హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో విపక్షాలు బుధవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, భూపంపిణీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అలాగే పెన్షన్ల అంశంపై కాంగ్రెస్, ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.