అసెంబ్లీ సోమవారానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. అంతకుముందు వరుసగా రెండుసార్లు వాయిదా పడిన తర్వాత తిరిగి సమావేశమైనప్పుడు కూడా సభలో గందరగోళం నెలకొంది. రోజాపై సస్పెన్షన్ ఎత్తేయాలని విపక్షం ఎంతగా పట్టుబట్టినా అధికారపక్షం వినిపించుకోలేదు. ఈ గందరగోళం నడుమే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయం పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించారు.
అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తమ నినాదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో అధికార పక్షం నుంచి సభను నియంత్రించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. కానీ విపక్షం తన పట్టు వీడకపోవడంతో.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను సోమవారానికి వాయిదా వేశారు.