
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారానికి వాయిదా పడింది. హుద్హుద్ తుపానుపై తీవ్రస్థాయిలో వాడివేడిగా చర్చలు జరిగిన అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన తర్వాత అసెంబ్లీని శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. అంతకుముందు ఉత్తరాంధ్రలో వచ్చిన హుద్హుద్ తుపాను విలయంపై సభలో విస్తృతంగా చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేరు కాబట్టి, ఇది ముఖ్యమైన అంశం అయినందున దీనిపై రేపు చర్చిద్దామని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించినా, అధికారపక్షం ఏమాత్రం పట్టించుకోకుండా తమకు తోచిన రీతిలో చర్చను ఏకపక్షంగా నడిపించేసింది.