేశం నిర్ణయం ప్రకారం ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాతే వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని స్పీకర్ మధుసుదనా చారి సూచించినా, విపక్ష సభ్యులు పోడియం చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభను స్పీకర్ పదినిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష సభ్యులు పట్టువీడకపోవటంతో స్పీకర్ మరోసారి సభను పది నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
అవసరమైతే 40 రోజులు చర్చిస్తాం:కేసీఆర్
హైదరాబాద్ : శాసనసభలో అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రైతు సమస్యలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే స్పీకర్ మధుసుదనా చారి ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. బీఏసీ నిర్ణయం ప్రకారం ప్రశ్నోత్తరాలు చేపట్టిన తర్వాత మిగతా అంశాలపై చర్చిద్దామని స్పీకర్ సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఏ సమస్యపైన అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విపక్షాలు ఆందోళన చేయటం తగదన్నారు. రైతుల ఆత్మహత్యలపై కూడా చర్చిస్తామని... ఇదే పద్ధతి అనుకుంటే ఏమీ చేయలేమన్నారు. వారం...పది రోజులు కాదని... అవసరం అయితే 40 రోజుల పాటు అన్ని సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు. చర్చకు తాము సిద్ధమన్నా విపక్షాలు తీరు మార్చుకోకుంటే ...వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. అయినా విపక్షాలు తమ పట్టువీడలేదు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ అసెంబ్లీని పదినిమిషాల పాటు వాయిదా వేశారు. -
అన్ని సమస్యలపై చర్చిస్తాం: కేసీఆర్
-
రాజధానిపై రగడ, పట్టువీడని వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గురువారం శాసనసభలో రగడ జరిగింది. రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనకు ముందే సభలో చర్చ జరగాలన్న ప్రతిపక్ష సభ్యుల డిమాండ్.. మరోవైపు ప్రభుత్వ విమర్శల మధ్య సభలో గురువారం తీవ్ర గందరగోళం ఏర్పడింది. మంత్రులు తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేయడంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగానే సభను 15 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. వాయిదా అనంతరం ప్రారంభం అయినా చర్చ జరగాల్సిందేనని వైఎస్ఆర్ సీపీ సభ్యులు తమ నిరసన కొనసాగుతోంది. -
చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, సభ వాయిదా
హైదరాబాద్ : శాసన సభ గురువారం ప్రారంభంతోనే పది నిమిషాలుపాటు వాయిదా పడింది. డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మాట తప్పుతోందని ప్రధాన ప్రతిపక్షం ఆక్షేపించింది. డ్వాక్రా మహిళల రుణాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజా, ఉప్పులేని కల్పన వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ ...వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి...ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే అత్యంత ముఖ్యమైన ఈ విషయంపై చర్చ జరగాలని ప్రధాన ప్రతిపక్షం కోరింది. చర్చకు స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మరో రూపంలో విషయాన్ని ప్రస్తావించాలని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో కాసేపు కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ప్రశ్నోత్తరాలు మొదలు పెట్టాలని స్పీకర్ సూచించారు. దీనిపై ఓవైపు సభ్యులు మాట్లాడుండగా.. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు నిరనస వ్యక్తం చేశారు. దీంతో సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. -
మూడుసార్లు వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం గందరగోళం నెలకొనటంతో సభ మూడుసార్లు వాయిదా పడింది. ఓవైపు అధికార పక్ష సభ్యుల అభ్యంతరాలు.. విమర్శలు.. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష సభ్యుల నిరసన మధ్య శాసనసభ ముచ్చటగా మూడుసార్లు వాయిదా పడింది. సభ్యుల నిరసనల, నినాదాల మధ్య తొలిగా పది నిమిషాలు, రెండోసారి పదిహేను నిమిషాలు, మూడోసారి కూడా పదిహేను నిమిషాలు వాయిదా పడటం విశేషం. అంతకు ముందు నిరసన సందర్భంగా అనైతికంగా ప్రవర్తించారంటూ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులను అసెంబ్లీ సమావేశాల వరకూ సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ మైక్ తొలగించడమే కాకుండా.. ఆయనపై దాడి చేసే యత్నం చేశారని మంత్రి ఆరోపించారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఆర్ శివప్రసాదరెడ్డి, ఎం మణిగాంధీని సస్పెండ్ చేయాలని తీర్మానించారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం నిరసన వ్యక్తం చేసింది. న్యాయం జరగాలంటూ నినదించింది. స్పీకర్ పోడియం చుట్టుముట్టి వుయ్ వాంట్ జస్టిస్ అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వని స్పీకర్
-
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వని స్పీకర్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జరిగే చర్చలో తమకు అవకాశం ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. అయినా స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. దాంతో ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయటంతో సభను స్పీకర్ పదినిమిషాలు వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ కోడెల ఏకపక్ష వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు ధరించి సభలకు హాజరయ్యారు. -
నేను తప్పన్నానా? సమాధానం చెప్పాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి శాంతిభద్రతలపై రగడ జరిగింది. దాంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. శనివారం సభలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం శాంతిభద్రతలపై చర్చ పునఃప్రారంభమైంది. చర్చ ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తాను ఎలాంటి పరుష పదజాలం వాడలేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై టీడీపీ సభ్యులు నిరసన తెలుపుతూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లి నినాదాలు చేశారు. దాంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. సభ్యుడు మాట్లాడేందుకు నిలబడి ఉన్నారని, ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరినా అధికార సభ్యులు ఏమాత్రం వినిపించుకోలేదు. దాంతో స్పీకర్ సభను పావుగంట వాయిదా వేశారు. -
సభ్యుల నిరసనలతో అసెంబ్లీ గంట వాయిదా
విపక్షాల నిరసనల మధ్య అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గంటపాటు వాయిదా పడ్డాయి. గురువారం సభ ప్రారంభం కాగానే వివిధ పార్టీలు ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. నేడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభకు రానున్న ఈ నేపథ్యంలో ఇరుప్రాంత సభ్యులు సభలో తమ ప్రాంతాలకు అనుకూలంగా పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తున్నారు. దాంతో వారిని ఎంత వారించిన వినకపోవడంతో శాసనసభను గంట పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకు ముందు విద్యుత్ చార్జీల పెంపు, అప్రకటిత విద్యుత్ కోతలపై సభలో చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం చేసింది. విద్యుత్ కోత, తాగు నీటి కొరతపై ఎంఐఎం, అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల పెంపుపై సీపీఐ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కాగా ద్రవ్య వినిమయ బిల్లును నేడు శాసనసభ ఆమోదించనుంది. అయితే గత రెండేళ్ల ప్రభుత్వ వ్యయాలపై ఆడిట్ రిపోర్టులను కాగ్ సభ ముందు ప్రవేశపెట్టింది. -
నిరసనలు, నినాదాలు, సభ వాయిదా
హైదరాబాద్ : సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాల మధ్య శాసనసభ సమావేశాలు గురురవారం ప్రారంభం అయ్యాయి. ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సభ గంటపాటు వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ఇరు ప్రాంతాల సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఆఖరి రోజు చర్చకు సమావేశాలను వినియోగించుకోవాలని స్పీకర్ సూచించినా ఫలితం లేకపోయింది. దీంతో సమావేశాలను సభాపతి గంటపాటు వాయిదా వేశారు. మరోవైపు తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది -
సభ్యుల నిరసనలపై స్పీకర్ అసహనం
హైదరాబాద్ : ఎప్పటిలాగానే ఆందోళనలు, నిరసనలు, నినాదాలతో హోరెత్తిన అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గంటపాటు వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో వాయిదా తీర్మానాలపై చర్చించాల్సిందేనంటూ పార్టీలకతీతంగా ఇరుప్రాంతాలకు చెందిన సభ్యులు స్పీకర్ పోడియంవద్ద ఆందోళనకు దిగడంతో..సభాకార్యకలాపాలు స్థంభించిపోయాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది. కనీసం ఈరోజు, రేపు చర్చల్లో పాల్గొని.. విభజనపై సభ్యులు తమ అభిప్రాయం చెప్పాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ప్రయోజన లేకపోయింది. ఇరుప్రాంతాల సభ్యుల నినాదాలతో.. సభలో ప్రతిష్ఠంభన నెలకొంది. లిఖితపూర్వకంగా అభిప్రాయాలు చెప్పాలనుకున్నవారు....ప్రతులను సమర్పించాలని కూడా స్పీకర్ విజ్ఞప్తి చేశారు. చర్చలో పాల్గొనే ఆసక్తిలేదా అంటూ స్పీకర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోటంతో గందరగోళం మధ్య సభను గంటపాటు వాయిదా వేశారు. -
పోటాపోటీ నినాదాలతో హోరెత్తిన సభ
హైదరాబాద్ : శాసనసభలో సోమవారం వాయిదాల పర్వం కొనసాగుతోంది. నినాదాలు, నిరసనలతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది. శాసనసభ ఈరోజు ఉదయం ప్రారంభమైన ఐదు నిమిషాలకే.. అరగంటపాటు వాయిదా పడింది. విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఓటింగ్ నిర్వహించవద్దని, సీఎం కిరణ్ ఇచ్చిన తీర్మానం నోటీసును అనుమతించకూడదని.. తెలంగాణ మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ సభ్యులు స్పీకర్ పోడీయంను చుట్టుముట్టడంతో.. సభలో గందరగోళం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోటాపోటీగా సమైక్యాంద్ర, తెలంగాణ నినాదాలతో అసెంబ్లి హోరెత్తింది. దీంతో సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సభను స్పీకర్ మరో గంట పాటు వాయిదా వేశారు. -
అసెంబ్లీ 17వ తేదీ వరకూ వాయిదా
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు ఈనెల 17వ తేదీ వరకూ వాయిదా పడ్డాయి. విభజన బిల్లుపై సభలో సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ప్రసంగం అనంతరం స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభను వాయిదా వేశారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విభజన బిల్లుపై సవరణల ప్రతిపాదన ఇవ్వలేదని సమాచారం. కాగా ఈరోజు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే సమైక్య తీర్మానం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. స్పీకర్ తిరస్కరించటంతో పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. అనంతరం విభజన బిల్లుపై చర్చను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ సభనుంచి వాకౌట్ చేసింది. -
సమైక్య నినాదాలతో మార్మోగుతున్న అసెంబ్లీ
-
నిరసనలు, నినాదాలు, అసెంబ్లీ వాయిదా
హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు ఆరో రోజు కూడా విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య ప్రారంభం అయ్యాయి. గురువారం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు సమైక్య తీర్మానం చేయాల్సిందేనంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. సమైక్య నినాదాలతో సభను హోరెత్తించారు. మరోవైపు తెలంగాణ ప్రాంత సభ్యులు కూడా స్పీకర్ పోడియం వద్దకు చేరి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సమైక్యంధ్రా, తెలంగాణ నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవటంతో స్పీకర్ సమావేశాలను అరగంట పాటు వాయిదా వేశారు. కాగా అసెంబ్లీ వాయిదా అనంతరం వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్‌తో చర్చలు జరుపుతున్నారు. గతంలో ఇచ్చిన సమైక్య తీర్మానం నోటీసు, విజయమ్మ లేఖపై వారు చర్చిస్తున్నారు. -
అయిదో రోజు సేమ్ సీన్ రిపీట్
-
అయిదో రోజు సేమ్ సీన్ రిపీట్
హైదరాబాద్ : అయిదో రోజు అదే తీరు.....అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. శాసనసభలో వరుసగా అయిదోరోజు కూడా తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. బుధవారం ఉదయం విపక్షాల నిరసనల మధ్యే అసెంబ్లీ ప్రారంభమైంది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ....విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలు తిరస్కరించారు. దాంతో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత సభ్యులు ఫ్లకార్డులతో స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలతో సభను హోరెత్తించారు. సభా సమయాన్ని ఉపయోగించుకుని, చర్చలో పాల్గొనాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లు ....తమ సభ్యులను వెనక్కి పిలవాలంటూ స్పీకర్ ఓ దశలో అసహనం వ్యక్తం చేశారు. సభా సమయాన్ని వృధా చేయటం సరికాదని, చర్చలో పాల్గొని అభిప్రాయాలు తెలపాలంటూ సభాపతి సూచించినా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో ఆయన సమావేశాలను గంటపాటు వాయిదా వేశారు. కాగా విపక్షాలు బుధవారం శాసనసభలో వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ....సమైక్య తీర్మానం చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చించాలని తెలుగుదేశం పార్టీ, పాలెం వోల్వో బస్సు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించాలంటూ సీపీఐ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. -
నినాదాలు, నిరసనలు, వాయిదాలు
హైదరాబాద్ : శాసనసభలో తీరు మారలేదు. నినాదాలు, నిరసనల మధ్య అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. సమైక్య నినాదాల మధ్య అసెంబ్లీలో ఎటువంటి చర్చ చేపట్టే పరిస్థితి లేకపోవడంతో డిప్యుటీ స్పీకర్ మల్లు భట్టీ విక్రమార్క సభను రేపటికి వాయిదా వేశారు. రెండుసార్లు వాయిదా పడిన అసెంబ్లీలో తర్వాత కూడా ఎటువంటి మార్పు లేకపోవడంతో సభ రేపటికి వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సమైక్య తీర్మానంపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సభలో గందరగోళం తలెత్తడంతో తొలుత స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా వాయిదా పర్వం చోటుచేసుకుంది. -
సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ
హైదరాబాద్ : సమైక్యాంధ్ర నినాదాలతో అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లాయి. జై సమైక్యాంధ్ర అన్న నినాదాల మధ్యనే సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సమైక్యాంధ్ర తీర్మానానికి పట్టుబడ్డారు. వాయిదా తీర్మానాలన్నీ తిరస్కరించిన స్పీకర్.. సభ్యులు ఎటువంటి సంప్రదాయాలను పాటించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ పదే పదే సభ్యులకు విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో పదిగంటలకు బీఏసీ భేటీ తర్వాత..సభ తిరిగి ప్రారంభమవుతుందని.. స్పీకర్ సభను వాయిదా వేశారు. సమైక్యతీర్మానం చేయాలన్న వైఎస్ఆర్సీపీ డిమాండ్‌తో .. వరుసగా మూడో కూడా సభ స్తంభించింది. సభలో ప్రతిష్ఠంభన తొలగించేందుకు ఎట్టకేలకు స్పీకర్ చొరవ చూపుతూ.. వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో.. బీఏసీ భేటీ నిర్వహించనున్నారు. గతంలో జరిగిన రెండు బీఏసీ భేటీల్లోకూడా.. సమైక్యాంధ్ర తీర్మానానికి పట్టుపట్టిన వైఎస్ఆర్సీపీ.. సమైక్య తీర్మానానికి ఆస్కారంలేదని సర్కారు చెప్పడంతో రెండుసార్లు బీఏసీ నుంచి వాకౌట్ చేసింది. శాసనమండలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
నిరసనలు, నినాదాలతో దద్దరిల్లాయి
-
నిరసనలు, నినాదాలతో దద్దరిల్లాయి
నినాదాలు, నిరసనల మధ్య దద్దరిల్లిన ఉభయసభలూ..ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. తొలుత రెండుసార్లు వాయిదాపడ్డ అసెంబ్లీ తిరిగి సమావేశమయ్యాక.. సభలో ఎటువంటి మార్పు లేకపోవడంతో.. డిప్యుటీ స్పీకర్ మల్లూ భట్టీవిక్రమార్క సభను సోమవారానికి వాయిదా వేశారు. శనివారం సమావేశాలు ప్రారంభం కాగానే ప్లకార్డులు చేతపట్టి.. స్పీకర్ పోడీయంను చుట్టుముట్టిన సభ్యులు .. సభను సాగనీయకుండా అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో శాసనసభ మారుమ్రోగిపోయింది. ఒకదశలో ప్లకార్డులు లోనికి తేవద్దని, స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. ఇటు పెద్దలసభలోకూడా ఇదే సీన్ కనిపించింది. ఇరుప్రాంతాల నేతలు నినాదాలు చేస్తూ..సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో.. వాయిదాపర్వం కొనసాగింది. ఆతరువాత ప్రారంభమైన మండలిలో.. నినాదాలు కొనసాగడంతో.. ఛైర్మన్ చక్రపాణి సభను సోమవారానికి వాయిదా వేశారు. -
తెలంగాణ, సమైక్య నినాదాలో హోరెత్తిన అసెంబ్లీ
హైదరాబాద్ : అసెంబ్లీలో రెండోరోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ హోరెత్తింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే శనివారం శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో ఇరు ప్రాంతాల సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభలో సమైక్య తీర్మానం పెట్టాలంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సమావేశాలను స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు. -
అసెంబ్లీ నేటి వాయిదా తీర్మానాలు
-
సమైక్య తీర్మానంపై దద్దరిల్లిన సభలు
హైదరాబాద్ : ఎటువంటి కార్యకలాపాలు సాగకుండానే ఉభయ సభలూ రేపటికి వాయిదా పడ్డాయి. నినాదాలు, నిరసనల మధ్య అసెంబ్లీ శుక్రవారం ప్రారంభమైంది. సమావేశాలు ప్రారంభమైన కాగానే రాష్ట్ర విభజనను తిరస్కరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. మరోవైపు స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టారు. సభను నడపకుండా అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు... ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్నికూడా అడ్డుకున్నారు. ప్రారంభమైన మూడు నిమిషాలకే అరగంట పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభమైన సభలోకూడా ఎటువంటి మార్పూ లేకపోవడంతో.. సభ మరో గంటపాటు వాయిదాపడింది. ఆతర్వాత ముచ్చటగా మూడోసారి శనివారానికి అసెంబ్లీ వాయిదా పడింది. అటు శాసనమండలిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సమైక్య తీర్మానంకోసం పట్టుబట్టిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడీయంను చుట్టుముట్టడంతో తొలుత అరగంటపాటు వాయిదాపడ్డ మండలి.. ఆతరువాత రేపటికి వాయిదా పడింది. -
తొలిరోజే వాడివేడిగా.... నినాదాలు, నిరసనలు
హైదరాబాద్ : శాసనసభ రెండోవిడత సమావేశాలు ప్రారంభం అయిన మూడు నిమిషాలకే అరగంటపాటు వాయిదా పడ్డాయి. శుక్రవారం సభ ప్రారంభం కాగానే రాష్ట్ర విభజనను తిరస్కరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తెలంగాణ, సమైక్య నినాదాలతో ఆందోళనకు దిగారు. సభ సజావుగా జరగడానికి సహకరించాల్సిందిగా స్పీకర్ సభ్యులను కోరారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు తమ ఆందోళనలను కొనసాగించారు. అయితే విపక్ష సభ్యుల నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించగా వైఎస్ఆర్ సీపీ సభ్యులు అడ్డుకున్నారు. దాంతో ప్రారంభమైన మూడు నిమిషాలకే అసెంబ్లీ అరగంటపాటు వాయిదా పడింది. కాగా రెండవ దఫా శీతాకాల సమావేశాలు తొలిరోజే వాడివేడిగా.... నినాదాలు, నిరసన మధ్య ప్రారంభమయ్యాయి. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తిస్తూ నిరసనలు తెలిపారు. దాంతో అసెంబ్లీ మరోసారి గంట పాటు వాయిదా పడింది. -
జనవరి 3వరకు శాసనసభ వాయిదా
హైదరాబాద్ : గందరగోళం మధ్య అసెంబ్లీ సమావేశాలు జనవరి 3వ తేదీకి వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతంలో సమావేశమైన సభ...ఒక్క నిమిషంలోనే ముగిసింది. స్పీకర్ సభలోకి వచ్చేసరికే సభ్యులంతా పోడియంను చుట్టుముట్టారు. జైసమైక్యాంధ్ర నినాదాలతో సభ మార్మోగిపోయింది. ఈ దశలో సభను వచ్చేనెల మూడు వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మరో వైపు జనవరిలో జరిగే సమావేశాలను అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. జనవరి మూడు నుంచి 10 వరకు, తర్వాత జనవరి 16 నుంచి 23 వరకూ మలిదఫా సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు. ఆదివారాలు, సంక్రాంతి సెలవు దినాలను మినహాయిస్తే సభ మొత్తం మలివిడతలో 13 రోజులు సాగనుంది. కాగా ఈరోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. సరిగ్గా నిమిషం పాటు సభ సాగింది. స్పీకర్ సభలోకి వచ్చేటప్పటికీ సభ్యులంతా పోడియంను చుట్టుముట్టారు. జైసమైక్యాంధ్ర నినాదాలతో సభ మార్మోగిపోయింది. విపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. విభజనకు సంబంధించి ఆవేదన ఉంటుందని... దాన్ని వ్యక్తం చేసేందుకు సమయం ఇస్తామని స్పీకర్ సభ్యులను సముదాయించే ప్రయత్నం చేశారు. దయచేసి సభ సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాని సభ్యులెవ్వరూ శాంతించకపోవడంతో... స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. -
క్యాలీఫ్లవర్లతో సభకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : శాసనసభలో గురువారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన రెండు నిమిషాల్లోనే గంటపాటు వాయిదా పడింది. స్పీకర్ సభలోకి వచ్చేసరికే ఇరుప్రాంతాల సభ్యులంతా పోడియం చుట్టుముట్టారు. తెలంగాణ, జైసమైక్యాంధ్ర నినాదాలతో సభ మార్మోగిపోయింది. విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించటంతో...చర్చకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ సభ్యులు పట్టుబట్టారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను గంటపాటు వాయిదా వేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారంటూ నల్లదుస్తులు ధరించి... క్యాలీఫ్లవర్లు పట్టుకొని సభకు హాజరయ్యారు. -
క్యాలీఫ్లవర్లతో సభకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు