అసెంబ్లీ సమావేశాలు పెడతామని శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)కి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి కూడా విలువ లేదా అని కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రశ్నించింది. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, వాటిపై చర్చలు జరిపి పరిష్కరించడానికి వెంటనే శాసనసభ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు.
Published Tue, Dec 6 2016 10:41 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement