ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడో రోజు కూడా ఉద్రిక్తత కొనసాగింది. ప్రత్యేక హోదా నినాదంతో సభ దద్దరిల్లింది. శనివారం సమావేశాలు ప్రారంభం కాగానే ప్రత్యేక హోదాపైనే వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టింది. హోదాపై చర్చకు అవకాశం కల్పించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పోడియం చుట్టు ముట్టి నిరసనకు దిగారు