BAC
-
ఈ నెల 20 వరకే అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో శుక్రవారంతో సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కానీ ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబట్టినట్టు సమాచారం. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పష్టత రాలేదు. సోమవారం మధ్యాహ్నం స్పీకర్ ప్రసాద్‌కుమార్ చాంబర్లో బీఏసీ భేటీ జరిగింది.ఇందులో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్.. బీఆర్ఎస్ నుంచి హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి పాయల్ శంకర్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ తేదీలు, ఎజెండాపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.కనీసం 15 రోజుల పాటు సభ నిర్వహించాలని కోరింది. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో భేటీ నుంచి వాకౌట్ చేసింది. మరోవైపు సభ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా బీఏసీ భేటీ బయటికి వచ్చారు. బీఏసీ భేటీకి సంబంధించిన వివరాలను మంగళవారం ఉదయం అధికారికంగా వెల్లడించే అవకాశముంది. బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదు: హరీశ్‌రావు కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ నడపాలని కోరా మని బీఏసీ భేటీ అనంతరం హరీశ్‌రావు చెప్పారు. ‘‘బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదు. బీఏసీలో ఏమీ తేల్చకపోవడంతో, సభ ఎన్ని రోజులు నడుపుతారో చెప్పకపోవడంతో వాకౌట్ చేశాం. లగచర్ల అంశంపై చర్చకు మంగళవారం కూ డా పట్టుబడతాం. ఒకరోజు ప్రభుత్వం, మరోరోజు విపక్షం ప్రతిపాదించే ఎజెండాకు అవకాశం ఇవ్వ డం సాంప్రదాయం. బీఏసీకి కేవలం సూచనలు చేసే అధికారం మాత్రమే ఉందని సీఎం చేసిన వ్యా ఖ్యలపై అభ్యంతరం తెలిపాం.హౌజ్ కమిటీలు ఏ ర్పాటు చేయాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)పై బీఆర్ఎస్ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని అడిగాం. బీఏసీలో చర్చించకుండానే సభలో బిల్లులు ప్రవేశపెట్టడం, పుట్టినరోజులు, పెళ్లిళ్లు ఉన్నందుకు సభ వాయిదా వేయడంపై అభ్యంతరం చెప్పాం. ప్రతీరోజూ జీరో అవర్‌లో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మాట్లాడే సమయం ఇవ్వాలని కోరాం’’అని హరీశ్‌రావు వెల్లడించారు. గత పదేళ్లలో చాయ్ తాగి, బిస్కెట్లు తినే వచ్చారా?: మంత్రి శ్రీధర్‌బాబు ఉమ్మడి ఏపీతోపాటు తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల నుంచీ కూడా బీఏసీ సమావేశంలో చర్చించి సభ నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటున్నారని... సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయమని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ‘‘బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేయడం ద్వారా బీఆర్ఎస్, ఎంఐఎం స్పీకర్‌ను అవమానించాయి. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చెప్పినట్టు గత పదేళ్లలో కూడా బీఏసీ సమావేశంలో చాయ్ తాగి, బిస్కెట్లు తినే వచ్చారా? బీఆర్ఎస్ తీరు సరికాదు..’’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. -
‘చాయ్ బిస్కట్’ సమావేశాలు కాదు: హరీశ్‌రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎన్ని రోజులు సభ నడుపుతారో క్లారిటీ ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసినట్లు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ నుంచి బయటికి వచ్చిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని ఎద్దేవా చేశారు.‘అసెంబ్లీ సమావేశాలపై ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చినం.ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పక పోవడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేశాం. రేపు లగచర్ల అంశంపై చర్చకు బీఅర్ఎస్ పట్టు పట్టింది. ఒక రోజు ప్రభుత్వానికి,మరొక రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయం. లగచర్లపైన చర్చకు పట్టుపట్టినం. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాల కీలకం.కచ్చితంగా ఈ అంశంపైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే.బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న సీఎం వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హౌస్ కమీటీ ఏర్పాటుచేయాలి. బీఏసీపైన తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసకుంటారని స్పీకర్‌ను అడిగాం. బీఏసీలో లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేశాం’అని హరీశ్‌రావు చెప్పారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగి సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. -
AP: నేటి నుంచి అసెంబ్లీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించనుంది. అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. అంతకుముందు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించడానికి ఏడో తేదీ ఉదయం 8గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. -
అసెంబ్లీ బీఏసీ సభ్యులను నియమించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బీఏసీ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. మంత్రి వర్గ మార్పుల నేపథ్యంలో బీఏసీ సభ్యులను సీఎం మార్చారు. కన్నబాబు, అనిల్‌కుమార్ స్థానంలో బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, బీఏసీలో లేజిస్లేటివ్ అఫైర్ కో ఆర్డినేటర్‌గా గండికోట శ్రీకాంత్‌రెడ్డిలను నియమించారు. చదవండి: ఏపీలో మరో భారీ సంక్షేమ పథకం.. అక్టోబర్ 1 నుంచి అమలు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. -
రాజ్యసభ బీఏసీ సభ్యుడిగా విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యులు ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, మల్లికార్జున్ ఖర్గే, శివ్ ప్రతాప్ శుక్లాలను బీసీఏ సభ్యులుగా రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు నామినేట్ చేశారు. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ సభ్యులుగా జీవీఎల్ నరసింహారావు, కె.ఆర్.సురేష్‌రెడ్డి నియమితులయ్యారు. -
22 వరకు అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 14 నుంచి 22 వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్, ఉపసభాపతి పద్మారావు గౌడ్, పలువురు మంత్రులు, విపక్ష ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించారు. మొహర్రం, గణేశ్ నిమజ్జనం తదితరాల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 13 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పా టు, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హాజరయ్యారు. వీరితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి హాజరు కాగా, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ తర హాలో హైదరాబాద్‌లో ప్రత్యేక భవనం నిర్మించా లని భట్టి విక్రమార్క సూచించారు. నూతనంగా నిర్మించే అసెంబ్లీ భవన సముదాయంలో నిర్మిస్తా మని కేసీఆర్ తెలిపారు. అక్టోబర్‌లో రెవెన్యూ బిల్ పెట్టే అవకాశం ఉందని కేసీఆర్ వెల్లడించినట్లు తెలి సింది. కాగా వచ్చే బడ్జెట్ సమావేశాలను 21 రోజులపాటు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. 22 వరకు అసెంబ్లీ సమావేశాలు.. వాయిదా అనంతరం తిరిగి 14న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 22న ముగుస్తాయి. 14వ తేదీ మొదలు 22వ తేదీ వరకు రోజువారీగా చేపట్టాల్సిన అంశాలపై బీఏసీ చర్చించింది. 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ కొనసాగించి, 15న ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు. 16న హౌసింగ్, సాంఘిక, గిరిజన, మహిళా, మైనార్టీ, స్త్రీ, శిశు, వికలాంగ సంక్షేమ శాఖల పద్దులపై సభ చర్చిస్తుంది. 17న మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, విద్యుత్ అంశా లు, 18న రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, హోం, వ్యవసాయం, అనుబంధ శాఖలు, పౌర సరఫరాల శాఖ పద్దులపై చర్చిస్తారు. 19న పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య, క్రీడలు, యువజన, వైద్య, ఆరోగ్య శాఖ పద్దులు, 20న కార్మిక, ఉపాధి, దేవాదాయ, అటవీ, పరిశ్రమలు, ఐటీ, ప్రభుత్వ రంగ సంస్థలపై చర్చ జరుగుతుంది. 21న పాలన, ప్రణాళిక, సమాచార శాఖ పద్దులు, సమావేశాల చివరి రోజు 22న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. 14 నుంచి 22 వరకు పలు బిల్లులను కూడా సభలో పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 22న శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉగాండాలో జరిగే కామన్వెల్త్ దేశాల పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరి వెళతారు. నాలుగు రోజుల పాటు మండలి భేటీ.. ఈ నెల 11న శాసనమండలి స్పీకర్ ఎన్నిక తర్వాత శాసన మండలిని వాయిదా వేసి, తిరిగి 14, 15, 22 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని శాసన మండలి బీఏసీ నిర్ణయించింది. పద్దుల మీద శాసన మండలిలో చర్చ జరగనందున కేవలం నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. -
27వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 13,14 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరపనున్నారు. 15న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 25 వ తేదీ( ఆదివారం) కూడా సభను నడపాలని బీఏసీలో నిర్ణయించారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. కాగా, గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ అడ్డుతగలడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై బీఏసీ సమావేశంలో చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యులు ప్రవర్తించిన తీరుపై సభ్యులు బీఏసీ సమాచవేశంలో విచారం వ్యక్తం చేశారు. అయితే మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు గాయాలు అవడంపై చింతిస్తున్నామని కాంగ్రెస్ నేత జానారెడ్డి తెలిపారు. మరో వైపు ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు చేయాలని మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. వీటిపై స్పందించిన సభాపతి మధుసూదనచారి అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
30న అసెంబ్లీ, మండలి ప్రత్యేక భేటీ
-
30న అసెంబ్లీ, మండలి ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఈ నెల 30న ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి రాజ సదారాం గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ వివరాలను గవర్నర్, ముఖ్యమంత్రుల ప్రిన్సిపల్ కార్యదర్శులతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు, సంబంధిత అధికారులకు పంపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు శాసనసభ(7వ సెషన్, మూడో సమావేశం), మధ్యాహ్నం 3 గంటలకు మండలి సమావేశం జరుగుతుందని అందులో పేర్కొన్నారు. సమావేశాలకు ముందు రోజు ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరగనుంది. ప్రత్యేక సమావేశంలో ఆమోదించే బిల్లులపై విపక్ష పార్టీల నేతలకు బీఏసీలో వివరించి వారి సహకారం కోరే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్లో శాసనసభ ఆమోదించిన భూసేకరణ బిల్లులో కేంద్రం సూచించిన సవరణలపై ప్రత్యేక సమావేశంలో చర్చించి మార్పులతో తిరిగి బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపనున్నారు. దీంతోపాటే నకిలీ విత్తన నిరోధక బిల్లును కూడా శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న నకిలీ విత్తనాల విక్రయంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, దీనికోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురానున్నట్లు సీఎం ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశంలోనే ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. -
ప్రశ్నోత్తరాల సమయం పెంపు
-
ప్రశ్నోత్తరాల సమయం పెంపు
గంటన్నర ప్రశ్నోత్తరాలు.. 30 నిమిషాల పాటే ‘జీరో అవర్’ • ఈ నెల 30 వరకు సమావేశాలు • అవసరమైతే జనవరి 2 నుంచి మరో వారం పొడిగింపు • బీఏసీ భేటీలో నిర్ణయాలు ∙సమయ పాలన పాటిద్దామన్న సీఎం సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించాలని, అవసరమైతే జనవరి 2వ తేదీ నుంచి మరో వారం పాటు పొడిగించాలని అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) భేటీలో నిర్ణయించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలను నిర్వహించనున్నారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ ఎస్.మధుసూధనాచారి అధ్యక్షతన ఆయన కార్యాలయంలో బీఏసీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కనీసం ఇరవై రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు కోరాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈనెలాఖరు దాకా అంటే 12 రోజుల పాటు సమావేశాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. చర్చించాల్సిన అంశాలు మిగిలిపోయాయని భావిస్తే జనవరి 2వ తేదీ నుంచి మరో వారం పాటు సమావేశాలు నిర్వహించేందుకు సానుకూలమని తెలిపింది. సమావేశాల్లో రోజూ ఉదయం తొలి గంటన్నర సమయాన్ని ప్రశ్నోత్తరాలకు కేటాయించారు. గతం కన్నా దీన్ని పెంచారు. మరో 30 నిమి షాలు జీరో అవర్, టీబ్రేక్గా నిర్ణయించారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పలు అంశాలపై చర్చ జరుపుతారు. ఇక షెడ్యూల్ మేరకు 18, 24, 25 తేదీల్లో అసెంబ్లీకి సెలవుగా ప్రకటించారు. కేవలం 12 పనిదినాలు సరిపోవని, సమావేశాలు మరిన్ని రోజులు జరపాలని విపక్షాల నేతలు కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్... సమావేశాలు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమయ పాలన పాటిద్దాం.. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ విషయంలో కచ్చితంగా సమయాన్ని పాటించాలని.. ఒకవేళ తాను ఆ సమయంలో మాట్లాడుతున్నా సరిగ్గా 11.30 గంటలకు ప్రశ్నోత్తరాలను ముగించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అవసరమైతే తన మైక్ కూడా కట్ చేయాలన్నారు. ఇక సమావేశాలు పొడిగించే అంశంపై మరోసారి సమావేశం కావాలని బీఏసీ భేటీలో నిర్ణయించారు. ఈ సమావేశాల్లో నోట్ల రద్దుపై చర్చించాలని కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు కోరగా.. ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సమావేశాల తొలిరోజైన శుక్రవారం నోట్ల రద్దు అంశంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండో రోజు మండలిలో.. శాసనసభతో పాటు శాసనమండలి బీఏసీ సమావేశం కూడా జరిగింది. అందులోనూ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మండలి సమావేశాల్లో తొలి రోజున రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై చర్చించాలని, శనివారం నోట్ల రద్దు అంశాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ తొలిరోజు అసెంబ్లీలో, రెండోరోజు మండలిలో నోట్ల రద్దుపై చర్చలో పాల్గొంటారు. అసెంబ్లీ బీఏసీ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత జానారెడ్డి, భట్టి , బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఎం నుంచి సున్నం రాజయ్య, టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. -
16 నుంచి అసెంబ్లీ సమావేశాలు
-
16 నుంచి అసెంబ్లీ
- అదే రోజు నుంచి మండలి భేటీ కూడా - వారం పాటు నిర్వహించాలని యోచన - ఒక రోజు ముందు బీఏసీ సమావేశం - షెడ్యూల్‌పై సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం - 10న కేబినెట్, 14న కలెక్టర్లతో సమావేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలను ఈనెల 16 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలను ప్రకటించాల్సిందిగా గవర్నర్‌ను కోరుతూ నోట్ పంపాలని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బుధవారం ప్రగతి భవన్లో సన్నాహక సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం, అసెంబ్లీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజైన 15వ తేదీన ఉదయం పదకొండున్నర గంటలకు స్పీకర్ కార్యాలయంలో బీఏసీ సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అయితే జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ఆగస్టు 30న ఒక రోజు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. తిరిగి మూడున్నర నెలల తర్వాత సమావేశాలు జరుగనుండటం ప్రాధాన్యాత సంతరించుకుంది. ఈసారి వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా కేబినెట్ భేటీ ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతో పాటు నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజకీయ వ్యూహరచనపై ఇందులో చర్చించే అవకాశాలున్నాయి. ప్రగతిభవన్‌లో కలెక్టర్ల సదస్సు ఈనెల 14న ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్ల సమావేశంతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు సెషన్లలో ఈ సమావేశం జరుగనుంది. మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు సమావేశానికి హాజరుకావాలని సీఎం సూచించారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కలెక్టర్లతో నిర్వహించే తొలి సమావేశం కావడంతో.. ప్రభుత్వ పథకాల అమలు, ప్రణాళికల తయారీ, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ప్రజలను చైతన్యపర్చడం తదితర అంశాలపై అందులో చర్చించనున్నారు. 15న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలను సమాయత్తం చేసేందుకు ఈనెల 15న ప్రగతి భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం చేరవేశారు. 18న క్రిస్మస్ వస్త్రాల పంపిణీ ఈనెల 18న ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద క్రైస్తవులకు వస్త్రాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పేద కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం గత ఏడాది నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. -
బీఏసీకి ఇచ్చిన హామీకీ విలువ లేదా!
-
బీఏసీకి ఇచ్చిన హామీకీ విలువ లేదా!
• అసెంబ్లీ సమావేశాలంటే టీఆర్ఎస్ భయపడుతోంది: జానారెడ్డి • గాంధీ విగ్రహం వద్ద సీఎల్పీ నిరసన సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు పెడతామని శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)కి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి కూడా విలువ లేదా అని కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రశ్నించింది. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, వాటిపై చర్చలు జరిపి పరిష్కరించడానికి వెంటనే శాసనసభ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వ ధోరణి అప్రజాస్వామికం... జానారెడ్డి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో తాండవిస్తున్న అనేక సమస్యలపై చర్చించి, పరిష్కారం చూపించాల్సిన బాధ్యత చట్ట సభలకు ఉంది. జీఎస్టీ బిల్లు ఆమోదం సందర్భంగా వారంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుందామని, అన్ని సమస్యలపై వివరంగా చర్చించుకుందామని సీఎం బీఏసీలో హామీ ఇచ్చారు. సమావేశాలు జరిగి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. బీఏసీకి ఇచ్చిన మాటకు కూడా విలువలేదా? రైతులు, విద్యార్థులు, యువకులు, కూలీలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు సమస్య వచ్చి చేరింది. వీటిపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని అడుగుతుంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? ప్రజాస్వామికంగా నిరనసలు చెప్పాలనుకుంటే ప్రభుత్వం అప్రజాస్వామికంగా అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. పోలీసులను మోహరించి, ప్రతిపక్షాలను భయపెట్టి, భయోత్పాతాన్ని సృష్టించాలనుకుంటోంది. అధికారం ఉందనే అహంకారంతో వ్యవహరిస్తోంది’అన్నారు. కేసీఆర్ అబద్ధాలకోరు: ‘కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరు. శాసనసభలోనూ పచ్చి అబ ద్ధాలు మాట్లాడే ఏకై క వ్యక్తి కేసీఆర్ ఒక్కరే. ప్రజాసమస్యలపై ప్రజా ప్రతినిధులు మాట్లాడవద్దంటే ఎలా’అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డి.కె.అరుణ, సంపత్‌కుమార్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొం గులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, రంగారెడ్డి, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా? బడ్జెట్ సమావేశాల తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడానికి ఎందుకు భయపడుతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘జీఎస్టీ కోసం ప్రత్యేక సమావేశాలు పెట్టి, మరే ఇతర సమస్యలనూ చర్చించకుండా దాటేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 52 రోజులు అసెంబ్లీ నడిస్తే.. తెలంగాణలో కేవలం 18 రోజులే జరిగింది. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఏకపక్షంగా, నియంతృత్వంతో వ్యవహిరించడానికే తెలంగాణ తెచ్చుకున్నామా? ప్రజాస్వామ్యం, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారు. శాసనసభ సమావేశాలను నిర్వహించకుంటే ఆందోళనలను మరింత పెంచుతాం’అని ఉత్తమ్ హెచ్చరించారు. పోలీసుల మోహరింపుపై ఆగ్రహం ధర్నా చేయాలని సీఎల్పీ నిర్ణరుుంచిన నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో భారీగా పోలీసులను మోహరించడంపై జానారెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వమే భయోత్పాతం సృష్టిస్తే ఎలా’అని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను జానా ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అసెంబ్లీ ఆవరణలో అగౌరవపరుస్తున్నారన్నారు. విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకుపోతానని కార్యదర్శి చెప్పారు. -
29 వరకు అసెంబ్లీ
► 16 రోజులపాటు సభ నిర్వహణకు బీఏసీ నిర్ణయం ► శని, ఆదివారాల్లోనూ శాసనసభ సమావేశాలు ► అవసరమైతే మరో రెండు రోజులు పొడిగింపు ► నేడు, రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ ► 14న ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఈటల ► 15, 23, 24, 25 తేదీల్లో సెలవులు ► బీఏసీ భేటీకి టీటీడీఎల్పీ నేత రేవంత్ గైర్హాజరు ► మార్చి 31 వరకు జరగనున్న మండలి సమావేశాలు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు జరగనున్నాయి. శని, ఆదివారాలు కూడా అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ నెల 29వ తేదీ వరకు (16 పని దినాలు) సమావేశాలు నిర్వహించాలని శాసనసభ సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. ఈ నెల 14న మంత్రి ఈటల రాజేందర్ సభలో ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సభ ఎజెండా, పనిదినాలు ఖరారు చేసేందుకు స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన శుక్రవారం బీఏసీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ శాసనసభా పక్షం నేత డాక్టర్ లక్ష్మణ్ ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని లక్ష్మణ్ కోరగా.. మరోమారు బీఏసీ నిర్వహించి ఈ అంశాన్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 14న బడ్జెట్ అనంతరం 15న ఒకరోజు, హోలీ, గుడ్‌ఫ్రైడే సందర్భంగా మార్చి 23, 24, 25 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఈ నాలుగు రోజులు మినహా.. శని, ఆదివారాలతో సంబంధం లేకుండా వరుసగా మార్చి 12 నుంచి 29వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగంపై నేడు, రేపు చర్చ గవర్నర్ ప్రసంగంపై శని, ఆదివారాల్లో ధన్యవాద తీర్మానాలపై సభ్యులు ప్రసంగిస్తారు. 14న బడ్జెట్ తర్వాత 16, 17, 18, 19 తేదీల్లో సాధారణ చర్చ నిర్వహిస్తారు. 19న ఆర్థిక మంత్రి సమాధానంతో బడ్జెట్‌పై చర్చను ముగిస్తారు. తర్వాత 20 నుంచి 28వ తేదీ వరకు ఆరు రోజుల పాటు రెండు విడతల్లో బడ్జెట్ పద్దులపై చర్చ నిర్వహించి, ఓటింగ్ జరుపుతారు. సమావేశాల చివరి రోజు మార్చి 29న ద్రవ్య వినిమయ బిల్లుతోపాటు, ఇతర ప్రభుత్వ బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ మరో రెండు రోజుల పాటు.. అంటే మార్చి 30, 31 తేదీల్లో సభను నిర్వహించాల్సి వస్తే సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు చర్చను ప్రారంభిస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు శాసనమండలి సభ్యులను కూడా ఆహ్వానించాలని కొందరు ఎమ్మెల్సీలు మంత్రి హరీశ్‌రావును కోరినట్లు సమాచారం. బీఏసీ సమావేశానికి రేవంత్ స్థానంలో సండ్ర తెలంగాణ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. బీఏసీ సమావేశంలో పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా ఇటీవల నియమితులైన రేవంత్‌రెడ్డి.. తనకు బదులుగా ఎమ్మెల్యే సండ్ర బీఏసీ సమావేశానికి హాజరవుతారని సీఎంకు లేఖ ఇచ్చారు. అసెంబ్లీ ఆవరణలోనే ఉన్నా రేవంత్‌రెడ్డి బీఏసీ సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ సీఎం చేసిన విజ్ఞప్తికి.. విపక్షాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడంపై సభ బయట అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ, కాంగ్రెస్.. బీఏసీ సమావేశంలో మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించలేదని తెలిసింది. మార్చి 31 వరకు మండలి రాష్ట్ర శాసన మండలి సమావేశాలను మార్చి 31 వరకు నిర్వహించాలని చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయించారు. శాసనమండలి ఆవరణలో శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో మండలి సమావేశ తేదీలను ఖరారు చేశారు. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు మండలి సమావేశాలు నిరవధికంగా జరుగుతాయి. 20న ఆదివారం సెలవుదినంగా పాటించి తిరిగి 21, 22 తేదీల్లో సమావేశం నిర్వహిస్తారు. 23 నుంచి 26వ తేదీ వరకు హోలీ, గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవులు ప్రకటించారు. తిరిగి 27న ప్రారంభమయ్యే మండలి సమావేశాలు 31తో ముగియనున్నాయి. మండలి సమావేశాలు మార్చి 31 వరకు జరగనున్న నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాలను కూడా 29 నుంచి 31వ తేదీ వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. -
అసెంబ్లీలో ఎదుర్కోవడమెలా...?
-
అసెంబ్లీలో ఎదుర్కోవడమెలా...?
అసెంబ్లీని కుదిపేయనున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ ఎప్పటిలాగే ఎదురుదాడి వ్యూహంతో సర్కారు హైదరాబాద్: గురువారం నుంచి ప్రారంభమవుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఇటీవలే వెలుగులోకి వచ్చిన కాల్ మనీ రాకెట్ దుమారంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమైంది. తెలుగుదేశం నేతల ప్రమేయంతో ఈ రాకెట్ సాగుతోందని పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఇప్పటికే ప్రతిపక్షం గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించడంతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఏపీలో తీవ్ర సంచలనం రేపిన కాల్ మనీ రాకెట్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న విజయవాడ కమిషనర్‌పై తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన సెలవు కోరడం, దానిపైనా విమర్శలు వెళ్లువెత్తడంతో ఆయన సెలవు రద్దు చేయడం వంటి పరిణామాలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టింది. దీనిపై కూపీ లాగుతున్న కొద్దీ ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతల పాత్ర స్పష్టం కావడంతో దీనిపై అసెంబ్లీలో ఎలా సమాధానం చెప్పాలన్న అంశంపై మంత్రులతో చంద్రబాబు తర్జనభర్జన పడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షం నిలదీసే అవకాశాలుండటంతో చివరి నిమిషంలో విజయవాడ కమిషనర్ గౌతం సవాంగ్ సెలవులను రద్దు చేసి దిద్దుబాట చర్యలకు ఉపక్రమించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులపై చర్యలు లేవన్న విషయంపై ప్రతిపక్షం లేవనెత్తితే ఎప్పటిలాగే ఎదురుదాడి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించింది. మంత్రులకు పలు సూచనలు చేశారు. ప్రతిపక్షం ఈ అంశం లేవనెత్తగానే ఎదురుదాడికి దిగాలని ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. అందుకు పార్టీకి చెందిన కొంత మంది నేతలను ఎంపిక చేశారు. కాల్ మనీ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ చేయాలని కేబినేట్ లో నిర్ణయించిన ప్రభుత్వం ఇదే అంశంపై సభలో ఒక ప్రకటన చేయడం ద్వారా విపక్షం దాడిని కట్టడి చేయాలని భావించారు. బీఏసీలో నిర్ణయం అసెంబ్లీ సమావేశాల్లో చేపట్టాల్సిన ఎజెండా నిర్ణయించడానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన గురువారం సభా వ్యవహారాల మండలి (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేశారు. శీతాకాల సమావేశాలు అయిదు రోజుల పాటే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా, ప్రజా సమస్యలు అనేకం చర్చించాల్సి ఉన్నందున సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్షం కోరుతోంది. -
'అవసరమైతే ఒక పూట పొడిగిస్తాం'
-
రాజ్యసభలో జీఎస్టీ బిల్లు
ప్రవేశపెట్టిన జైట్లీ - చర్చను అడ్డుకున్న కాంగ్రెస్ * బీఏసీలో చర్చించకుండా సభలో చర్చకు వీల్లేదని కాంగ్రెస్ ఆందోళన * గతంలోనే బీఏసీలో చర్చించి సమయం కేటాయించారన్న ఆర్థికమంత్రి * ఆ సమయం గడిచిపోయిందన్న కాంగ్రెస్.. వెల్‌లో సభ్యుల నినాదాలు * గందరగోళంలో బిల్లును చేపట్టలేనన్న ఉపసభాపతి.. సభ వాయిదా న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజులే మిగిలివున్న పరిస్థితుల్లో.. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే.. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పలు విధానపర అభ్యంతరాలు లేవనెత్తుతూ చర్చను అడ్డుకుంది. సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిలుచోగానే.. అప్పటివరకూ మౌనంగా ఉన్న కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా వెల్‌లోకి దూసుకెళ్లారు. దీనిపై జైట్లీ మండిపడుతూ.. దేశ అభివృద్ధిని అడ్డుకోవటం కోసమే కాంగ్రెస్ ఏదో ఒక వంకతో అవరోధాలు కల్పిస్తోందని, ముఖ్యమైన జీఎస్టీ చట్టాన్ని నిలువరించటం కోసమే లలిత్ మోదీ - సుష్మ వివాదాన్ని వాడుకుంటోందని విమర్శించారు. బిల్లుపై సభా కార్యక్రమాల సలహా సంఘం(బీఏసీ)లో చర్చించలేదని, ఆ బిల్లుపై సభలో చర్చ కోసం సమయం కేటాయించలేదని.. కాబట్టి దానిపై సభలో చర్చ చేపట్టరాదని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ అన్నారు. సభ్యుల అంగీకారం లేకుండా సభా కార్యక్రమాల్లో ఆ బిల్లును చేర్చడాన్ని తప్పుబట్టారు. జైట్లీ బదులిస్తూ.. ‘బిల్లు ఇదివరకు సభ ముందుకొచ్చినపుడు.. దానిపై చర్చ కోసం బీఏసీ 4 గంటలు కేటాయించింది. ఆ తర్వాత బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కొందరు సభ్యులు కోరారు. ఆ కమిటీ ఆ బిల్లును, సవరించిన బిల్లుతో సహా సభకు తిప్పిపంపించింది. దాన్ని ఇప్పుడు పరిశీలనకు తీసుకోవాలి’అని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీ జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇస్తోందని.. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రతి సమావేశాన్నీ స్తంభింపచేస్తోందని పేర్కొన్నారు. జైట్లీ వివరణతో ఆనంద్ శర్మ విభేదించారు. ‘ఈ రోజు ఉదయం బులెటిన్‌ను పరిశీలించాం. ఎటువంటి సమయం కేటాయించలేదు. ఆ బిల్లును చేపట్టజాలరు. దీనిపై రూలింగ్ ఇవ్వాలి. బిల్లుపై బీఏసీలో చర్చించలేదు. అంతకుముందు కేటాయించిన 4 గంటల సమయం ముగిసిపోయింది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులు ఆవేశంగా నినాదాలు చేస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో.. జీఎస్టీ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున.. గందరగోళ పరిస్థితుల్లో దానిని చర్చకు చేపట్టలేనని ఉప సభాపతి పి.జె.కురియన్ పేర్కొన్నారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓట్ల విభజన చేపట్టాల్సి ఉంటుంది. వినియోగాధికార బిల్లులకు ఆమోదం... అంతకుముందు.. లోక్‌సభ ఆమోదం పొందిన ఆర్థిక శాఖ, రైల్వే శాఖ వినియోగాధికార బిల్లులను సభ చర్చ లేకుండా ఆమోదించింది. తర్వాత కాంగ్రెస్ సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య.. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ, బిహార్ రాష్ట్రాలకు చెందిన పలువురు సభ్యులు తమ తమ రాష్ట్రాలకు చెందిన వివిధ అంశాలను ప్రస్తావించారు. జార్ఖండ్‌లో సోమవారం ఒక ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట మృతుల అంశాన్ని లేవనెత్తిన జేఎంఎం సభ్యుడు సంజయ్‌కుమార్.. మృతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచాలని కోరారు. ఓటమిని జీర్ణించుకోలేకే సోనియా, రాహుల్‌ల అవరోధాలు: జైట్లీ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని.. దేశ ప్రగతిని అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారని అరుణ్‌జైట్లీ ధ్వజమెత్తారు. రాజ్యసభ వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనుసరించిన విధానాల వల్లే దేశ ఆర్థిక ప్రగతి మందగించిందని.. ఆ పార్టీ చేసిన పొరపాట్లను రాజకీయంగా, రాజ్యాంగపరంగానూ సరిదిద్దాల్సి ఉందని పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున.. దానిని ఆమోదించాలంటూ మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు అవసరం. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో కాంగ్రెస్‌కు గణనీయంగా 68 మంది సభ్యుల బలం ఉంది. అధికార బీజేపీకి 48 మంది సభ్యులు ఉండగా.. మొత్తం 120 మంది సభ్యుల మద్దతు ఉంది. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 165 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే ఇంకా 45 మంది సభ్యుల మద్దతును కూడగట్టాల్సి ఉంటుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇక రెండు రోజులే మిగిలివున్న నేపథ్యంలో.. జీఎస్టీ బిల్లును వివిధ పార్టీల మద్దతుతో ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులను తక్కువగా చూస్తున్నారు... రాజ్యసభలో ఎస్పీ సభ్యుడు నరేశ్ అగర్వాల్ ప్రొటోకాల్ అంశాన్ని లేవనెత్తారు. లోక్‌సభ సభ్యులకన్నా రాజ్యసభ సభ్యులను తక్కువగా పరిగణిస్తున్నారని.. జిల్లాల్లో విజిలెన్స్ కమిటీలకు రాజ్యసభ సభ్యులు ఎవరినీ ప్రభుత్వం చైర్మన్‌గా నియమించలేదని చెప్పారు. రాజ్యసభ సభ్యుల విదేశీ పర్యటనల విషయంలోనూ లోక్‌సభే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ‘ప్రొటోకాల్ ప్రకారం రాజ్యసభ చైర్మన్.. లోక్‌సభ స్పీకర్ కన్నా ఉన్నతం. ప్రధానమంత్రి కన్నా ఉన్నత హోదా. ఈ సభ సభ్యులను అవమానిస్తారా? దీనిపై స్పీకర్ రూలింగ్ ఇవ్వాలి’అని కోరారు. దీనిపై కురియన్ ప్రభుత్వాన్ని వివరణ కోరగా.. జిల్లాల విజిలెన్స్ కమిటీ నియామకాల విషయంలో తాము కొత్తగా చేసిన ఏర్పాటు కాదని.. గత ప్రభుత్వ విధానాలే అనుసరించటం జరిగిందని.. సభ్యుల మనోభావాలను గౌరవిస్తున్నామని మంత్రి నక్వీ బదులిచ్చారు. కె.సి.త్యాగి(జేడీయూ), మధుసూదన్ మిస్త్రీ(కాంగ్రెస్) కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంటులో రాయితీ ఆహారం వంటి విషయాల్లో రాజకీయ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎంపీలను ఉగ్రవాదులుగా కూడా అభివర్ణిస్తున్నారని అగర్వాల్ ప్రస్తావిస్తాంచారు. -
రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలయ్యాయి. కాగా ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశమైంది. ఈ భేటీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు. -
28 వరకూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈనెల 28వరకూ పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల తర్వాత బీఏసీ సమావేశం కానుంది. మరోవైపు బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీలో డీఎల్ఎఫ్ భూ కేపటాయింపులపై చర్చ జరగనుంది. కాగా నిన్న సభలో డీఎల్ఎఫ్ భూములపై ఇచ్చిన సావధాన తీర్మానంపై సీఎం ప్రసంగం అనంతరం విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. -
9 గంటలకే అసెంబ్లీకి చేరుకోండి: కేసీఆర్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో డీఎల్ఎఫ్ భూ కేటాయింపులపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. శుక్రవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో డీఎల్ఎఫ్ భూ కేటాయింపుల అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో భూ కేటాయింపులపై ఎదురుదాడికి అధికారపక్షం కూడా సిద్ధమవుతోంది. ఉదయం తొమ్మిది గంటలకే అసెంబ్లీకి చేరుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం. అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై చర్చించనున్నారు. -
కేసీఆర్, ఎర్రబెల్లిల మధ్య మాటల యుద్ధం!
-
సయోధ్య యత్నమేదీ?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కాపురం చేసే కళ కాళ్లు తొక్కినప్పుడే తెలిసిపోయిందన్నట్టు ప్రధాన ప్రతిపక్షంతో టీడీపీ ప్రభుత్వం సయోధ్య ఎలా ఉండబోతోందో శాసనసభ తొలి సమావేశాల్లోనే తేటతెల్లమైంది. శాసనసభ కార్యకలాపాల సలహా సంఘం (బీఏసీ) సమావేశాన్ని ఏకపక్షంగా జరిపించుకోవడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. విపక్ష ప్రాతినిధ్యమే లేకుండా బీఏసీ తొలి భేటీ జరిగి, సభ తదుపరి కార్యకలాపాల్ని ఏకపక్షంగా ఖరారు చేసిన తీరు పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. దీన్ని అత్యంత అరుదైన సందర్భంగా, శాసనవ్యవస్థల స్ఫూర్తికి విరుద్ధమైందిగా పేర్కొంటున్నారు. బీఏసీ కూర్పన్నది, ప్రశ్నించలేని స్పీకర్ విస్తృతాధికారాల పరిధిలోని అంశమే అయినా.. పాలకపక్షం చొరవ తీసుకొని సయోధ్యతో కూర్పు జరిపించడం ఆనవాయితీ. సభ కార్యకలాపాల నిర్వహణ అన్నది ప్రభుత్వ బాధ్యత కనుక, సలహా సంఘం కూర్పు విషయంలోనూ ప్రభుత్వం అంతే చొరవ, బాధ్యతగా వ్యవహరించి ఉండాల్సిందన్న భావన వ్యక్తమౌతోంది. శనివారం జరిగిన పరిణామాల్లో ఆ చొరవే లోపించింది. ఫలితంగా విపక్ష ప్రాతినిధ్యమే లేకుండా పాలకపక్షమైన తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన భారతీయ జనతా పార్టీ కలిసి స్పీకర్ సమక్షంలో సభా కార్యకలాపాల్ని నిర్ణయించినట్టయింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే వ్యతిరేకమైన పోకడ అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఒకే ప్రతిపక్ష పార్టీ ఉన్న చోట దామాషా నిష్పత్తిలో ప్రాతినిధ్యం కల్పించాలన్న వైఎస్సార్ సీపీ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందన్న అభిప్రాయం విజ్ఞుల నుంచి వ్యక్తమౌతోంది. పాలకపక్షం పలుమార్లు ప్రతిపాదనలు మారుస్తూ, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సలహామండలిలో ప్రాతినిధ్యాన్ని కుదించే యత్నం సరైంది కాదన్నది పరిశీలకుల వాదన. విపక్షాల్ని కలుపుకుపోవటం ప్రభుత్వ కర్తవ్యం... ‘‘కేవలం సాంకేతికత ఆధారంగా వెళ్లడం కాకుండా, సంప్రదాయాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సభా వ్యవహారాల నిర్వహణలో సహకరించడం ప్రతిపక్షాల బాధ్యత అయినట్టే, విపక్షాల్ని కలుపుకొని పోవడం ప్రభుత్వ కర్తవ్యం’’ అని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఒకప్పుడు చక్కని పద్ధతి ఉండేది. పాలకపక్షం వైపు నుంచి సభానాయకుడి హోదాలో ముఖ్యమంత్రి, శాసనవ్యవహారాల మంత్రి, సభలో సయోధ్య కుదిర్చే చీఫ్ విప్ ఇలా ముగ్గురు మాత్రమే ఉండేవారు. ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు ఆ పార్టీ నుంచి మరొకరికి ప్రాతినిధ్యం ఇచ్చేవారు. దానికి తోడు ఇతర విపక్ష పార్టీలకూ ఎంతో కొంత ప్రాతినిధ్యం ఉండేది కనుక పాలక - విపక్షాల మధ్య సమతూకం ఉండేది’’ అని సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి గుర్తుచేశారు. సంప్రదింపులు జరిపి ఉండాల్సింది... ఇప్పుడు బీఏసీలో పాలకపక్షం నుంచి సభానాయకుడిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనవ్యవహారాల మంత్రి, నీటిపారుదల మంత్రి, చీఫ్ విప్, సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన బీజేపీ ప్రతినిధి.. ఇలా పాలకపక్షం వైపు నుంచి ఆరుగురు అయ్యారు. ఒకే ఒక విపక్షపార్టీ వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరికే ప్రాతినిధ్యమంటే, 6:2 ఏ మాత్రం సమతూకం లేకుండా ఏకపక్షంగా ఉంటుందన్నదే ఇక్కడ కీలకాంశం. ‘‘ఇది సరైన నిష్పత్తి కాదు, మేం ప్రతిపాదించినట్టు మా పక్షాన నలుగురికి ప్రాతినిధ్యం కల్పించండని కోరి.. ప్రభుత్వం ససేమిరా అనడంతో విపక్ష పార్టీ నిరసించినపుడు.. చీఫ్ విప్ గానీ, శాసనవ్యవహారాల మంత్రి గానీ, చివరకు సభ కార్యదర్శి గానీ చొరవ తీసుకుని విపక్షంతో సంప్రదింపులు జరిపి ఉండాల్సింది’’ అని మాజీ స్పీకర్ ఒకరు అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత తలెత్తిన ఎన్నో కష్ట-నష్టాలు, లోపాలు, సమస్యల్నుంచి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసుకోవడానికి అంతా కలిసిరావాలని పిలుపునిస్తున్న ఈ తరుణంలో కీలకమైన శాసనసభా వ్యవహారాల్లో పాలకపక్షపు ఒంటెద్దుపోకడ సమంజసం కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. -
ఆదిలోనే అడ్డం తిరిగారు
బీఏసీలో వైఎస్సార్ సీపీకి చోటుపై అధికారపక్షం తకరారు నలుగురు సభ్యులున్న బీజేపీకి బీఏసీలో ఒక స్థానం 67 మంది సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షం నుంచి ఇద్దరికే అవకాశం కల్పిస్తామని ప్రతిపాదన కనీసం నలుగురిని అనుమతించాలని కోరిన జగన్మోహన్రెడ్డి ససేమిరా అన్న టీడీపీ.. బీఏసీని బహిష్కరించిన వైఎస్సార్ సీపీ ప్రధాన ప్రతిపక్షం లేకుండానే బీఏసీ భేటీ.. అజెండా ఖరారు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాల్లోనే ప్రధాన ప్రతిపక్షంతో సమన్వయంతో వెళ్లాల్సిన ప్రభుత్వం ఆదిలోనే కాలుదువ్వింది. శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) ఏర్పాటులో ప్రధాన ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం కల్పించే విషయంలో ఏకపక్షంగా వ్యవహరించింది. బీఏసీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌కు తగిన అవకాశం కల్పించకుండా ఆ పార్టీ తరఫున కేవలం ఇద్దరికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పలుమార్లు ప్రతిపాదనలను మార్చేసింది. దీంతో అధికార టీడీపీ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ శనివారం జరిగిన బీఏసీ సమావేశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అధికార పక్షం నుంచి బీఏసీలో ఐదుగురు సభ్యులకు అవకాశం కల్పించి ప్రధాన ప్రతిపక్షమైన తమ పార్టీకి కేవలం ఇద్దరు సభ్యులకు మాత్రమే అవకాశం కల్పించడమేంటని వైఎస్సార్ సీపీ నిరసన తెలియజేసింది. ఇద్దరు మంత్రులతో కలిపి మొత్తంగా నలుగురు సభ్యులున్న బీజేపీకి బీఏసీలో చోటిచ్చి వైఎస్సార్ సీపీకి మాత్రం ఇద్దరు సభ్యులను మాత్రమే కేటాయిస్తామని చెప్పడమేంటని ఆ పార్టీ ప్రశ్నించింది. అదేమంటే నిబంధనల పేరు చెప్పి తప్పించుకునేందుకు చూస్తోందని ధ్వజమెత్తింది. వైఎస్సార్ సీపీ తరపున ఎన్నికల్లో 67 మంది గెలిచారని గుర్తుచేస్తూ.. బీఏసీలో తమ పార్టీ తరపున నలుగురికి అవకాశం కల్పించాలని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కోరారు. కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. తాము నిబంధనల ప్రకారం ఇద్దరికే అవకాశం కల్పిస్తామని చెప్పింది. మరో సభ్యుడిని ప్రస్తుత సమావేశాల వరకూ ప్రత్యేక ఆహ్వానితునిగా అనుమతిస్తామని పేర్కొంది. దీంతో బీఏసీని వైఎస్సార్ సీపీ బహిష్కరించింది. ముందు నలుగురు సభ్యుల పేర్లు చెప్పమన్నారు... శాసనసభా కార్యక్రమాల ఖరారు కోసం ఏర్పాటయ్యే బీఏసీ (సభా వ్యవహారాల సలహామండలి)లో మొత్తం 11 మంది సభ్యులుంటారు కనుక ప్రతిపక్ష నేతతో పాటుగా ముగ్గురు పేర్లను ఇవ్వాల్సిందిగా స్పీకర్ నుంచి వైఎస్సార్ సీపీకి తొలుత వర్తమానం అందింది. అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణరావు స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. నలుగురు పేర్లను ఖరారు చేసే లోపే బీఏసీలో మొత్తం సభ్యుల సంఖ్యను 9 మందికి తగ్గిస్తున్నాం కనుక ప్రతిపక్ష నేతతో పాటుగా మరో ఇద్దరి పేర్లను ఇవ్వాలని రెండోసారి సందేశం అందింది. మళ్లీ ఈలోపే ప్రతిపక్ష నేతతో కలిపి ఇద్దరికే అవకాశమిస్తామని తుదిగా కార్యదర్శి సమాచారం తీసుకువచ్చారు. దీంతో అభ్యంతరం తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సభ్యులు అసెంబ్లీలో తమ సంఖ్యాబలాన్ని బట్టి నలుగురికి అవకాశం ఇస్తేనే బీఏసీకి వస్తామని చెప్పారు. కనీసం ముగ్గురికి స్థానం కల్పించాలని చేసిన విజ్ఞప్తి కూడా ఫలించలేదు. ప్రతిపక్ష నేతతో పాటు మరొక్కరే బీఏసీకి రావాలని స్పీకర్ నుంచి తుదిగా వర్తమానం అందడంతో వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం బీఏసీ సమావేశానికి దూరంగా ఉండిపోయింది. తొలి సమావేశంలో పాల్గొనాలనే ఉద్దేశంతో చాలా సేపు అసెంబ్లీలోని తన చాంబర్లో వేచి చూసిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి తమ ఎమ్మెల్యేలతో కలసి అక్కడి నుంచి నిష్ర్కమించారు. వైఎస్సార్ సీపీ సభ్యుల పేర్లు చెప్పలేదు: కాలువ స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినే ని ఉమామహేశ్వరరావు, చీఫ్‌విప్‌గా ఎంపికైన కాలువ శ్రీనివాసులు, బీజేపీ పక్ష నేత ఆకుల సత్యనారాయణ సభ్యులుగా ఉంటారని కాలువ ప్రకటించారు. వైఎస్సార్ సీపీ తరఫున సభ్యులుగా బీఏసీలో ఎవరుంటారో తమకు పేర్లు వెల్లడించలేదని కాలువ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఇందులో సభ్యుడిగా ఉంటారు. సభ జరిగేది మరో రెండు రోజులే శాసనసభ తొలి సమావేశాలు మరో రెండు రోజులు మాత్రమే జరగనున్నాయి. ఈ మేర కు శనివారం శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశాన్ని వైఎస్సార్ సీపీ బహిష్కరించగా మిగిలిన సభ్యులు హాజరయ్యారు. సోమ, మంగళ వారాలు సభ జరుగుతుంది. తొలుత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చకు చేపడతారు. -
సోమవారం నుంచి ఏపి శాసన మండలి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో మండలి కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు సహా పలు మూడు బిల్లులపై చర్చించనట్లుగా తెలిపారు. కాగా అసెంబ్లీ సమావేశాలు సోమ, మంగళవారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఆ రెండు రోజులు గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుందన్నారు. మూడు తీర్మానాలు, ఒక బిల్లు సభలో ప్రవేశపెడతామని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ఘటనలో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలలకు అభినందన తీర్మానం, పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాపై తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఉద్యోగుల వయో పరిమితి బిల్లును ప్రవేశపెడతామని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. -
14 వరకు అసెంబ్లీ
బీఏసీలో నిర్ణయం - నేడు, రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ - 14న పోలవరంపై తీర్మానం, హిమాచల్ దుర్ఘటనపై చర్చ - ఏడాదికి 65-70 రోజుల పాటు సమావేశాలు: సీఎం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 14 వరకు నిర్వహించాలని తెలంగాణ శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఆయన చాంబర్లో బుధవారం ఈ కమిటీ సమావేశమైంది. అధికారపక్షం తరఫున సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మంత్రులు టి.హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రతిపక్ష సభ్యులు జి. చిన్నారెడ్డి(కాంగ్రెస్), ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్ రెడ్డి(టీడీపీ), డాక్టర్ కె.లక్ష్మణ్ (బీజేపీ), పాషా అహ్మద్ ఖాద్రీ(మజ్లిస్), టి.వెంకటేశ్వర్లు(వైఎస్సార్ కాంగ్రెస్), సున్నం రాజయ్య(సీపీఎం), రవీంద్రకుమార్(సీపీఐ) ఈ భేటీలో పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రెండు రోజుల పాటు చర్చించాలని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటైన తరుణంలో గవర్నర్ తొలి ప్రసంగంపై రెండు రోజులపాటు చర్చించాలని బీఏసీ నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగంపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించడానికి గురువారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. దీన్ని సాయంత్రం దాకా కొనసాగించాలని, ఇందుకోసం వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు. 13న కూడా సాయంత్రం దాకా గవర్నర్‌కు ధన్యవాద తీర్మానంపై మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. కనీసం రెండు గంటల పాటు ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశముంది. ఇక 14న అమరవీరులకు నివాళులు, పోలవరం ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా తీర్మానం, హిమాచల్‌ప్రదేశ్‌లో విద్యార్థులు గల్లంతైన దుర్ఘటనపై చర్చ జరగనుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభా సమావేశాలు ముగియనున్నాయి. ఎక్కువ రోజులు సవూవేశమవుదాం: సీఎం ఏడాదికి 70 రోజులపాటు శాసనసభా సవూవేశాలను నిర్వహించుకుందావుని వుుఖ్యవుంత్రి కేసీఆర్ బీఏసీ భేటీలో ప్రతిపాదించారు. గతంలో 30-40 రోజులు కూడా సమావేశాలు జరగలేదని టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు బీఏసీ సవూవేశంలో ప్రస్తావించారు. కొత్త రాష్ట్రంలో తలెత్తే సవుస్యల ప్రస్తావన, వాటిపై చర్చ, పరిష్కారం కోసం కనీసం 60 రోజులైనా సవూవేశాలు నిర్వహించాలని వారు కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ అవసరమైతే 65-70 రోజుల దాకా సవూవేశాలను నిర్వహించుకుందావున్నారు. -
చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసమే...
-
నిర్ణయం బీఏసీదే...
సీఎం నోటీసుపై దిగ్విజయ్ వ్యాఖ్యలు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన బిల్లును వెనక్కి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చిన నోటీసుపై శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) నిర్ణయం తీసుకుంటుందని.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. బిల్లును తిప్పిపంపాలని సీఎం నోటీసు చ్చిన అంశం తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. దిగ్విజయ్ ఆదివారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజన బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘రాజ్యంగ విరుద్ధంగా ఉన్న అంశాలు బిల్లులో ఉంటే వాటిని సరిదిద్దేందుకు రాజ్యాంగంలోనే అవకాశాలు ఉన్నాయి’’ అని ఆయన బదులిచ్చారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ గురించి ప్రశ్నించగా.. ‘‘రాష్ట్ర విభజన బిల్లుపై అభిప్రాయాల కోసమే అసెంబ్లీకి పంపించాం. ప్రస్తుతం అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 87 మంది చర్చలో పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. వారంతా చర్చలో పాల్గొనడం శుభపరిణామం.. వారందరికీ కృతజ్ఞతలు’’ అని దిగ్విజయ్ పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పార్టీలో చర్చ జరుగుతోందని, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారన్న వార్తలపై స్పందించేందుకు దిగ్విజయ్ నిరాకరించారు. దిగ్విజయ్‌తో జానారెడ్డి భేటీ తెలంగాణ ప్రాంత సీనియర్ మంత్రి జానారెడ్డి ఆది వారం మధ్యాహ్నం ఢిల్లీలో దిగ్విజయ్‌తో గంట పాటు భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించడం, లేక తిరస్కరించే హక్కు శాసనసభకు ఉంటుందా? బిల్లు తిప్పి పంపాలంటూ సీఎం ఇచ్చిన నోటీసు సరైనదేనా? అన్న అంశాలపై వారిద్దరు చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, బిల్లుపై ఓటింగ్ లేకుండా కేవలం అభిప్రాయానికే పరిమితం అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా దిగ్విజయ్‌ను జానార కోరారని తెలిసింది. అలాగే.. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులను బరిలో నిలిపి టీఆర్ఎస్ నిలబెడుతున్న అభ్యర్థికి కాంగ్రెస్‌లోని మిగతా సభ్యుల మద్దతు ఇవ్వాలని సూచించినట్లు చెప్తున్నారు. దిగ్విజయ్ స్పందిస్తూ.. తెలంగాణపై అధిష్టానం ముందుగా నిర్ణయించిన మేరకు అంతా జరుగుతుందని, ఫిబ్రవరి పార్లమెంటు సమావేశాల్లో బిల్లు తెచ్చేందుకు అన్ని ప్రయాత్నాలు చేస్తున్నామన్నట్టు సమాచారం. మంత్రులతో చర్చించకుండా సీఎం తీర్మానమా? ప్రభుత్వ పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అదే ప్రభుత్వంలోని మంత్రులతో చర్చించకుండా తీర్మానం తేవడం సబబు కాదని జానారెడ్డి తప్పుపట్టారు. దిగ్విజయ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజనతో తెలంగాణ ప్రాంతమే ఎక్కువ నష్టపోతుందని చెప్తున్న సీఎం.. మరెందుకు అదే తెలంగాణను పట్టుకు వేలాడుతున్నారని ప్రశ్నించారు. -
ఓటింగ్‌పై ఎటూ తేల్చని బీఏసీ
సమావేశానికి సీఎం, చంద్రబాబు డుమ్మా ఓటింగ్, తీర్మానం కోసం వైఎస్సార్ సీపీ పట్టు ఓటింగ్‌పైనా రెండు కళ్ల సిద్ధాంతాన్ని విన్పించిన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు బీఏసీ ఆమోదం తెలిపాకే ఓటింగ్, తీర్మానం నిర్ణయాలు తీసుకోవాలన్న టీఆర్ఎస్.. సానుకూలంగా స్పందించిన స్పీకర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ ఉంటుందా? లేదా? అనే అంశంపై గురువారం సాయంత్రం జరిగిన శాసన సభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశంలోనూ స్పష్టత రాలేదు. ఓటింగ్‌పై స్పష్టతనివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ సహా పలువురు నేతలు కోరినా స్పీకర్ నాదెండ్ల మనోహర్ సూటిగా ఏ విషయం తేల్చలేదు. గతంలో శాసనసభలో అనుసరించిన సంప్రదాయాలు, నిబంధనలను ఇప్పుడూ అనుసరిస్తానని, ఈ విషయంపై ఇటీవల తాను పంపిన నోట్‌ను చదువుకోవాలని సూచించారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చకు రాష్ట్రపతి మరో వారం గడువు ఇచ్చిన నేపథ్యంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే అంశంపైన చర్చ జరిగింది. 26వ తేదీ గణతంత్ర దినోత్సవం (ఆదివారం) మినహా మిగిలిన ఆరు రోజుల్లోనూ సభను కొనసాగించాలని బీఏసీలో తీర్మానించారు. వీలైనంత మేరకు సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని, అవసరమైతే వర్కింగ్ లంచ్‌ను ఏర్పాటు చేసి సాయంత్రం వరకు సభను కొనసాగించాలని నిర్ణయించారు. గతంలో మాదిరిగానే ఈ సమావేశానికి కూడా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు హాజరు కాలేదు. ఆ సమయంలో ఇరువురు నేతలు అసెంబ్లీ లాబీల్లోని తమ కార్యాలయాల్లో ఉన్నారు. అయితే, సమావేశానికి ఇరు ప్రాంతాల నాయకులను పంపి, ఎవరికి అనుకూలమైన వాదనలు వారు వినిపించాలని దిశానిర్దేశం చేయడం గమనార్హం. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి అధికార పార్టీ తరపున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, అనిల్‌కుమార్, ద్రోణంరాజు శ్రీనివాస్, ఆరెపల్లి మోహన్ హాజరయ్యారు. విపక్షాల తరపున అశోక్‌గజపతిరాజు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొత్తకోట దయాకర్‌రావు(టీడీపీ), వైఎస్.విజయమ్మ, శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్ (వైఎస్సార్ కాంగ్రెస్), ఈటెల రాజేందర్, హరీష్‌రావు(టీఆర్ఎస్), అక్బరుద్దీన్(ఎంఐఎం), గుండా మల్లేష్(సీపీఐ), లక్ష్మీనారాయణ(బీజేపీ), జూలకంటి(సీపీఎం), జయప్రకాష్ నారాయణ్(లోక్‌సత్తా) పాల్గొన్నారు. ప్రతి సభ్యుడికీ మాట్లాడే అవకాశం ముందుగా స్పీకర్ మనోహర్ మాట్లాడుతూ.. బిల్లుపై ఇప్పటివరకు సభలో 43 గంటలు చర్చ జరిగిందని, 65 మంది సభ్యులు మాట్లాడారని వివరించారు. మరో ఆరు రోజులు ఉన్నందున అందరికీ మాట్లాడే అవకాశమివ్వాలని అన్ని పార్టీల సభ్యులు కోరారు. ఏ సభ్యుడు ఎంతసేపు మాట్లాడతారో పార్టీలవారీగా ఇవ్వాలని స్పీకర్ కోరారు. ప్రతి సభ్యుడికీ 3 నుంచి 5 నిమిషాల సమయమిస్తానని, ఆ తరువాత సమయాన్నిబట్టి ఎక్కువ సేపు మాట్లాడే వారికి ప్రాధాన్యతనిస్తానని వివరించారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందో లేదో స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు విజయమ్మ, శోభానాగిరెడ్డి పట్టుపట్టారు. సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ 77, 78 నిబంధన కింద గతంలోనే నోటీస్ ఇచ్చామని, దానికి అనుగుణంగానే సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలని కోరారు. మిగతా పార్టీలు ద్వంద్వ వాదనలు వినిపించాయి. ఓటింగ్ జరపాలని సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ సభ్యులు కోరగా, అవసరంలేదని తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు చెప్పారు. బిల్లుపై ఓటింగ్, తీర్మానం వంటి అంశాలను చేపట్టేముందు తప్పనిసరిగా బీఏసీ ఆమోదం తీసుకోవాలని టీఆర్ఎస్ సభ్యులు కోరగా, స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. బిల్లుపై చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన వారం గడువు సరిపోదని, మరింత సమయం కోరుతూ ఈసారి అసెంబ్లీయే తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. దీనిని ఆ పార్టీ తెలంగాణ సభ్యుడు ఎర్రబెల్లితోపాటు టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ సభ్యులు తోసిపుచ్చారు. ఏ ప్రాంత నేతల అభిప్రాయాన్ని టీడీపీ అభిప్రాయంగా తీసుకుంటున్నారని హరీష్‌రావు అడిగారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. టీడీపీ అధినేత హాజరుకాకపోవడం వల్ల బీఏసీ సభ్యుడైన అశోక్‌గజపతిరాజు అభిప్రాయాన్నే ఆ పార్టీ అభిప్రాయంగా భావిస్తున్నానన్నారు. దీనికి ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ‘అశోక్ మా నాయకుడు కాదు. బిల్లుపై ఓటింగ్ జరపాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. బీఏసీ సమావేశానికి సీఎం హాజరుకాకపోవడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ప్రస్తావించారు. దీంతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జోక్యం చేసుకుంటూ ‘మీకు ఒక ప్రాంతంలో పార్టీనే లేదు’ అని అనడంతో శోభానాగిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక ప్రాంతంలో నష్టపోతామని తెలిసీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము గట్టిగా పోరాడుతున్నామని, మీరు మాత్రం రాష్ట్రం సంగతి వదిలేసి పార్టీ బాగుండాలనే కోరుకుంటున్నారంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని అదనపు గడువు కోరుతూ ఎవరు లేఖ రాశారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ స్పీకర్‌ని ప్రశ్నించారు. సీఎం లేఖ రాశారని స్పీకర్ చెప్పారు. తననే లేఖ రాయమని సీఎం కోరినప్పటికీ, సభా నిబంధనల మేరకు రాయనని చెప్పడంతో ఆయనే రాశారని తెలిపారు. చాంబర్‌కే పరిమితమైన బాబు.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో కీలకమైన చర్చ జరుగుతున్న క్రమం.. ఈ సమయంలో స్పీకర్ నిర్వహించిన బీఏసీ సమావేశాలు వేటికీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరు కాలేదు. విభజన బిల్లుపై చర్చకు రాష్ట్రపతి గడువును మరో వారం రోజులు పెంచగా.. ఆ అంశంపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ గురువారం బీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీనికి చంద్రబాబు హాజరుకాలేదు. బీఏసీ సమావేశం నిర్వహించిన హాలుకు నాలుగడుగుల దూరంలో ఉన్న తన చాంబర్లోనే నేతలతో గడిపారు. శాసనసభ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు చేయడానికి డిసెంబర్ 11న స్పీకర్ బీఏసీ నిర్వహించారు. ఆ తర్వాత విభజన బిల్లు, దానిపై తలెత్తిన వివిధ సందేహాలపై స్పీకర్ డిసెంబర్ 17న, ఆ తర్వాత జనవరి 6న మరోసారి బీఏసీ సమావేశాలు నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కూడా వీటిలో దేనికీ చంద్రబాబు హాజరుకాలేదు. -
సభలోనే అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిది
హైదరాబాద్: ప్లోర్లీడర్ల అభిప్రాయాలను శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బిజినెస్ అడ్వైజరీ కమిటీ-బీఏసీ) సమావేశంలో కాకుండా శాసనసభలోనే తీసుకుంటే మంచిదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి, తెలంగాణ బిల్లుపై చర్చకు సంబంధించి నేతలు బీఏసీలో ఒక మాట, బయట మరోమాట మాట్లాడుతున్నారని చెప్పారు. అందువల్ల వారి అభిప్రాయాలు సభలో తెలుసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. బిఏసి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో సమైక్య తీర్మానానికి పట్టుపడుతుంటే, కాంగ్రెస్, టిడిపి సభ్యులు మాత్రం రెండు అభిప్రాలు చెబుతున్న విషయం తెలిసిందే. -
బీఏసీ భేటీకి చంద్రబాబు, కిరణ్ డుమ్మా
హైదరాబాద్ : బీఏసీ సమావేశం కొనసాగుతోంది. అయితే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కీలక భేటీకి డుమ్మా కొట్టారు. బీఏసీకి అన్ని పార్టీల శాసనసభా పక్షనేతలు హాజరు అయ్యారు. వైఎస్ఆర్సీపీ నుంచి నలుగురు సభ్యులు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ వైఎస్ విజయమ్మతోపాటు.. డిప్యుటీ ఫ్లోర్ లీడర్లు..శోభా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్.. పార్టీ విప్.. బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరుకాగా.. టీడీపీనుంచి ఆరుగురు సభ్యులు హాజరయ్యారు. డిప్యుటీ సీఎంతోపాటు..అసెంబ్లీ వ్యవ హారాలశాఖా మంత్రి శైలజానాథ్, రఘువీరారెడ్డి, ఆనం.. కాంగ్రెస్ పార్టీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరేపల్లి మోహన్, అనిల్ బీఏసీకి హాజరయ్యారు. -
సభాపతి స్థానాన్ని కించపర్చొద్దు: భట్టివిక్రమార్క
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై శాసనసభలో చర్చ ప్రారంభమే కాలేదంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క తోసిపుచ్చారు. శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) తీసుకున్న నిర్ణయం మేరకే.. రాష్ర్టపతి పంపిన బిల్లును సభ ముందుంచడంతో పాటు చర్చను కూడా ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంతో మాట్లాడాకే శాసనసభ షెడ్యూల్‌ను ప్రకటించామన్నారు. శాసనసభాపతి స్థానాన్ని అగౌరవపరిచేలా ఎవరూ మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘‘ఈ నెల 11న జరిగిన బీఏసీ సమావేశానికి అనుగుణంగానే రాష్ట్రపతి పంపిన బిల్లును సభలో టేబుల్ చేశాం. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చర్చను ప్రారంభించారు. ప్రభుత్వంతో మాట్లాడిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరికైనా ఏవైనా అనుమానాలుంటే రికార్డులను పరిశీలించుకోవచ్చు. అలాగే 17న జరిగిన బీఏసీ నిర్ణయంలో భాగంగానే శాసనసభ షెడ్యూల్‌ను రూపొందించి ప్రకటించాం. ఆ రోజు సమావేశంలో సీఎం కూడా ఉన్నారు’’ అని భట్టి గుర్తు చేశారు. సభను అడ్డుకోవడమంటే ప్రజాస్వామ్యాన్ని అడ్డుకున్నట్లుగానే భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇకనైనా ఉన్న సమయాన్ని వినియోగించుకుని స్పష్టంగా, హుందాగా అభిప్రాయాలు చెబుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సభలో చర్చ జరగకుండా సభ్యులు కాగితాలను విసరడం బాధాకరమన్నారు. -
విభజన బిల్లుపై చర్చ మొదలైంది
-
టీఆర్ఎస్కు సహకరిస్తున్నసీఎం : శోభానాగిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు) విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్కు సహకరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభానాగిరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిద్దామని గతంలో చెప్పిన సీఎం శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ఆమె ప్రశ్నించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీఏసీ సమావేశానికి వస్తే ఫలితముండేదన్నారు. బీఏసీలో టీడీపీ సభ్యులు ద్వంద్వవైఖరి అవలంబించారని విమర్శించారు. బీఏసీలో తాము సమైక్య వాణి వినిపించినట్లు తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై రేపటి చర్చను అడ్డుకుంటామని శోభానాగిరెడ్డి హెచ్చరించారు. -
విపక్ష సభ్యుల ఆందోళన మధ్య అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్ : విపక్ష సభ్యుల నిరసనలతో మంగళవారం మధ్యాహ్నం ఆరంభమైన శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. ఇదే సమయంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. తొలుత ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ కొద్ది నిముషాల్లోనే అరగంటపాటు వాయిదా పడింది. ఇరు ప్రాంత నేతలు జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శాసనమండలి బీఏసీ అనంతరం అసెంబ్లీ బీఏసీ సమావేశం జరగనుంది. తెలంగాణ బిల్లుపై రేపటి నుంచి చర్చిస్తారు. తెలంగాణ బిల్లు అంశాన్ని మూడు రోజులపాటు అసెంబ్లీ చర్చించే అవకాశం ఉంది. -
ప్రారంభమైన శాసనసభ బిఏసి భేటి
-
ముగిసిన మండలి బీఏసీ భేటీ
-
ముఖ్యమంత్రి కిరణ్ తో తెలంగాణ మంత్రులు భేటీ
-
అసెంబ్లీలో సమైక్యాంధ, తెలంగాణ నినాదాలు
-
అసెంబ్లీలో సమైక్యాంధ్ర తెలంగాణ నినాదాలు
హైదరాబాద్ : విపక్ష సభ్యుల నిరసనలతో శాసనసభ ప్రారంభం అయిన కొద్ది నిముషాల్లోనే అరగంటపాటు వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. ఇదే సమయంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా స్పీకర్ ఎదుట నిరసన తెలుపుతున్న సీమాంధ్ర ఎమ్మెల్యేల చేతిలో ఉన్న ప్లకార్డులను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాక్కున్నారు. మరోవైపు బీఏసీ సమావేశం దృష్ట్యా అసెంబ్లీని స్పీకర్ అరగంటపాటు వాయిదా వేశారు. శాసనమండలి బీఏసీ అనంతరం అసెంబ్లీ బీఏసీ సమావేశం జరగనుంది. -
నేడు బీఏసీ సమావేశం
భేటీలో తేదీ ఖరారయ్యాకే విభజన బిల్లుపై చర్చ సీమాంధ్ర నేతలకు స్పీకర్ నాదెండ్ల స్పష్టీకరణ .. సభ తీరు నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్య ప్రశ్నోత్తరాల తర్వాత బీఏసీ.. సాయంత్రం మండలి బీఏసీ చర్చ మొదలైందన్న శ్రీధర్ తీరుపై సీమాంధ్ర నేతల అసంతృప్తి ప్రసంగాన్ని పరిశీలించిన సీఎం, మంత్రులు తెలంగాణ ముసాయిదా బిల్లుపై సోమవారం అసెంబ్లీలో చర్చ ప్రారంభమైందా, లేదా అన్న అంశంపై పార్టీలకు అతీతంగా సీమాంధ్ర, తెలంగాణ శాసనసభ్యులు, నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం సాగుతున్న నేపథ్యంలో... సభలో చర్చ ఇంకా ప్రారంభం కాలేదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో తేదీని నిర్ణయించాకే దానిపై చర్చను చేపట్టాల్సి ఉంటుందని ఆయన వివరించారని తెలిసింది. ఈ వ్యవహారంపై సీమాంధ్ర మంత్రులు తదితర నేతలు స్పీకర్‌ను సంప్రదించారు. దాంతో ఆయన అధికారులతో సభ రికార్డులు పరిశీలింపజేశారని, చర్చ ప్రారంభం కాలేదని తేల్చారని సమాచారం. ‘‘బీఏసీ సమావేశంలో తేదీని నిర్ణయించాకే చర్చ ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత బీఏసీని నిర్వహిస్తున్నాం’’ అని వారికి స్పీకర్ వివరించినట్టు సమాచారం. అంతేగాక సోమవారం మధ్యాహ్నం సభలో జరిగినవన్నీ నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయని కూడా ఆయన అన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసంలో జరిగిన సీమాంధ్ర మంత్రుల సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది. సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ స్పీకర్ మల్లు భటి ్ట విక్రమార్క సభాపతి స్థానంలో కూర్చుని సభను నిర్వహించినప్పుడు ఆయన, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చేసిన ప్రసంగాలను కూడా కిరణ్, మంత్రులు పరిశీలించారు. తెలంగాణ బిల్లుపై చర్చను ప్రారంభిస్తున్నట్టుగా కాకుండా, ‘బిల్లుపై చర్చను ప్రారంభించాలా, లేదా అన్న అంశంపై అభిప్రాయాలు తెలుసుకొనే రీతిలోనే’ సభ సాగిందని తేల్చారు. అంతేగాక బీఏసీని సమావేశపరచకుండానే చర్చను ఎలా చేపడతారని కూడా మంత్రులు ప్రశ్న లేవనెత్తారు. దీనిపై శ్రీధర్‌బాబు తీరును పలువురు సీమాంధ్ర మంత్రులు తప్పుబట్టారు. బిల్లుపై చర్చ ప్రారంభం కాలేదని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ‘‘ముసాయిదా బిల్లుపై చర్చను చేపట్టే అంశంలో సభ్యులను డిప్యుటీ స్పీకర్ అభిప్రాయాలు అడిగారు. అందులో భాగంగానే శ్రీధర్‌బాబు మాట్లాడారు. బీఏసీ పెట్టి బిల్లుపై చర్చ తేదీని ఖరారు చేయాలని కూడా శ్రీధర్‌బాబే తన ప్రసంగంలో చెప్పారు. దీన్ని బిల్లుపై చర్చగా ఎలా భావిస్తారు?’’ అంటూ ప్రశ్నించారు. మంత్రి శైలజానాథ్ కూడా బిల్లుపై చర్చ జరిగిందనడాన్ని ఖండించారు. ‘‘చర్చ ఎక్కడ జరిగింది? కనీసం బిల్లును టేబుల్ చేయకుండానే చర్చను ఎలా ప్రారంభిస్తారు? బిల్లును ఈ రోజే ఇచ్చి, సభ్యులు చదవకుండానే చర్చను ప్రారంభిస్తారా? ఇదేం పద్ధతి?’’ అంటూ మండిపడ్డారు. మరోవైపు మంగళవారం సాయంత్రం శాసనమండలి బీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. -
బీఏసీతో సంబంధం లేకుండానే చర్చించొచ్చు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్రపతి నుంచి వచ్చిన విభజన బిల్లుపై శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) నిర్ణయంతో సంబంధం లేకుండానే అసెంబ్లీలో చర్చకు చేపట్టవచ్చునని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అసెంబ్లీ నిబంధనలు (కౌల్ అండ్ శక్దర్) 8వ చాప్టర్ ఆ విషయాన్ని స్పష్టం చేస్తుందన్నారు. ఆ విధంగా చర్చ చేపట్టే అధికారం స్పీకర్‌కు ఉంటుందని వెల్లడించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును మించి చర్చించాల్సిన ప్రాధాన్యాంశం ఏముంటుందని ప్రశ్నించారు. రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి నుండి వచ్చిన బిల్లును చర్చించకపోతే అటు రాష్ట్రపతికి, ఇటు శాసనభకు కూడా అవమానమేనన్నారు. ముసాయిదా బిల్లులో సవరణలకు సూచనలు చేసే అవకాశం మాత్రమే శాసనసభకు ఉందని, అభిప్రాయాలను కచ్చితంగా సవరించాలనే హక్కు కూడా అసెంబ్లీకి లేదన్నారు. విభజన అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే ఉన్న సార్వభౌమాధికారం అని వివరించారు. ‘ఏనుగు ఎల్లింది. తోక చిక్కింది. అది కూడా అయిపోతది. కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. దీనిని ఎవరూ ఆపలేరు. చరిత్రలో చారిత్రక మలుపులను అంగీకరించాలి. అప్పట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టడం ఒక చారిత్రక మలుపు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు కూడా ఒక చారిత్రక మలుపు. వీటిని హూందాగా అంగీకరించాలి. అడ్డుకోవాలనుకునే చంద్రబాబు వంటివారు చరిత్ర అనే రోడ్డురోలర్ కింద పడి నలిగిపోతారు. ఎవరూ వెయ్యేళ్లు బతకడానికి రాలేదు. ఉన్నంతకాలం చేసిన మంచి పనులు మాత్రమే చరిత్రలో మిగులుతయి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంకా మూర్ఖపు వాదనలతో బిల్లును అడ్డుకోవాలని ప్రయత్నించడం వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన నాయకులే ఈ పరిస్థితులకు కారణమన్నారు. 371(డి) అనే ఆర్టికల్ రాష్ట్ర విభజనకు అవరోధం కాదని, అలాంటి పనికిమాలిన అంశాలపై సవరణకు చర్చ కూడా అవసరం లేదన్నారు. తెలుగులోకి అనువాదం చేయడం పెద్ద సమస్య అనడం కూడా రంధ్రాన్వేషణ చేసేవారికి ఒక వినోదం మాత్రమే అని కొట్టిపారేశారు. కేంద్ర, పార్లమెంటు, రాష్ట్రపతి స్థాయిలో వచ్చే బిల్లులన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయని, ప్రాంతీయ భాషల్లో ఉండవని, వాటిని అనువదించుకోవాల్సిన బాధ్యత సభ్యులదేనని వివరించారు. చంద్రబాబు ఓ కాలాంతకుడు ‘చంద్రబాబు ఓ కాలాంతకుడు. తెలంగాణను అడ్డుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారొచ్చు. అయితే తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామంటూ బీజేపీ చాలాసార్లు ప్రకటించింది. తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు చేసే కుట్రలేవీ సాగవు. రాష్ట్ర విభజన తప్పదని తేలిపోయిన తర్వాత బాబుకు మతి భ్రమించింది. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నడు. బిల్లు విమానంలో తెస్తరా? అర్థరాత్రి తెలంగాణ ఇస్తరా? అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నడు. ముఖ్యమైన విభజన బిల్లు విమానంలో రాకుంటే సైకి ల్ మీద వస్తదా? ఎడ్లబండి మీద వస్తదా? ఏమన్నా సోయి ఉండే మాట్లాడ్తున్నడా. పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ చనిపోతే చంద్రబాబు ప్రత్యేక విమానంలో పోలేదా? అప్పుడు మేమేమన్నా తప్పుబట్టినమా? తెలంగాణలో టీడీపీ పూర్తిగా చచ్చిపోయింది. పార్టీ నుండి కొందరు ఎమ్మెల్యేల చేరికలు ఉంటయి. అలాంటి బాబుతో చర్చలకు మాకేం పని? ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఏమైనా చర్చించొచ్చు. పక్క రాష్ట్రానికి చెందిన చంద్రబాబుతో మేమెందుకు టైం వేస్టు చేసుకోవడం. ఆంధ్రాలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే మాకేం సంబంధం?’ అంటూ ధ్వజమెత్తారు. నిజాం షుగర్స్‌ను సాధీనం చేసుకోవాలి : హరీష్ టీడీపీ హయాంలో ప్రైవేటు పరం చేసిన నిజాం షుగర్స్‌ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ గతంలో శాసనసభాసంఘం ఇచ్చిన నివేదికను ఆమోదించాలని, ప్రభుత్వమే దానిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక చర్చ కోసం దూకుడే అసెంబ్లీలో బిల్లు ప్రతులను అందించిన తర్వాత చర్చ కోసం దూకుడుగా వ్యవహరించాలని టీఆర్ఎస్ శాసనసభ్యులకు పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, అధికారపార్టీకి చెందినవారిపై ఒత్తిడి తీసుకురావాల్సిన మార్గాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. చర్చకు అనుమతించేదాకా ఎంతటి పోరాటమైనా చేయాలని సూచించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలకు అవసరమైన సహకారం అందించాలన్నారు. ఎప్పటికప్పుడు అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ చర్చకు అనివార్య పరిస్థితులను కల్పించాలన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించే వీలుంటే అధికారపార్టీకి చెందిన వారిపై రాజీనామాకు ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాన్ని కూడా చూడాలన్నారు. రాజ్యాంగ సంక్షోభం, గవర్నర్ ద్వారా ఒత్తిడికి అనుసరించాల్సిన వ్యూహం, వీలైతే రాజ్‌భవన్‌కు ఎమ్మెల్యేల ర్యాలీ వంటివాటిపై ఎప్పటికప్పుడు అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయించుకోవాలని కేసీఆర్ సూచించారు. సభ్యులందరూ విధిగా సభకు హాజరుకావాలని కోరారు.అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసే బాధ్యతలను ఈటెల రాజేందర్, హరీష్‌రావు, కేటీఆర్‌లకు అప్పగిం చారు. కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే షిండే భేటీ టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో టీడీపీకి చెందిన జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్‌షిండే ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో టీఆర్ఎస్లో షిండే చేరడం విషయంపై చర్చించారు. మిగిలినవారిలో ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశముందా అనే విషయంపైనా చర్చ జరిగింది. -
బిల్లుపై చర్చను బిఏసిలో నిర్ణయిస్తాం