హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మరోవైపు సభ నిర్వహణ అంశాలపై సభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) ఉదయం పది గంటలకు సమావేశం కానుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే అవకాశాలున్నాయి. బడ్జెట్‌ను 12వ తేదీన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు.ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 13న సభకు సమర్పిస్తారు. సెలవుదినాలు పోను సభ 16 రోజులు జరిగే అవకాశముంది.
ఏపీ ఉభయసభలు సోమవారానికి వాయిదా
Published Sat, Mar 7 2015 9:36 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM
Advertisement
Advertisement