హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో సింగరేణిలో వారసత్వ నియామకాలు, ఓపెన్ కాస్ట్ కాంట్రాక్ట్ కార్మికుల అంశంపై మంగళవారం టీ వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. టీపీపీఎస్సీ ద్వారా లక్ష ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. అలాగే ఆర్టీసీ వేతన సవరణపై బీజేపీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలుపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
మరోవైపు టీటీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు ఎత్తివేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ససేమిరా అంది. ఈ నేపథ్యంలో సదరు నేతలంతా న్యూఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ఇదే అంశంపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ను కూడా టీటీడీపీ ఎమ్మెల్యేలు కలవనున్నారు.