ప్రత్యేక హోదాపై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ | andhra pradessh assembly adjourned for 10 minutes | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాపై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ

Published Thu, Sep 8 2016 9:41 AM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM

ప్రత్యేక హోదాపై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ - Sakshi

ప్రత్యేక హోదాపై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ

హైదరాబాద్ :  ప్రత్యేక హోదా అంశంపై గురువారం  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. దీంతో సమావేశాలు ప్రారంభం అయిన కొద్దిసేపటికే 10 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. అంతకు ముందు ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో పట్టుబట్టింది. ఇదే అంశంపై వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిర్కరించిన విషయం తెలిసిందే.

హోదాపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. 344 కింద చర్చకు పట్టుబట్టారు. అయితే జీఎస్టీ బిల్లు తర్వాతే చర్చిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాలు పాటు వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement