బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే బైటకు వెళ్లారని.. వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను ఇరుకున పెట్టాలని చూసిన ఆర్థిక మంత్రి యనమల చివరకు తానే ఇరుక్కుపోయారు. బడ్జెట్‌పై ప్రభుత్వం తరఫున సమాధానమిచ్చేందుకు సిద్ధమైన యనమల ‘ప్రతిపక్ష నేత బాయ్ కాట్ చేసినట్లా? ఏదైనా పని ఉండి బయటకు వెళ్లినట్టా.. బాత్‌రూంకి వెళ్లినట్లా..’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. లోనికి వచ్చిన జగన్ చిటికెన వేలు చూపిస్తూ.. ఇలా చూపించి వెళ్లాలని తనకు తెలియదన్నారు.