హైదరాబాద్ : ప్రతిపక్షం నిరసనలు, నినాదాలతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరోసారి వాయిదాపడింది. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబడుతుంటే...అధికార టీడీపీ హోదా అంశాన్ని పక్కనబెడుతూ సభను వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టడంతో సభ తొలుత పది నిమిషాలు వాయిదా పడిన విషయం తెలిసిందే.
అయితే వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా వైఎస్ఆర్ సీపీ తన పట్టు వీడలేదు. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం ముందు బైఠాయించిన నిరసన తెలిపారు. చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన విరమించి, సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ సూచించారు. దీంతో గందరగోళం మద్యే సభ మళ్లీ వాయిదా పడింది.