హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పై జరిగే చర్చలో తమకు అవకాశం ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. అయినా స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. దాంతో ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయటంతో సభను స్పీకర్ పదినిమిషాలు వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ కోడెల ఏకపక్ష వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు ధరించి సభలకు హాజరయ్యారు.