హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సోమవారం ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసుదనాచారి తిరస్కరించారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చించాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దాంతో ఈ అంశాన్ని ప్రశ్నోత్తరాల అనంతరం చర్చిద్దామని స్పీకర్ సూచించారు. అయినా కాంగ్రెస్ సభ్యులు తమ పట్టువీడకుండా వెల్లోకి దూసుకెళ్లి , పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.
తీర్మానాలపై చర్చకు విపక్షాలు పట్టు, అసెంబ్లీ వాయిదా
Published Mon, Nov 17 2014 10:18 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM
Advertisement
Advertisement