టీడీపీ సభ్యుల నిరసన, అసెంబ్లీ వాయిదా | Telangana assembly adjourned 10 minutes | Sakshi
Sakshi News home page

టీడీపీ సభ్యుల నిరసన, అసెంబ్లీ వాయిదా

Published Mon, Nov 10 2014 11:56 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

Telangana assembly adjourned 10 minutes

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించటంపై తెలంగాణ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. తెలంగాణలో పంటలు ఎండిపోవటానికి చంద్రబాబే కారణమన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.  శ్రీశైలంలో విద్యుత్ ప్రారంభిస్తే యాగీ చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించగా, ఆయన ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు.

  స్పీకర్ మధుసూదనాచారి వారించినా టీడీపీ సభ్యులు తమ నిరసన కొనసాగిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ అనుమతితోనే తాను మాట్లాడుతున్నానని కేసీఆర్ అన్నారు.  దాంతో అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది.  సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలగటంతో స్పీకర్ సమావేశాలను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement