
సభలో గందరగోళం: అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా
హైదరాబద్: కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ప్రతిపక్షం అంబేద్కర్‌ను అవమానిస్తోందని, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య హక్కులను అందరికీ కల్పించారని రావెల కిశోర్ బాబు అన్నారు.
అపర బాంధవుడు అంబేద్కర్ గురించి చర్చించాలని బీఏసీలో ఆలోచించిన తర్వాత అంబేద్కర్‌పై చర్చకు ఇష్టపడటం లేదంటే దళిత జాతిని, అంబేద్కర్‌ను అవమానిస్తున్నారని ఆరోపించారు. సభలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కాల్‌మనీపై చర్చ జరగడానికి దమ్ము లేదని, అందులో నేరస్థులంతా మీవాళ్లేనని ఆరోపించారు. ఈ సమయంలో ఆయన మైకును కట్ చేసిన స్పీకర్.. అసెంబ్లీని పది నిమిషాల పాటు వాయిదా వేశారు.