హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో విపక్షాలు శుక్రవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు చేశాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని రాజీవ్గాంధీ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అలాగే రాష్ట్రంలో మూతపడుతున్న పరిశ్రమలపై చర్చకు టీడీపీ, విభజన నేపథ్యంలో షెడ్యూల్ 9 లోని సమస్యల పరిష్కరించాలని సీపీఐ, ఆశా వర్కర్ల వేతనాల పెంపుపై సీపీఎం, ఇంటర్ పరీక్షల షెడ్యూల్పై ఏర్పడిన సందిగ్థతపై చర్చకు బీజేపీ వాయిదా తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాయి.
రాజీవ్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరుపై వాయిదా తీర్మానం
Published Fri, Nov 21 2014 9:30 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM
Advertisement
Advertisement