అసెంబ్లీలో సమైక్యాంధ్ర తెలంగాణ నినాదాలు | assembly session begins amid 'Jai Telangana', 'Jai Samaikyandhra' slogans | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో సమైక్యాంధ్ర తెలంగాణ నినాదాలు

Published Tue, Dec 17 2013 9:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

assembly session begins amid 'Jai Telangana', 'Jai Samaikyandhra' slogans

హైదరాబాద్ : విపక్ష సభ్యుల నిరసనలతో శాసనసభ ప్రారంభం అయిన కొద్ది నిముషాల్లోనే అరగంటపాటు వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. ఇదే సమయంలో  తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.

జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా స్పీకర్ ఎదుట నిరసన తెలుపుతున్న సీమాంధ్ర ఎమ్మెల్యేల చేతిలో ఉన్న ప్లకార్డులను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాక్కున్నారు. మరోవైపు బీఏసీ సమావేశం దృష్ట్యా అసెంబ్లీని స్పీకర్ అరగంటపాటు వాయిదా వేశారు.  శాసనమండలి బీఏసీ అనంతరం అసెంబ్లీ బీఏసీ సమావేశం జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement