ఎమ్మెల్యేల అరెస్టు.. స్టేషన్కు తరలింపు
తెలంగాణ అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేయడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. గన్ పార్కు ఎదుట ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు. ఏకమొత్తంగా రుణమాఫీ చేయమంటే సభను వాయిదా వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
ప్రతిపక్షాల ఐక్యపోరాటం కొనసాగుతుందని అన్ని పక్షాల నేతలు చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రైతు రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇవ్వలేదని మండిపడ్డారు. అర్ధాంతరంగా సభను వాయిదా వేయడం నిరంకుశ పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, వామపక్షాల సభ్యులు గన్పార్కు వద్ద ఆందోళనలో పాల్గొన్నారు.