వైఎస్ఆర్‌సీపీ మీద లేనిపోని అభాండాలు వేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ వేసిన వ్యూహం కాస్తా బూమెరాంగ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గట్టిగా పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీనిపై లేనిపోని దుష్ప్రచారం కల్పించడానికి తెలుగు దేశం పార్టీ శాయశక్తులా కృషి చేసింది.