హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో రైతుల ఆత్మహత్యలు, ఇతర రైతాంగ సమస్యలపై సోమవారం కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించకపోవడంపై బీజేపీ, నక్కలగండి, డిండి ప్రాజెక్టులకు పాలనా అనుమతులపై సీపీఐ, దేవ్రాజ్ కంపెనీ మూసివేతను అడ్డుకోవాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. మరోవైపు తమపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలంటూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిసిన విషయం తెలిసిందే.