రెండు నిమిషాలు మైక్ ఇచ్చే బదులు...
హైదరాబాద్ : రెండు నిమిషాలు మైక్ ఇస్తే చాలు తమ అభిప్రాయం చెప్తామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావును అభ్యర్థించారు. రెండు నిమిషాలు మైక్ ఇచ్చే బదులు... సభా సమయాన్ని వృధా చేయడమెందుకన్నారు. కావాలంటే సమయం చూసుకొని రెండు నిమిషాలు సమయం ఇవ్వాలన్నారు.
అంతకు ముందు తొమ్మిదిమంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ సభాపతిపై మాట్లాడారనే ఆరోపణపైనే ఇప్పటికే ఎనిమిది మంది శాసనసభ్యులను మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారని, మళ్లీ అదే సభ్యలపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు.